సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మతిస్థిమితం లేని మహిళ.. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన తన భర్త శవంతో మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఉద్యోగి లింబారెడ్డి(64), శకుంతల దంపతులు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో, కుమార్తె లండన్‌లో ఉంటున్నారు. బుధవారం ఇంటికి పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తికి దుర్వాసన రావడంతో ఇంట్లోకి వెళ్లలి చూడటంతో రక్తపు మడుగులో లింబారెడ్డి శవం కనిపించింది. (మిర్యాలగూడలో దంత వైద్యురాలి ఆత్మహత్య)
దీంతో స్థానికులకు, పక్కన ఉన్న నిజామాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. లింబారెడ్డి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుని భార్య శకుంతకు మతిస్థిమితం లేదని స్థానికులు తెలిపారు. ఈ దంపతులు స్థానికులతో సరిగ్గా మాట్లాడేవారు కాదన్నారు. అయితే లింబారెడ్డి శవం రక్తపు మడుగులో ఉండటంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఘటనా విషయాన్ని అతని కుమారుడు, కుమార్తెకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (కౌలు డబ్బుల కోసం కన్నతల్లికి నిప్పు)
Comments
Please login to add a commentAdd a comment