రాబోయే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోంది.
పంజాబ్‌లో ఇంటింటికీ ఉచిత రేషన్ పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఇంటి వద్దనే రేషన్ అందుకోవచ్చు. మొదటి దశలో పంజాబ్‌లోని 25 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల గోధుమ పిండిని ఉచితంగా అందజేస్తారు. మిగిలిన రేషన్ సరుకులను దఫదఫాలుగా అందించనున్నారు.
పంజాబ్‌లో 38 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. 20, 500 ప్రభుత్వ రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,500 మందికి పైగా యూత్ డెలివరీ ఏజెంట్లు ఉన్నారు. మొదటి దశలో 25 లక్షల కుటుంబాలకు రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రతి నెలా ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందుకోవచ్చు. లబ్ధిదారులు గోధుమపిండి స్థానంలో ఇతర అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు లబ్ధిపొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment