సిద్ధిఖీ కేసు: ‘నిందితుల ఫోన్‌లో జీషన్‌ ఫొటో’ | Baba Siddique son photo found in accused phone | Sakshi
Sakshi News home page

సిద్ధిఖీ కేసు: ‘నిందితుల ఫోన్‌లో జీషన్‌ ఫొటో’

Published Sat, Oct 19 2024 11:12 AM | Last Updated on Sat, Oct 19 2024 11:57 AM

Baba Siddique son photo found in accused phone

ముంబై: ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం)నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగి వారంరోజులు గడుస్తున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు తాజాగా కీలక విషయాలు బయటపెట్టారు. బాబా కుమారుడు జీషన్ సిద్దిఖీ ఫొటోను నిందితుడి ఫోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. హత్య కేసు కేసు.. సూత్రధారి బాబా కుమారుడు జీషన్ సిద్ధిఖీ ఫొటోనే షూటర్లతో పంచుకోవడానికి సోషల్ మీడియా అప్లికేషన్  యాప్‌ స్నాప్‌చాట్‌ను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.

షూటర్లు, కుట్రదారులు సమాచారాన్ని చేరవేయటం కోసం ఈ  అప్లికేషన్‌ను ఉపయోగించారని  పేర్కొన్నారు. ఈ యాప్‌లో సమాచారం చేరిన వెంటనే ఆటో డిలీట్‌ అయ్యే ఫీచర్‌ ఉండటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు షూటర్లలో గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక.. నాలుగో నిందితుడు హరీష్ కుమార్ బలక్రమ్ నిసాద్‌ను సోమవారం యూపీలో అరెస్టు చేసి శుక్రవారం ముంబైకి తీసుకువచ్చారు. 

చదవండి: బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో ఐదుగురు అరెస్ట్‌

కానిస్టేబుల్‌ సస్పెండ్‌
బాబా సిద్ధిఖీ హత్య జరిగిన సమయంలో ఆయనతో పాటే ఉన్న పోలీస్ సెక్యూరిటీ గార్డు కానిస్టేబుల్ శ్యామ్ సోనావానే సస్పెండ్ అయ్యారు. ఆయనపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు.

ఇక.. బాబా సిద్ధిఖీ తామే హత్య చేయించామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు, దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని కారణంగా టార్గెట్‌ చేసినట్లు  ఆ గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వెల్లడించారు.

చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్‌ వీడియోలు, బైక్‌తో ప్లాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement