
సాక్షి ప్రతినిధి, చెన్నై: గంజాయి మత్తులో యువకుడిని హత్య చేసి శవంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్‌లో పెట్టిన సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నై పరంగిమలై ఆదంబాక్కం పోలీసు స్టేషన్ వెనుకవైపు రెండు రోజుల క్రితం ముగ్గురు యువకులు గంజాయి సేవించేందుకు అక్కడికి వెళ్లారు. కొద్ది సేపటికి బయటకు ఇద్దరు వ్యక్తులే వెళ్లడం స్థానికులు గమనించి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించి, తనిఖీ చేయగా ఓ చోట మట్టి తవ్వి ఉండడాన్ని గమనించారు.
ఆ మట్టిని తొలగించి చూడగా ఒక యువకుని శవం తీవ్ర గాయాలతో, ముఖం చిద్రమైన స్థితిలో ఉంది. శవాన్ని పంచనామా చేసి, విచారణ చేపట్టగా ఆ ముగ్గురు యువకుల్లోని ఒకడు కలైంజర్ నగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ అని గుర్తించారు. అతడు అజ్ఞాతంలోకి వెళ్లగా.. అతడి స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఆనంద్ గంజాయి మత్తులో ఒక యువకుడిని చంపి, అతని శవంతో సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూపులో పెట్టాడని తెలిపారు. నిందితుడు ఆనంద్, అతడి పక్కనే ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment