విక్రమ్ మృతదేహం సుజారాం(ఫైల్)
బాల్కొండ: కొడుకు గొంతు నులిమి చంపి, తండ్రి చెట్టుకు ఉరేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారుజామున ముప్కాల్ మండల కేంద్రం లో జరిగింది. ముప్కాల్ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపిన వి వరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ నుంచి బతుకుదెరువు కోసం కొంతకాలం క్రితం సుజారాం(32) కుటుంబ సభ్యులతో కలిసి ముప్కాల్ మండల కేంద్రానికి వచ్చాడు. ఆయన హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాల కారణంగా పదిరోజుల క్రితం సుజారాం భార్య నానుభాయి రెండేళ్ల కూతురుని తీసుకుని రాజస్థాన్‌కు వెళ్లిపోయింది. సుజారాం కుమారుడు విక్రమ్‌తో కలిసి హోటల్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఎప్పటిలాగే కుమారుడు విక్రమ్(6)ను తీసుకుని హోటల్‌కు వచ్చాడు.
హోటల్ వెనుక భాగాన కొడుకుని తీసుకుని వెళ్లి గొంతు నులిమి చంపాడు. తరువాత అక్కడే ఉన్న వేప చెట్టుకు చీరతో ఉరేసుకుని సుజారాం ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్‌లో ఇతరులు పని చేస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. హోటల్ వెనక వైపు నుంచి ఎంతకి రాకపోవడంతో అనుమానంతో వెళ్లి చూడగా అప్పటికే విగత జీవులుగా పడి ఉన్నారు. భార్య లేక పోవడం, కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపానికి గురై కుమారుడిని చంపి సుజారాం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ..
ముప్కాల్‌లో ఘటన స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ అం దె రాములు పరిశీలించారు. హోటల్‌లో పని చేస్తు న్న ఇతరులను విచారించాడు. మృత దేహాలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపడుతామన్నారు. ఆర్మూర్ సీఐ రాఘవేందర్, ముప్కాల్ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
కొడుకును వదిలి వెళ్లలేక..
సుజారాం కుమారుడు విక్రమ్ మూత్ర కోశ వ్యా దితో బాధపడుతున్నాడు. గతంలో జిల్లా కేంద్రం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మానసికంగా కుంగిపోయిన సు జారాం వ్యాధితో బాధ పడుతున్న కుమారుడిని ఒంటరిగా వదిలి వెళ్ల లేక ముందుగా కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment