ఆ ఇద్దరి మధ్య తేడాలొచ్చాయా? | Is Salman Khan - Aamir Khan friendship over? | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి మధ్య తేడాలొచ్చాయా?

Published Mon, Oct 5 2015 12:49 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

ఆ  ఇద్దరి మధ్య తేడాలొచ్చాయా?

ఆ ఇద్దరి మధ్య తేడాలొచ్చాయా?

ముంబై:  బాలీవుడ్ ఖాన్ ద్వయం మధ్య  విభేదాలొచ్చాయని బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. బాలీవుడ్ సినిమా మీడియా  సమాచారం ప్రకారం  ఆ ఖాన్ లిద్దరూ ఒకర్ని ఒకరు పొగుడుకుంటూనే సెటైర్లు వేసుకుంటున్నారట.   ఇంతకీ వారిద్దరూ మరెవ్వరో కాదు  కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ ఫరఫెక్టనిస్ట్  అమీర్  ఖాన్.  

బాలీవుడ్లో వారిద్దరూ సూపర్ స్టార్లే. ఇద్దరూ వందల కోట్ల వసూళ్ళను రాబట్టే సినిమాల క్లబ్లో  మెంబర్లే.   ఇద్దరికీ ప్రాణం పెట్టే కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. రీల్ లైఫ్లో  ప్రత్యర్థులే అయినా రియల్ లైఫ్లో మాత్రం వారిద్దరి మధ్య మంచి  స్నేహ సంబంధాలే ఉన్నాయి.   మరి అలాంటి ఆ సూపర్ స్టార్ల మధ్య ఈ మధ్య  మాటల తూటాలు పేలాయట.  

బాంద్రాలోని అమీర్ స్వగృహంలో ఇటీవల జరిగిన పార్టీలో అమీర్ ఖాన్ భజరంగీ భాయిజాన్ సినిమా  విజయంపై సల్మాన్ ఖాన్ పై ప్రశంసలు కురిపించాడు.  గతంలో కంటే చాలా  మెచ్యూర్డ్ గా  సినిమా తీశారంటూ  మెచ్చుకోవడంతో పాటూ  ఇలాంటి  విజయాలు మరిన్ని  సాధించాలంటూ  ఆకాంక్షించాడు. అయితే ఇక్కడితో సరిపెట్టని  అమీర్  మరో సెటైర్ కూడా వేశాడట. కథా కథనాల గురించి సల్మాన్ అస్సలు పట్టించుకోడంటూ  వ్యాఖ్యానించాడు. దీంతో మిత్రుని వ్యాఖ్యలను లైట్గా తీసుకోని సల్మాన్ ఖాన్ కూడా ప్రతిగా  మరో విసురు విసిరాడట.  అమీర్ అంత కష్టపడి తాను పనిచేయకపోయినా, ఇతరుల శ్రమను,  గొప్పతనాన్ని మాత్రం గుర్తిస్తానంటూ వ్యాఖ్యానించాడట.

దీంతో  ఇద్దరి మధ్యా స్నేహం చెడిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఖాన్ ద్వయం ఎక్కడా స్పందించలేదు.  కానీ ఇద్దరి మధ్య పరోక్షంగా విభేదాలు  వచ్చామని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నరట. అయితే అభిమానులు మాత్రం మళ్లీ జాన్ జిగరీల్లాంటి తమ హీరోలు  ఎప్పటిలాగానే మిత్రులుగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement