అంతర్జాతీయ బ్యాంకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు రాణా తల్వార్ ( 76) మరణించారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
సిటీ గ్రూప్ మాజీ సీఈఓ జాన్ రీడ్ వంటి గ్లోబల్ దిగ్గజాల నుండి ప్రశంసలు పొందిన ఆయన బ్యాంకింగ్ రంగంలోనే పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా స్టాండర్డ్‌చార్టర్డ్ బ్యాంక్‌లో చేరిన కొద్ది కాలానికి సీఈఓ గా బాధ్యతుల చేపట్టడం ఆయన చేసిన కృషికి నిదర్శనమనే చెప్పుకోవాలి.
ఆసియా కరెన్సీ సంక్షోభం వచ్చినప్పుడే ఆయన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈఓగా పలు బ్యాంకుల స్వాధీనానికి చర్యలు చేపట్టారు. యూబీఎస్ ట్రేడ్ ఫైనాన్స్ బిజినెస్ ఇంటిగ్రేషన్ తోపాటు ఏఎన్‌జడ్ గ్రిన్లే బ్యాంక్ భారత్, మిడిల్ ఈస్ట్, హాంకాంగ్‌లో ఛేస్ మాన్‌హట్టన్ క్రెడిట్ కార్డు బిజినెస్ లను ఆయన సారధ్యంలోనే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ టేకోవర్ చేసింది.
బ్యాంకింగ్ నుండి రిటైర్మెంట్ తర్వాత, తల్వార్ సాబర్ క్యాపిటల్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభించారు. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్‌కు అండగా నిలిచారు. తరువాత దానిని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment