ఈ ఏడాది మేలో రూ.2,000 నోట్ల ఉపసంహరణపై ఆర్‌బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి జూన్ 24 నాటికి బ్యాంకుల్లో 72 శాతం (సుమారు రూ.2.62 లక్షల కోట్లు) రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదంటే మార్చుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్‌బీఐ మే19న రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని కోరింది. నోట్ల ఉపసంహరణ,డిపాజిట్లను సులభతరం చేసేలా, బ్యాంకుల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేలా రూ.2వేల నోట్లను ఏ బ్రాంచ్‌లోనైనా ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తెలిపింది.
మే 23 ఆర్‌బీఐ సర్క్యులర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీని అనుసరించి రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించబడింది. రూ. 2,000 డినామినేషన్‌లో ఉన్న నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని పేర్కొంది.
చదవండి👉 స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?
Comments
Please login to add a commentAdd a comment