exchanged
-
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల మార్పిడి
సుదీర్ఘ కాలం తర్వాత రష్యా, ఉక్రెయిన్లు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది పలు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. యుద్ధం మధ్య రష్యా, ఉక్రెయిన్లు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని పలు దేశాలు పేర్కొంటున్నాయి.ఉక్రెయిన్- రష్యాలు తాజాగా యుద్ధ ఖైదీలుగా ఉన్న ఇరు దేశాలకు చెందిన చెరో 75 మంది సైనికులను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ఈ విషయాన్ని అధికారులు మీడియాకు తెలియజేశారు. గత మూడు నెలల్లో ఇరు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి జరగడం ఇదే తొలిసారి.నలుగురు ఉక్రేనియన్ పౌరులతో సహా ఈ యుద్ధ ఖైదీలను ఉత్తర సుమీ ప్రాంతానికి పలు బస్సులలో తరలించారు. బస్సు దిగిన వెంటనే వారు ఆనందంతో కేకలు వేయడంతో పాటు, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తాము స్వదేశానికి తిరిగి వచ్చిన విషయాన్ని తెలియజేశారు. వీరిలోకి కొందరు మోకాళ్లపై వంగి నేలను ముద్దాడటం కనిపించింది. మరికొందరు పసుపు, నీలి రంగు జెండాలను పట్టుకుని ఒకరినొకరు కౌగిలించుకుని రోదించారు.ఈ విధమైన యుద్ధ ఖైదీల మార్పిడికి ముందు, ఇరుపక్షాలు సైనికుల మృతదేహాలను పరస్పరం అప్పగించుకున్నాయని, ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఇలా జరగడం ఇది 52వ సారని అధికారులు తెలిపారు. ఉక్రేనియన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ మొత్తం 3,210 మంది ఉక్రేనియన్ సైనిక సిబ్బంది, పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు. -
రూ.2000 నోట్ల ఉపసంహరణ .. ఎంత శాతం వెనక్కి వచ్చాయంటే?
ఈ ఏడాది మేలో రూ.2,000 నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి జూన్ 24 నాటికి బ్యాంకుల్లో 72 శాతం (సుమారు రూ.2.62 లక్షల కోట్లు) రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదంటే మార్చుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆర్బీఐ మే19న రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని కోరింది. నోట్ల ఉపసంహరణ,డిపాజిట్లను సులభతరం చేసేలా, బ్యాంకుల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేలా రూ.2వేల నోట్లను ఏ బ్రాంచ్‌లోనైనా ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. మే 23 ఆర్బీఐ సర్క్యులర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీని అనుసరించి రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించబడింది. రూ. 2,000 డినామినేషన్లో ఉన్న నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని పేర్కొంది. చదవండి👉 స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా? -
కరోనా: బాధితుడి మృతదేహం తారుమారు
-
కరోనా బాధితుడి మృతదేహం తారుమారు
సాక్షి, నిజామాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనాతో మృతి చెందిన బాధితుని మృతదేహం తారుమారు కావడంతో నిజామబాద్ జిల్లాలో కలకలం రేగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి బదులు మరో మృతదేహాన్ని తీసుకువచ్చిన ఆసుపత్రి నిర్వాకంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హనుమంతు(58) కరోనా బారిన పడి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. (చదవండి: అలర్ట్ : హైదరాబాద్‌లో కుండపోత వర్షం) అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఆయన స్వ గ్రామానికి ఆస్పత్రి సిబ్బంది తీసుకొచ్చారు. అంతిమ సంస్కారానికి కొన్ని క్షణాల ముందు మృతదేహాలు తారుమారు అయినట్లు ఆసుపత్రి వర్గాలు గుర్తించడంతో.. వెంటనే అంత్యక్రియలు నిలిపివేయాలని అంబులెన్స్ డ్రైవర్‌కు సమాచారం అందించారు. దీంతో అంత్యక్రియలు నిలిచిపోవడంతో అయోమయానికి గురైన బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతు మృతదేహాన్ని తీసుకొచ్చి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువుల పట్టు బట్టారు. -
ఆ ఇద్దరి మధ్య తేడాలొచ్చాయా?
ముంబై: బాలీవుడ్ ఖాన్ ద్వయం మధ్య విభేదాలొచ్చాయని బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. బాలీవుడ్ సినిమా మీడియా సమాచారం ప్రకారం ఆ ఖాన్ లిద్దరూ ఒకర్ని ఒకరు పొగుడుకుంటూనే సెటైర్లు వేసుకుంటున్నారట. ఇంతకీ వారిద్దరూ మరెవ్వరో కాదు కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ ఫరఫెక్టనిస్ట్ అమీర్ ఖాన్. బాలీవుడ్లో వారిద్దరూ సూపర్ స్టార్లే. ఇద్దరూ వందల కోట్ల వసూళ్ళను రాబట్టే సినిమాల క్లబ్లో మెంబర్లే. ఇద్దరికీ ప్రాణం పెట్టే కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. రీల్ లైఫ్‌లో ప్రత్యర్థులే అయినా రియల్ లైఫ్‌లో మాత్రం వారిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. మరి అలాంటి ఆ సూపర్ స్టార్ల మధ్య ఈ మధ్య మాటల తూటాలు పేలాయట. బాంద్రాలోని అమీర్ స్వగృహంలో ఇటీవల జరిగిన పార్టీలో అమీర్ ఖాన్ భజరంగీ భాయిజాన్ సినిమా విజయంపై సల్మాన్ ఖాన్ పై ప్రశంసలు కురిపించాడు. గతంలో కంటే చాలా మెచ్యూర్డ్ గా సినిమా తీశారంటూ మెచ్చుకోవడంతో పాటూ ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలంటూ ఆకాంక్షించాడు. అయితే ఇక్కడితో సరిపెట్టని అమీర్ మరో సెటైర్ కూడా వేశాడట. కథా కథనాల గురించి సల్మాన్ అస్సలు పట్టించుకోడంటూ వ్యాఖ్యానించాడు. దీంతో మిత్రుని వ్యాఖ్యలను లైట్‌గా తీసుకోని సల్మాన్ ఖాన్ కూడా ప్రతిగా మరో విసురు విసిరాడట. అమీర్ అంత కష్టపడి తాను పనిచేయకపోయినా, ఇతరుల శ్రమను, గొప్పతనాన్ని మాత్రం గుర్తిస్తానంటూ వ్యాఖ్యానించాడట. దీంతో ఇద్దరి మధ్యా స్నేహం చెడిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఖాన్ ద్వయం ఎక్కడా స్పందించలేదు. కానీ ఇద్దరి మధ్య పరోక్షంగా విభేదాలు వచ్చామని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నరట. అయితే అభిమానులు మాత్రం మళ్లీ జాన్ జిగరీల్లాంటి తమ హీరోలు ఎప్పటిలాగానే మిత్రులుగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారట.