
మృతదేహాన్ని బయటకు తీస్తున్న సిబ్బంది
వర్ని(బాన్సువాడ): కోటగిరి మండలం కొడిచర్ల శివారులోని మంజీర నది ఇసుకలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మచ్కురి రాజ్‌కుమార్ అలియాస్ రాజు(25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోడిచర్లకు చెందిన రాజు, పోతంగల్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు శుక్రవారం రాత్రి ఇసుక తెచ్చేందుకు ట్రాక్టర్‌లో మంజీర నదికి వెళ్లారు. అక్కడ ఇసుక నింపుతున్న సమయంలో రాజుతో ముగ్గురికి ఘర్షణ జరిగింది. నలుగురు మద్యం సేవించారని తెలిసింది. ఈ క్రమంలో రాజును చంపి ఇసుకలో పాతిపెట్టినట్టు తెలుస్తోంది. నిందితులు ట్రాక్టర్‌ను తీసుకుని అక్క డి నుంచి పరారయ్యారు. అయితే తన భర్త రాత్రి వెళ్లి తిరిగి రాలేదని శనివారం హతుడి భార్య అంజన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మంజీరాలో గాలించగా రాజు మృతదేహం లభ్య మైంది. సంఘటన స్థలాన్ని బోధన్ ఏసీపీ రఘు, రుద్రూర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐ రాజ్‌భరత్ రెడ్డి పరిశీలించారు. హంతకులను ఘటన స్థలానికి తేవాలని కోడిచర్ల, హంగర్గావాసులు డిమాండ్ చేశారు. ఇసుక నుంచి మృతదేహాన్ని బయటకు తీ యకుండా వారు అడ్డుకున్నారు. సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీస్ అధికారుల హామీతో శాం తించారు. అనంతరం శవ పంచానామ చేశారు. రాజుకున్న వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్టుగా భావిస్తున్నారు. నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్టు సమాచారం. హతుడు రాజుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment