క్లిక్ చేస్తే చాలు.. | Transparency portal launched for Gas consumers | Sakshi
Sakshi News home page

క్లిక్ చేస్తే చాలు..

Published Wed, Oct 23 2013 4:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఆధార్’పై సామాన్య జనాలకు అనుమానాలెన్నో తలెత్తుతున్నాయి.

డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఆధార్’పై సామాన్య జనాలకు అనుమానాలెన్నో తలెత్తుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల రాయితీలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఆధార్‌పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం మిగిలిన అంశాల్లో కొంత వెనక్కు తగ్గినా, వంట గ్యాస్ సిలిండర్ విషయంలో మాత్రం ఖచ్చితం గా ఆధార్ నమోదు కోరుతోంది. వంటగ్యాస్‌కు సంబంధించి రాయితీ సొమ్మును పొందడానికి వినియోగదారుడు ఆధార్‌నంబరు, బ్యాంకు ఖా తా నంబరును గ్యాస్ కంపెనీలకు సమర్పిం చా ల్సి ఉంటుంది. ఈమేరకు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ  చేసింది. జిల్లాలోని చాలామంది వినియోగదారులు ఇప్పటికే తమ ఆధార్‌నంబర్లను గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకర్లకు అందజేశారు.
 
 వినియోగదారులకు సిలిండర్‌కు సంబంధించిన సబ్సిడీ నేరుగా వారి ఖతాల్లో జమవుతుంది. ఈ నగదు బదిలీ పథ కం జిల్లాలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైంది. ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు సదు రు గ్యాస్ ఏజెన్సీకి అందాయా లేదా.. బ్యాంకు నంబరు సక్రమంగానే ఉందా.. తప్పు గా నమో దు అయ్యిందా.. అన్నీ సక్రమంగా ఉన్నా రాయి తీ ఖాతాలో జమ అవుతుందా.. లేదా? ఇలా ఎన్నో రకాల అనుమానాలు విని యోగదారుల్లో అందోళన రేకెత్తిస్తున్నాయి. ఒక వేళ ఆధార్ నంబరు గ్యాస్ కనెక్షన్‌కు జత కాకపోతే ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ వివరాలు తెలుసుకోవాలనే సందేహాలతో వినియోగదారులు అయోమయంలో పడిపోతున్నారు. విని యోగదారుల అందోళనను దృష్టిలో ఉంచుకుని ఆయా గ్యాస్ ఏజెన్సీలు ప్రత్యేకంగా ట్రాన్స్‌పరెన్సీ (పారదర్శకత) పోర్టల్‌ను ఏర్పాటు చే శాయి. ఈ విషయ మై స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తమ పరిధిలోని వినియోగదారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సదుపా యం ఉన్న వినియోగదారులు ఇంటి వద్దే నేరు గా తమ ఆధార్ నెంబరు ఏజెన్సీలో నమోదు,  బ్యాంకుతో అనుసంధానం వివరాలను తెలుసుకునే వీలు ఏర్పడింది.
 
 మీ గ్యాస్ డీలరుకు సం బంధించిన ఇంటర్నెట్ వెబ్‌సైట్ (భారత్, ఇం డేన్, హెచ్‌పీ కంపెనీల్లో ఏదైతే దానిని..) ఎంచుకోవా లి. గ్యాస్ కంపెనీకి చెందిన ట్రాన్స్‌పరెన్సీ ఫోర్టల్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం గూగుల్ సెర్చ్ ఉపయోగపడుతుంది. గూగుల్ హోం పేజీలో మనకు కావాల్సిన గ్యాస్ కంపెనీ పేరు ఎంటర్ చేయగానే అందులో కంపెనీకి సంబంధించిన వివరాలతో పాటు ట్రాన్స్‌పరెన్సీ పోర్టల్‌కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. టాన్స్‌పరెన్సీ పోర్టల్‌ను ఎంచుకున్న అనంతరం రాష్ట్రం, జిల్లా, డిస్ట్స్రిబ్యూటర్ పేరు ఎంటర్ చేయాలి. ఆపై వినియోగదారుడి గ్యాస్ కనెక్షన్ నెంబరు ఎంటర్ చేయగానే ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా అనుసంధానం వివరాలు తెలుసుకోవచ్చు. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి ‘ఆధా ర్ లింకింగ్ స్టేటస్ ఇన్ ఎల్‌పీజీ’, ‘ఆధార్ లిం కింగ్ స్టేటస్ ఇన్ బ్యాంక్స్’, మేసేజ్ అనే వివరా లు ఉంటాయి. ఆధార్ వివరాలు గ్యాస్ డీలర్ల వ ద్ద, బ్యాంకులో అనుసంధానమై ఉంటే ఆకుపచ్చ రంగులో కన్పిస్తుంది. లేదంటే ఎరుపు రంగు, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఆధార్ నం బరు అనుసంధానమైతేనే ప్రభుత్వ రాయితీ వినియోగదారుడి  ఖాతాలోకి జమవుతుందని  ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement