సాక్షి, నిజామాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనాతో మృతి చెందిన బాధితుని మృతదేహం తారుమారు కావడంతో నిజామబాద్ జిల్లాలో కలకలం రేగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి బదులు మరో మృతదేహాన్ని తీసుకువచ్చిన ఆసుపత్రి నిర్వాకంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హనుమంతు(58) కరోనా బారిన పడి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. (చదవండి: అలర్ట్ : హైదరాబాద్‌లో కుండపోత వర్షం)
అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఆయన స్వ గ్రామానికి ఆస్పత్రి సిబ్బంది తీసుకొచ్చారు. అంతిమ సంస్కారానికి కొన్ని క్షణాల ముందు మృతదేహాలు తారుమారు అయినట్లు ఆసుపత్రి వర్గాలు గుర్తించడంతో.. వెంటనే అంత్యక్రియలు నిలిపివేయాలని అంబులెన్స్ డ్రైవర్‌కు సమాచారం అందించారు. దీంతో అంత్యక్రియలు నిలిచిపోవడంతో అయోమయానికి గురైన బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతు మృతదేహాన్ని తీసుకొచ్చి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువుల పట్టు బట్టారు.
Comments
Please login to add a commentAdd a comment