నిజామాబాద్ అర్బన్: తెలంగాణ యూనివర్సిటీలోని తెలుగు పీహెచ్‌డీ ప్రవేశాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కనీస నిబంధనలు పాటిం చకుండా ఇష్టారీతిన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని అంటున్నారు. అర్హులైన విద్యార్థులు మూడు నెలలుగా యూనివర్సిటీ చుట్టు తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
గత ఆగస్టు నెలలో పీహెచ్‌డీ ప్రవేశాలు జరిగాయి. 26 సీట్లకుగాను 86 మంది ఇంటర్వ్యూలకు హాజ రయ్యారు. ఇందులో నెట్‌సెట్ రాసిన వారు ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో ముగ్గురికి మాత్రమే ప్రవేశం కల్పించి మిగితావారికి మొండిచేయి చూపించారు. పీహెచ్ డీ ప్రవేశాలకు అర్హత సాధించని విద్యార్థి సంఘం నాయకులకు ప్రవేశం కల్పించారు.
ఏం జరిగింది?
పీహెచ్‌డీ ప్రవేశాల జాబితా వెల్లడి ఆగానే అందులో అక్రమాలు జరిగాయంటూ, అర్హత సాధించని నలుగురు విద్యార్థి సంఘం నాయకులు మూడు రోజులపాటు ఆం దోళన చేశారు. తమకు కూడా ప్రవేశాలు కల్పించాలని పట్టుబట్టారు. అధికారులను మాయచేసి ప్రవేశాల నివేదికను రెండవసారి రూపొందింపజేశారు. విద్యార్థి సంఘం నాయకులు నలుగురు అర్హత సాధించినట్లు యూనివర్సిటీ అధికారులు రెండవ జాబితాను పెట్టారు.
దీంతో, అంతకు ముందు అర్హత సాధించిన స్వప్న, గాయత్రి అనే ఇద్దరు విద్యార్థినులు అనర్హులుగా మారిపోయారు. నిబంధనల ప్రకారం ముగ్గురు సభ్యుల బృందం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయాలి. ఇందులోనూ అనర్హు లకే అవకాశం లభించింది. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని యూనివర్సిటీ అధికారులతో తీవ్ర వాగ్వివాదానికి దిగడంతో అధికారులు ఆమెకు ప్రవేశం కల్పించారు. ఇందులో విద్యార్థి సంఘాల నాయకులే కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. 40 సంవత్సరాలు దాటినా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఓ నా యకుడికి సైతం పీహెచ్‌డీ సీటు లభించడం గమనార్హం. ప్రవేశాలకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన లిస్టును టీయూ అధికారులు గల్లంతు చేసినట్లు తెలిసింది.
బోర్డు అధికారులు ఏం చేసినట్లు!
పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ముగ్గురు సభ్యుల బృందం ఉంటుంది. ఇందులో వర్సిటీ ప్రిన్సిపాల్, సీనియర్ తెలుగు లెక్చరర్, మరో అధికారి ఉంటారు. వీరు పీహెచ్‌డీ ప్రవేశం కోరే అభ్యర్థుల నెట్‌సెట్ ఉత్తీర్ణత, సంబంధిత సబ్జెక్టులలో అనుభవం, ఇంటర్వ్యూలో మార్కుల విధానం, సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంటుంది. అన్నీ సక్ర ంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే జాబితాను వెల్లడించాలి. కానీ, ఈ బృందం కూడా ఉన్నతాధికారుల ఒత్తిడికి తలొగ్గినట్లు తెలిసింది.
ఈ ఇంటర్వ్యూకు వచ్చిన ఓ విద్యార్థి ‘‘నేను అర్హురాలిని నాకు ఎందుకు ప్రవేశం కల్పించలేదని’’ ప్రశ్నించగా, ‘‘ఒక్కొక్కరికి పది వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మీరు భరించగలరా’’ అ ని ఓ అధికారి ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. తమ తప్పులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూనే, ప్రవేశాలపై ప్రశ్నించిన అధికారులు, విద్యార్థులను విద్యార్థి సంఘం నాయకులతో బెదిరించారని ఓ విద్యార్థి వాపోయాడు. ఈ వ్యవహారమంతటిపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
అనర్హులకు అందలం
Published Thu, Nov 13 2014 3:02 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement