ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించనున్న మధ్యంతర బడ్జెట్‌పై అంచనాలు నెలకొన్నాయి.
ఆర్థిక బడ్జెట్‌లో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని, సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఖర్చుపై దృష్టి సారిస్తుంది. అయితే, ఓ వైపు దేశంలో ఎన్నికల వాతావారణం అవ్వడంతో మధ్యంతర బడ్జెట్‌కు ముందు అంచనాలు పెరుగుతున్నాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
- ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 4.5శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి’ అని చావ్లా చెప్పారు.
- ప్రభుత్వం మూలధన వ్యయాన్ని (క్యాపెక్స్) దృష్టిపెడుతూనే ప్రభుత్వం పన్నులను తగ్గించడానికి, వ్యవసాయం గ్రామీణ ప్రాంతాలకు లబ్ధి చేకూరేలా లక్ష్యాలను ప్రకటించాలని ప్రజలు ఆశిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రపంచ వృద్ధి ఆందోళనలను అధిగమించడానికి క్యాపెక్స్‌పై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని అంచనా వేస్తుందని తెలిపారు.
- డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్రాడ్‌బ్యాండ్ వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది.
- రాబోయే ఆర్థిక సంవత్సరానికి, ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం భారతదేశం దాదాపు రూ. 4 ట్రిలియన్లు ($48 బిలియన్లు) కేటాయించాలని కేంద్రం యోచిస్తుంది.
- డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 510 బిలియన్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment