రూ.2వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుండి వాటి చెలామణిలో గణనీయమైన తగ్గుదలని వెల్లడించింది.
తాజా డేటా ప్రకారం, చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ మే 19, 2023న రూ.3.56 లక్షల కోట్ల నుండి ఫిబ్రవరి 29, 2024 నాటికి కేవలం రూ.8470 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. తద్వారా మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 97.62శాతం తిరిగి వచ్చాయి అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం /లేదంటే మార్చుకునే సదుపాయం దేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో అక్టోబర్ 07, 2023 వరకు అందుబాటులో ఉంది. ఇందుకోసం 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులోకి తెచ్చింది ఆర్‌బీఐ.
అయినప్పటికీ దేశంలో ఉన్న మొత్తం రూ.2వేల నోట్లు ఇంకా వినియోగంలో ఉన్నాయని, పూర్తి స్థాయిలో ఆర్‌బీఐకి చేరేందుకు మరింత సమయం పట్టొచ్చని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment