Mumbai Crime Branch
-
సిద్ధిఖీ కేసు: ‘నిందితుల ఫోన్లో జీషన్ ఫొటో’
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగి వారంరోజులు గడుస్తున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తాజాగా కీలక విషయాలు బయటపెట్టారు. బాబా కుమారుడు జీషన్ సిద్దిఖీ ఫొటోను నిందితుడి ఫోన్లో ఉన్నట్లు గుర్తించారు. హత్య కేసు కేసు.. సూత్రధారి బాబా కుమారుడు జీషన్ సిద్ధిఖీ ఫొటోనే షూటర్లతో పంచుకోవడానికి సోషల్ మీడియా అప్లికేషన్ యాప్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.Baba Siddique murder case | A picture of Baba Siddique's son Zeeshan Siddique was found in the phone of the accused in Baba Siddique's murder. This picture was shared with the accused by their handler through Snapchat. Investigation revealed that the shooters and conspirators…— ANI (@ANI) October 19, 2024షూటర్లు, కుట్రదారులు సమాచారాన్ని చేరవేయటం కోసం ఈ అప్లికేషన్‌ను ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ యాప్‌లో సమాచారం చేరిన వెంటనే ఆటో డిలీట్ అయ్యే ఫీచర్ ఉండటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు షూటర్లలో గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక.. నాలుగో నిందితుడు హరీష్ కుమార్ బలక్రమ్ నిసాద్‌ను సోమవారం యూపీలో అరెస్టు చేసి శుక్రవారం ముంబైకి తీసుకువచ్చారు. చదవండి: బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో ఐదుగురు అరెస్ట్కానిస్టేబుల్ సస్పెండ్బాబా సిద్ధిఖీ హత్య జరిగిన సమయంలో ఆయనతో పాటే ఉన్న పోలీస్ సెక్యూరిటీ గార్డు కానిస్టేబుల్ శ్యామ్ సోనావానే సస్పెండ్ అయ్యారు. ఆయనపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు.Baba Siddique Murder case | Police security guard Constable Shyam Sonawane, present with late NCP leader Baba Siddique at the time of the murder has been suspended. An internal investigation is also going on: Mumbai Police— ANI (@ANI) October 19, 2024ఇక.. బాబా సిద్ధిఖీ తామే హత్య చేయించామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు, దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని కారణంగా టార్గెట్ చేసినట్లు ఆ గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్‌తో ప్లాన్ -
సిద్ధిఖీ కేసు: ‘నిందితులు గ్లాక్ పిస్టల్‌తో కాల్పలు జరిపారు’
ముంబై: ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపింది. ఇక.. హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు నలుగు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు చెందిన నిందులు వాడిన తుపాకీల గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.సిద్ధిఖీ హత్య చేయడానికి నిందితులు మొత్తం మూడు పిస్టల్స్ ఉపయోగించారని తెలిపారు. వాటిలో ఒకటి ఆస్ట్రేలియాలో తయారు చేయబడిన గ్లాక్ పిస్టల్, మరొకటి టర్కిష్ పిస్టల్ కాగా మూడో పిస్టల్ దేశీయంగా తయారు చేసిందని వెల్లడించారు. ఇక.. ఈ మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. నిందితులు అక్టోబరు 12న నిర్మల్‌నగర్‌లో బాబా సిద్ధిఖీని తన కుమారడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయం బయట కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే.Maharashtra | Three pistols were used in NCP leader Baba Siddiqui's murder, one of them was an Australian-made Glock pistol, a Turkish pistol and a country-made pistol. Police have recovered all three weapons: Mumbai PoliceHe was murdered after being shot outside Zeeshan…— ANI (@ANI) October 16, 2024గ్లాక్ సిస్టల్స్ యూరప్, అమెరికాలో అధికంగా ఉత్పత్తి అవుతాయని పోలీసులు తెలిపారు. వాటి డిజైన్, క్వాలిటీ, అధిక మ్యాగజైన్ సామర్థ్యం, ప్రమాదవశాత్తు జరిగినే ఫైరింగ్‌ను నిరోధించే అధునాతన ‘సేఫ్ యాక్షన్ సిస్టమ్’ ఉంటుందని పేర్కొన్నారు. గ్లాక్ తుపాకీని కలిగి ఉన్నట్లు అమెరికా ఉపాధ్యక్షురాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్లోక్ పిస్టల్స్‌ను ఆస్ట్రియాలో అధికంగా తయారు చేస్తారు. అక్కడి పౌరులు, ప్రజా ప్రతినిధులు, సైనిక సిబ్బంది కోసం ఇటువంటి సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌లను తయారు చేస్తోంది.ఇక.. నిందితులు సిద్ధిఖీపై కాల్పులు జరపటం కోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసి ప్రాక్టిసు చేసినట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.చదవండి: Baba Siddiqui Case: ‘యూట్యూబ్ చూసి నిందితుల గన్ షూటింగ్ ప్రాక్టిస్’ -
సిద్ధిఖీ కేసు: ‘యూట్యూబ్ చూసి నిందితుల గన్ షూటింగ్ ప్రాక్టిస్’
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీను హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు గుర్మైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్‌లు యూట్యూబ్ వీడియోలు చూసి షూట్ చేయడం నేర్చుకున్నారని ముంబై పోలీసుల వర్గాలు వెల్లడించాయి. ఈ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరీరాలో ఉన్న వారిని వెతకడానికి పోలీసులు బృందాలను గాలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ హత్య కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు. 7.62 ఎంఎం తుపాకీతో కూడిన ఓ నల్ల బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.‘‘సిద్ధిఖీని గుర్తించడానికి నిందితులకు ఆయన ఫోటోను ఇచ్చారు. ఘటనకు 25 రోజుల ముందు నిందితులు ఆయన నివాసం, కార్యాలయాన్ని పరిశీలించారు. గుర్మైల్ సింగ్ , ధరమ్‌రాజ్ కశ్యప్ యూట్యూబ్ నుంచి షూటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. ముంబైలో బుల్లెట్ మ్యాగజైన్ లేకుండా గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేశారు’’ అని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.ఇక.. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్కు చెందిన 23 ఏళ్ల హరీష్‌కుమార్ బాలక్రామ్గా ఈ హత్యకేసులో నాలుగో నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు ఆర్థిక సహాయం అందించడం, లాజిస్టిక్స్‌ను సమన్వయం చేశాడని పోలీసులు తెలిపారు. బాలక్‌రామ్ పూణెలో స్క్రాప్ షాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు బాలక్రామ్గా స్క్రాప్ షాపులో పనిచేసేవారని పోలీసులు వెల్లడించారు.చదవండి: సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర -
టెర్రరిస్ట్ @ ఆర్టీఐ..
సాక్షి, హైదరాబాద్: ఐఎం ఉగ్రవాది ‘సమాచారం’ కోసం పోరాడుతున్నాడు... ఓ పోలీసుస్టేషన్లో నమోదైన కేసు వివరాల కోసం కర్ణాటక రాష్ట్ర సమాచార కమిషన్ మెట్లు ఎక్కాడు. అతడు మరెవరో కాదు... హైదరాబాద్‌లో జరిగిన 2007 జంట పేలుళ్ల కేసు నిందితుడు అక్బర్ ఇస్మాయిల్ చౌదరి. కర్ణాటకలోని ఉల్లాల్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద తాను కోరిన సమాచారం అందించలేదంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఆథర్ రోడ్ జైల్లో ఉన్న అక్బర్ అక్కడ నుంచే బెంగళూరులో ఉన్న కర్ణాటక రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీని విచారణ మార్చిలో ప్రారంభం కావడంతో ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇస్మాయిల్‌ను బెంగళూరుకు తీసుకువచ్చి, తిరిగి తీసుకువెళ్తున్నారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన దశాబ్ద కాలంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. వెంకటాద్రి థియేటర్ వద్ద బాంబు పెట్టింది ఇతడే.. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో అక్బర్ నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో పెట్టిన బాంబులు పేల గా... దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పక్కన మరో పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ బాంబును అక్కడ పెట్టింది అక్బర్ ఇస్మాయిల్ చౌదరీనే. ఉగ్రవాదులకు డ్రైవర్‌గా వ్యవహరించాడు.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన అక్బర్ వృత్తిరీత్యా కంప్యూటర్ మెకానిక్. దేశ వ్యాప్తంగా అనేక పేలుళ్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడు ఉగ్రవాదులకు డ్రైవర్‌గానూ వ్యవహరించాడు. కర్ణాటకలోని మంగుళూరు నుంచి పుణె మీదుగా అహ్మదాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు పేలుడు పదార్థాలను రవాణా చేశాడు. 2008లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇతడిని అరెస్టు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగుళూరులో ఉన్న ఉల్లాల్ పోలీసుస్టేషన్లో ఇతడిపై ఓ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఉల్లాల్ పోలీసులకు కేసు వివరాలు కోరుతూ గత ఏడాది ఫిబ్రవరి 28న ఆథర్ రోడ్ జైలు అధికారుల ద్వారా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్‌తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద తనపై ఉల్లాల్ పోలీసులు నమోదు చేసిన కేసుకు (ఎఫ్ఐఆర్ నెం.242/2008) సంబంధించిన సమాచారం అందించాల్సిం దిగా కోరాడు. ఈ కేసుల్లో ఆధారాలు లభిస్తే తనను అరెస్టు చేయాలని, లేకుంటే తన పేరును కేసు నుంచి తొలగించాలని అభ్యర్థించాడు. ఓ వ్యక్తి జీవితం, స్వేచ్ఛలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై అధికారులు 48 గంటల్లోనే సమాధానం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నా ఉల్లాల్ పోలీసులు అక్బర్ పిటిషన్‌పై స్పందించలేదు. దీంతో ఆథర్ రోడ్ జైలు నుంచే గత ఏడాది మే 5న కర్ణాటక రాష్ట్ర సమాచార కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశాడు. దీని విచారణను మార్చిలో ప్రారంభించిన కమిషన్ ఇరు పక్షాలకు సమన్లు జారీ చేసింది. దీంతో అటు ఉల్లాల్ పోలీసులతో పాటు ఇటు అక్బర్ సైతం కమిషన్ ముందు హాజరవుతూ ఎవరి వాదనలు వారు వినిపించుకుంటున్నారు. తాను కోరిన సమాచారం కోసం అవసరమైతే సుప్రీం కోర్టునూ ఆశ్రయిస్తానంటూ కమిషన్ ముందు హాజరైన సమయంలో అక్బర్ స్పష్టం చేశాడట.