వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణగిరి మండలం ఆగవేళి–ఎరుకలచెరువు మధ్య కొనసాగుతున్న పాదయాత్ర
కృష్ణగిరి (కర్నూలు): రాష్ట్రంలో టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం అసన్నమైందని రాయలసీయ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి చేపట్టిన సంఘీభావ పాదయాత్ర శుక్రవారం ముగిసింది. మూడో రోజు పాదయాత్ర కృష్ణగిరి మండలంలోని ఆగవేళి గ్రామం నుంచి ప్రారంభమై ఎరుకలచెర్వు మీదుగా కృష్ణగిరి వరకు 12 కిలోమీటర్లు కొనసాగింది. కృష్ణగిరిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆర్‌బీ వెంకటరాముడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు బీవై రామయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డితోపాటు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారన్నారు. అక్షరం ముక్కరాని వారితో గ్రామాల్లో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి పథకంలో కమీషన్లు దండుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్రంలోనే వైఎస్సార్‌సీపీ తొలి అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారని.. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ కింద రుణాలు అందిస్తామని, వాల్మీకులను ఎస్టీల్లో, వడ్లెరలను, బెస్తలను, నాయీబ్రహ్మలను ఎస్సీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారన్నారు. గ్రామాల్లో మినరల్ వాటర్ అందిస్తామని చెప్పి..అధికారంలోకి వచ్చాక క్వాటర్ బాటిళ్లను మాత్రం వీధి వీధినా అమ్ముతున్నారన్నారు. హపీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఉన్నంత వరకు పత్తికొండ కరువు ప్రాంతంగానే ఉంటుందన్నారు.
జగనన్న గెలిపిస్తే అందరి జీవితాలు బాగుపడతాయన్నారు. హామీలు అమలు చేయండని అడిగిన వారిపై కేసు నమోదు చేయడం టీడీపీకి నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు, నియోజకవర్గంలో కేఈ కుటుంబం ఇద్దరూ ఇద్దరేనన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ హత్యలు చేయించడం తప్ప కేఈ కుటుంబం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్, రైతు సంఘం అధ్యక్షుడు భాస్కర్ నాయక్, నాయకులు వెంకటేశ్వర్లు, ఉప్పర్లపల్లి, కృష్ణగిరి సింగల్‌విండో అధ్యక్షులు ప్రహ్లాదరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, డోన్ జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, మండల కన్వీనర్లు రవిరెడ్డి, బజారప్ప, మురళీధర్‌రెడ్డి, జిట్టా నాగేష్, కృష్ణగిరి సర్పంచ్ జింకల చిన్నరాముడు, మండల యూత్ కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి నక్క నాగరాజు, చిన్నన్న, నారాయణ, తిరుపాల్ యా దవ్, జయరామిరెడ్డి, బాలమద్ది, వెంకటరాముడు, ప్రహ్లాద, రామాంజనేయులు, కృష్ణమూర్తి, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేఈ సోదరులు సిగ్గుపడాలి
కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ..తన భర్త నారాయణరెడ్డి మరణం తరువాత పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనకు అండగా ఉన్నారన్నారు. వారు చూపిస్తున్న ఆధారాభిమానాలు, అప్యాయత వెలకట్టలేనివన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో రాక్షస పాలనను అంతమొందించేందుకు ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కసితో పనిచేయాలన్నారు. కృష్ణగిరి తమ సొంత మండలమని చేప్పే కేఈ సోదరులు.. కనీసం మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, హాస్టల్ సౌకర్యం కల్పించలేకపోవడం సిగ్గుచేటన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే పత్తికొండ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment