
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకి మంగళవారం ఉదయం శ్రీనివాస్ అనే రోగి చనిపోయాడు. అయితే 8 గంటలు కావస్తున్నా సిబ్బంది పట్టించుకోకపోవడంతో మృతదేహం బెడ్‌మీదే పడి ఉంది. తీవ్ర దుర్వాసనతో కరోనా వార్డు కంపు కొడుతుండటంతో మిగతా కరోనా రోగులు వార్డు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అనేకసార్లు అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఒక్క రోజు సమ్మె చేపట్టడంతో మృతదేహాన్ని తరలించే నాదులే కరువయ్యారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ పరిశుబ్రంగా ఉంచాల్సిన కరోనా వార్డు కంపు కొడుతున్నా అధికారులు పట్టించుకోని వైనం మరోసారి గాంధీ నిర్లక్ష్యానికి దర్శనమిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment