cherukulapadu narayana reddy wife
-
శ్రీదేవి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా వెల్దుర్థి మండలం, శ్రీరంగాపురంలో నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దివంగత చెరుకులపాడు నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి పోటీచేయనున్న విషయం విధితమే. -
పచ్చపార్టీ తప్పుడు ప్రచారం: కంగాటి శ్రీదేవి
కర్నూలు జిల్లా : వైఎస్సార్సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో పచ్చ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని పత్తికొండ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. ఆమె శుక్రవారం పత్తికొండలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు హైకోర్టులో ఊరట అంటూ సొంత మీడియాలో తప్పుడు వార్తలు రాయించిందన్నారు. డోన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చినట్టు తప్పుడు వార్తలతో కోర్టులను కించపరిచే విధంగా కేఈ కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. తప్పుడు వార్తల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కంగాటి శ్రీదేవి తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై కేఈ కృష్ణమూర్తి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వార్తా పత్రికలు బాధ్యతగా వ్యవహరిస్తే హుందాగా ఉంటుందని శ్రీదేవి వ్యాఖ్యానించారు. -
డిప్యూటీ సీఎం కేఈ తనయుడిపై కోర్టులో ఫిర్యాదు
సాక్షి, డోన్ టౌన్ : అధికారం అడ్డుపెట్టుకొని ఎవరినైనా హత్యచేసి ముద్దాయి కాకుండా తప్పించుకోవచ్చనే డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు ఆటలు ఇకపై సాగవని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గపు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి అన్నారు. గత మే నెలలో తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్లో పేర్లు తొలగించుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ మేరకు నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని పేర్కొంటూ బుధవారం కర్నూలు జిల్లా డోన్ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలుచేశారు. అనంతరం హైకోర్టు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన సహాయకులు యుగేందర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు ప్రదీప్ రెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఐదు శతాబ్దాల వైరం తమ కుటుంబంపై డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి కుటుంబం ఐదు శతాబ్దాల నుంచి వైరం పెంచుకొని అనవసరమైన కక్షసాధింపులు చేస్తున్నారని కంగాటి శ్రీదేవి ఆరోపించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు తన భర్త నారాయణరెడ్డిని కేఈ శ్యాంబాబు దారుణంగా హత్యచేయించారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలిసులపై ఒత్తిడి తెస్తూ ఈ జంట హత్యల కేసులో చార్జీ షీటు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆమె డిప్యూటీ సీఎంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ హత్యకేసులో సూత్రదారులు, పాత్రదారులకు శిక్షపడేంత వరకు పోరాడుతూనే ఉంటానని ఆమె గద్గద స్వరంతో స్పష్టంచేశారు. న్యాయం కోసమే నారాయణరెడ్డి హత్యకేసులో ముద్దాయిల పేర్లను చార్జీషీట్ నుంచి తొలగించినందునే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. తమ క్లయింట్ శ్రీదేవి వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా పోలిసులు ముద్దాయిల పేర్లను తొలగిస్తే ఉన్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో ముద్దాయిలకు శిక్షపడి, శ్రీదేవి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షునిగా న్యాయస్థానాల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తానని పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టంచేశారు. వివరాలు తెలపండి నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తి దారుణహత్యలకు సంబంధించి కేసు నమోదు, తదితర వివరాలను జనవరి 25వ తేదీ లోపు కోర్టుకు తెలపాలని జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఆంజనేయులు కేసు ఇన్వస్టిగేషన్ అధికారి అయిన డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ను ఆదేశించినట్లు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. -
‘కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని’
కర్నూలు: తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఆయన భార్య శ్రీదేవిరెడ్డి ఆరోపించారు. తన భర్త మరణానికి ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు కారణమని ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆరోపించారు. కేఈ కృష్ణమూర్తి అక్రమాలపై పోరాడినందునే తన భర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. కేఈ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. తమకు ఏం జరిగినా కేఈ కృష్ణమూర్తిదే బాధ్యతని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను చంపిన హంతకులకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో నిష్పక్ష విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డి ఎంతో పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు.