
మల్కాజిగిరి : ఇంటి స్థల వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వారాసిగూడకు చెందిన జగన్‌మోహన్ పదేళ్ల క్రితం సత్తిరెడ్డి నగర్‌కు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి నర్సయ్య భార్య భారతమ్మ పేరున ఉన్న ఇంటిని కొనుగోలు చేశాడు. అప్పటినుంచి ఇళ్లు ఖాళీ చేసే విషయమై ఇరువురి మద్య విదాదం నడుస్తోంది. జగన్‌మోహన్ కోర్టుకు వెళ్లగా అతని అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అతను ఇళ్లు ఖాళీచేయించేందుకు తరచూ మల్కాజిగిరికి వచ్చి పోతున్నాడు. మంగళవారం మల్కాజిగిరి వచ్చిన జగన్‌మోహన్ హత్యకు గురయ్యాడు.
పరారీలో భారతమ్మ కుటుంబ సభ్యులు
హత్య జరిగిన సమయంలో భారతమ్మ ఇంటి పోర్షన్‌లోనే అద్దెకు ఉంటున్న మహిళకు భారతమ్మ ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో బయటికి వచ్చి చూడగా ఎదురుగా ఖాళీస్థలంలో ఓ వ్యక్తి రక్తం మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ సందీప్, ఇన్‌స్పెక్టర్ కొమురయ్య సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. నర్సయ్య, భారతమ్మ, ఆమె కుమారులు వెంకటేష్, గోవిదరాజులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment