సిద్ధిఖీ కేసు: ‘నిందితులు గ్లాక్ పిస్టల్‌తో కాల్పలు జరిపారు’ | siddique assassination case: police say accused used three pistols | Sakshi
Sakshi News home page

సిద్ధిఖీ కేసు: ‘నిందితులు గ్లాక్ పిస్టల్‌తో కాల్పలు జరిపారు’

Published Thu, Oct 17 2024 7:53 AM | Last Updated on Thu, Oct 17 2024 9:01 AM

siddique assassination case: police say accused used three pistols

ముంబై: ఎన్సీపీ( అజిత్‌ పవార్‌ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపింది. ఇక.. హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు నలుగు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు చెందిన నిందులు వాడిన తుపాకీల గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

సిద్ధిఖీ హత్య చేయడానికి నిందితులు మొత్తం మూడు పిస్టల్స్ ఉపయోగించారని తెలిపారు. వాటిలో ఒకటి ఆస్ట్రేలియాలో తయారు చేయబడిన గ్లాక్ పిస్టల్, మరొకటి టర్కిష్ పిస్టల్‌ కాగా మూడో పిస్టల్ దేశీయంగా తయారు చేసిందని వెల్లడించారు. ఇక.. ఈ మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. నిందితులు అక్టోబరు 12న నిర్మల్‌నగర్‌లో బాబా సిద్ధిఖీని తన కుమారడు జీషన్‌ సిద్ధిఖీ కార్యాలయం బయట కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే.

గ్లాక్‌ సిస్టల్స్‌ యూరప్, అమెరికాలో అధికంగా ఉత్పత్తి  అవుతాయని పోలీసులు తెలిపారు. వాటి డిజైన్, క్వాలిటీ, అధిక మ్యాగజైన్ సామర్థ్యం, ప్రమాదవశాత్తు జరిగినే ఫైరింగ్‌ను నిరోధించే అధునాతన ‘సేఫ్ యాక్షన్ సిస్టమ్’ ఉంటుందని పేర్కొన్నారు. గ్లాక్‌ తుపాకీని కలిగి ఉన్నట్లు అమెరికా ఉపాధ్యక్షురాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్లోక్ పిస్టల్స్‌ను ఆస్ట్రియాలో అధికంగా తయారు చేస్తారు. అక్కడి పౌరులు, ప్రజా ప్రతినిధులు, సైనిక సిబ్బంది కోసం  ఇటువంటి సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌లను తయారు చేస్తోంది.

ఇక.. నిందితులు సిద్ధిఖీపై కాల్పులు జరపటం కోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసి ప్రాక్టిసు చేసినట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.

చదవండి: Baba Siddiqui Case: ‘యూట్యూబ్‌ చూసి నిందితుల గన్‌ షూటింగ్‌ ప్రాక్టిస్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement