ke brothers
-
ఎస్వీ మోహన్ రెడ్డి అదా సంగతి!
సాక్షి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుపై ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అంతర్మథనంలో పడినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఆయన కర్నూలు సీటు తనదే అని ధీమా వ్యక్తం చేసినా .... ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి... కర్నూలు నుంచి ఒకవేళ నారా లోకేష్ పోటీ చేస్తే తానే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. అయితే మరో నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనని, టికెట్ కూడా అడగనని అన్నారు. కర్నూలు నుంచి లోకేశ్ పోటీ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆయన... మరొకరికి ఆ సీటు కేటాయిస్తే ఒప్పుకునేది లేదన్నారు. కాగా ఇప్పటికే కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి నారా లోకేష్ దాదాపుగా ప్రకటించారు. దీనిపై రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక స్థాయిలో మండిపడగా... మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరి సీటుకు ఎసరు పడుతుందనే చర్చ అధికార పార్టీలో మొదలైంది. మరోవైపు టీడీపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబానికి మద్దతు తెలిపిన ఎస్వీ మోహన్‌రెడ్డికి తమదైన శైలిలో ఝలక్ ఇచ్చేందుకు కేఈ సోదరులు పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం వద్ద కేఈ సోదరులు ప్రతిపాదన తెచ్చారు. దీంతో ఎస్వీ మోహన్ రెడ్డికి.. ఓవైపు టీజీ వెంకటేశ్ కుమారుడు, మరోవైపు కోట్ల కుటుంబం నుంచి పోటీ ఎదురు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. టీజీ, కేఈ వర్గానికి చెక్ పెట్టేందుకు ఆయన తాజాగా కర్నూలు నుంచి లోకేశ్ పోటీ చేయాలంటూ కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. అంతేకాకుండా పోటీ చేస్తే లోకేష్...లేదా నేనే... అంతేకానీ వేరేవాళ్లు కర్నూలు నుంచి పోటీ చేస్తే ఊరుకునేది లేదంటూ ఎస్వీ మోహన్ రెడ్డి మీడియా ముఖంగా ఫీలర్లు వదులుతున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న కర్నూలు అసెంబ్లీ టికెట్ చివరికి ఎవరికి దక్కుతుందో. -
కర్నూలు అసెంబ్లీ టికెట్ భరత్‌కే: టీజీ
సాక్షి, న్యూఢిల్లీ : కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కర్నూలు సీటును కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆశించినట్లు వార్తలు రాగా.. తాజాగా ఆ స్థానాన్ని తన కుమారుడికి కేటాయించాలని టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కోరుతున్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు భరత్ కర్నూలులో కచ్చితంగా గెలుస్తాడని, అతనికే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని చెప్పుకొచ్చారు. టీడీపీ గెలిచే వారికే సీట్లు ఇస్తుందని, గెలవడు అనుకుంటే తన కొడుకుకి సైతం టికెట్ ఇవ్వదని టీజీ వెంకటేష్ అన్నారు. ‘కేఈ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారని, వారు కూడా కర్నూలు సీటును ఆశిస్తున్నట్లు వార్తల్లో చదివాను. కర్నూలు నుంచి గెలిచే అవకాశాలు భరత్‌కే ఎక్కువగా ఉన్నాయి. అతనికే సీటు వస్తుందని అనుకుంటున్నాను. మిగిలిన వారు ఎవరూ తమకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పలేదు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే నడచుకుంటా’ అని టీజీ అన్నారు. కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాల మధ్య కొన్ని తరాలగా అంతర్గత విభేదాలు ఉన్నాయని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. (ఎస్వీకి ఝలక్.. కోట్లకు టికెట్ ?) ఏమీచ్చారో చెప్పి రాష్ట్రానికి రండి ఆనాటి పరిస్థితుల దృష్ట్యా తొలుత బీజేపీతో చంద్రబాబు నాయుడు జత కట్టారని, కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే విడిపోయారని టీజీ పేర్కొన్నారు. కేంద్రంతో ఎప్పుడు పోరాడాలో చంద్రబాబుకు తెలుసన్నారు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని టీజీ వెంకటేష్ మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పింది కానీ కొన్ని రాష్ట్రాలకు హోదాను అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి ఏపీకి వస్తానని అంటున్నారని... వచ్చే ముందు రాష్ట్రానికి ఎం ఇచ్చారో చెప్పి రావాలని ఆయన డిమండ్ చేశారు. -
ఎస్వీకి ఝలక్.. కోట్లకు టికెట్ ?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రాకను ముందుగానే స్వాగతించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి తమదైన శైలిలో ఝలక్ ఇచ్చేందుకు కేఈ సోదరులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఏకంగా ఎస్వీ టికెట్‌కే టెండర్ వేసేందుకు పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ముందు కేఈ సోదరులు కొత్త ప్రతిపాదన చేశారు. పత్తికొండ, డోన్ టికెట్లు తమ కుటుంబానికే ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరినట్టు తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు పరిధిలో కోట్లకు చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన అంశాన్ని వీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు కూడా ఈ పరిణామం దోహదపడడమే కాకుండా ఇక్కడ పార్టీ గెలుపునకు ఉపయోగపడుతుందంటూ అధిష్టానం ముందు ప్రతిపాదన ఉంచనున్నట్టు సమాచారం. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎస్వీ, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు భరత్ మధ్య ఉన్నపోటీని పరిష్కరించే వీలు కూడా కలుగుతుందనేది వీరి అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో కోట్ల రాకను స్వాగతించిన ఎస్వీకి అసలు సీటే లేకుండా చేయాలనేది కేఈ సోదరుల ప్రణాళికగా ఉన్నట్లు తెలుస్తోంది. డోన్, పత్తికొండ మాకే! జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమతో కనీసం సంప్రదించకుండానే కోట్లతో నేరుగా సీఎం చర్చలు జరపడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు కర్నూలు ఎంపీతో పాటు ఆలూరు, డోన్ టికెట్లు తమకే వస్తాయని కోట్ల కుటుంబం తన అనుచరులతో భేటీ సందర్భంగా చెప్పుకుంటోంది. ఇది కాస్తా కేఈ కుటుంబానికి ఆగ్రహం తెప్పిస్తోంది. కాగా.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కేఈ కుటుంబం మొదటి నుంచి సహకరించింది. ఎంపీ టీజీ వెంకటేష్‌పై ఉన్న వ్యతిరేకత కొద్దీ ఎస్వీని ప్రోత్సహించింది. అలాగే పత్తికొండలో తమకు ఎస్వీ తన బంధువైన రామచంద్రారెడ్డి ద్వారా సహకరిస్తారని ఆశించింది. ఇందుకు భిన్నంగా కోట్ల రాకను ఎస్వీ స్వాగతించారు. కర్నూలులో మైనార్టీల్లో కోట్లకు అంతో ఇంతో పట్టుంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఎస్వీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ ఉన్న కేఈ సోదరులను కాదని.. వారికి వ్యతిరేక వర్గమైన కోట్ల రాకను స్వాగతించారు. కోట్లతో కలసి సాగితే కర్నూలులో తనకు మైనార్టీ ఓటు బ్యాంకు ఏమైనా కలిసొస్తుందనే ఆలోచనతో ఉన్నారు. అయితే.. ఎమ్మెల్యే ఎస్వీ వైఖరిపై కేఈ వర్గం మండిపడుతోంది. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా.. కోట్ల సుజాతమ్మను కర్నూలులో పోటీ చేయించే ప్రతిపాదన తెచ్చారు. తద్వారా డోన్ టికెట్‌ను తామే దక్కించుకోవడమే కాకుండా.. అటు టీజీ, ఇటు ఎస్వీలను దెబ్బతీయొచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. మొత్తంగా అధికార పార్టీలో ఈ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి. -
టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం
కృష్ణగిరి (కర్నూలు): రాష్ట్రంలో టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం అసన్నమైందని రాయలసీయ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి చేపట్టిన సంఘీభావ పాదయాత్ర శుక్రవారం ముగిసింది. మూడో రోజు పాదయాత్ర కృష్ణగిరి మండలంలోని ఆగవేళి గ్రామం నుంచి ప్రారంభమై ఎరుకలచెర్వు మీదుగా కృష్ణగిరి వరకు 12 కిలోమీటర్లు కొనసాగింది. కృష్ణగిరిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఆర్బీ వెంకటరాముడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు బీవై రామయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డితోపాటు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారన్నారు. అక్షరం ముక్కరాని వారితో గ్రామాల్లో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి పథకంలో కమీషన్లు దండుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్రంలోనే వైఎస్సార్సీపీ తొలి అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని.. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ కింద రుణాలు అందిస్తామని, వాల్మీకులను ఎస్టీల్లో, వడ్లెరలను, బెస్తలను, నాయీబ్రహ్మలను ఎస్సీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారన్నారు. గ్రామాల్లో మినరల్ వాటర్ అందిస్తామని చెప్పి..అధికారంలోకి వచ్చాక క్వాటర్ బాటిళ్లను మాత్రం వీధి వీధినా అమ్ముతున్నారన్నారు. హపీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఉన్నంత వరకు పత్తికొండ కరువు ప్రాంతంగానే ఉంటుందన్నారు. జగనన్న గెలిపిస్తే అందరి జీవితాలు బాగుపడతాయన్నారు. హామీలు అమలు చేయండని అడిగిన వారిపై కేసు నమోదు చేయడం టీడీపీకి నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు, నియోజకవర్గంలో కేఈ కుటుంబం ఇద్దరూ ఇద్దరేనన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ హత్యలు చేయించడం తప్ప కేఈ కుటుంబం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్, రైతు సంఘం అధ్యక్షుడు భాస్కర్ నాయక్, నాయకులు వెంకటేశ్వర్లు, ఉప్పర్లపల్లి, కృష్ణగిరి సింగల్‌విండో అధ్యక్షులు ప్రహ్లాదరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, డోన్ జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, మండల కన్వీనర్లు రవిరెడ్డి, బజారప్ప, మురళీధర్‌రెడ్డి, జిట్టా నాగేష్, కృష్ణగిరి సర్పంచ్ జింకల చిన్నరాముడు, మండల యూత్ కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి నక్క నాగరాజు, చిన్నన్న, నారాయణ, తిరుపాల్ యా దవ్, జయరామిరెడ్డి, బాలమద్ది, వెంకటరాముడు, ప్రహ్లాద, రామాంజనేయులు, కృష్ణమూర్తి, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేఈ సోదరులు సిగ్గుపడాలి కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ..తన భర్త నారాయణరెడ్డి మరణం తరువాత పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనకు అండగా ఉన్నారన్నారు. వారు చూపిస్తున్న ఆధారాభిమానాలు, అప్యాయత వెలకట్టలేనివన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో రాక్షస పాలనను అంతమొందించేందుకు ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కసితో పనిచేయాలన్నారు. కృష్ణగిరి తమ సొంత మండలమని చేప్పే కేఈ సోదరులు.. కనీసం మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, హాస్టల్ సౌకర్యం కల్పించలేకపోవడం సిగ్గుచేటన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే పత్తికొండ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. -
తమ్ముడూ..తగునా!
కేఈ సోదరుల మధ్య జెడ్పీ చైర్మన్ చిచ్చు సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థాయీ సంఘాల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్ తీరు కేఈ సోదరుల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఓర్వకల్లు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వెన్నుపోటు పొడిచి పచ్చకండువా కప్పుకున్నారు. ఆ పార్టీలో ఆది నుంచి కొనసాగుతూ జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న కప్పట్రాళ్ల బొజ్జమ్మ, పత్తికొండకు చెందిన సుకన్యల పేర్లను జాబితా నుంచి పథకం ప్రకారం తప్పించారు. కేఈ సోదరుల సహకారంతో ఏకంగా చైర్మన్ పదవిని తన్నుకుపోయారు. ఇప్పుడు ఆ పదవిని కాపాడుకునే ప్రయత్నంలో రాజకీయ ఎదుగుదలకు కారణమైన సోదరుల మధ్యే చిచ్చు రాజేస్తుండటంతో పార్టీలో చర్చనీయాంశమవుతోంది. స్థాయీ సంఘాల ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ సూచించిన వ్యక్తికి చెక్ పెట్టేందుకు ఆయన సోదరుడు కేఈ ప్రతాప్‌ను పావుగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. జెడ్పీ చైర్మన్ కారణంగా కేఈ సోదరుల మధ్య పెరుగుతున్న దూరం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం స్థాయీ సంఘాల ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అభివృద్ధిలో కీలకమైన స్థాయీ సంఘాల్లో ప్రాతినిధ్యం కోసం టీడీపీ పెద్ద ఎత్తున పైరవీ నడిచింది. నాలుగింటికి జెడ్పీ చైర్మన్ అధ్యక్షుడు కాగా.. వ్యవసాయ స్థాయీ సంఘం చైర్మన్‌గా జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి ఎన్నికయ్యారు. ఇక స్త్రీ, శిశు సంక్షేమం.. సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘాల పదవులకు రసవత్తర పోటీ సాగింది. రెండు రోజుల క్రితం కేఈ నివాసంలో స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం అధ్యక్షురాలుగా పత్తికొండ జెడ్పీటీసీ సభ్యురాలు సుకన్న, సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం అధ్యక్షురాలుగా పాణ్యం జెడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ పేర్లను ఖరారు చేశారు. అయితే రాత్రికి రాత్రి సుకన్న స్థానంలో తుగ్గలి జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మికి అవకాశం కల్పించారు. తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోననే ఉద్దేశంతోనే జెడ్పీ చైర్మన్ ఈ మార్పు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. స్థాయీ సంఘంలోనూ దక్కని చోటు జెడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందిన సుకన్య, బొజ్జమ్మలకు మొదట జెడ్పీ చైర్మన్ పదవిని ఆశ చూపారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టాలంటే ఆ పార్టీ గుర్తుతో గెలిచి టీడీపీలో చేరిన వారికే పదవి కట్టబెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీరిని ఆ పదవికి దూరం చేశారు. కనీసం స్థాయీ సంఘాల్లోనైనా ప్రాధాన్యతనిస్తారని భావించిన వీరిద్దరికీ భంగపాటు తప్పలేదు. సుకన్యను స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘానికి అధ్యక్షురాలుగా ఎన్నిక చేయాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ సూచించారు. అయితే జెడ్పీ చైర్మన్ తన పబ్బం గడుపుకునేందుకు ప్రభాకర్ సోదరుడు కేఈ ప్రతాప్ ప్రోద్బలంతో సుకన్య స్థానంలో తుగ్గలి జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మిని తెరపైకి తీసుకొచ్చారు. ఫలితంగా సుకన్యకు రెండోసారీ నిరాశే మిగిలింది. ప్రతిపాదించేది వారే... బలపరిచేదీ వారే స్థాయీ సంఘాల ఎన్నికల తీరు జెడ్పీటీసీ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. అధ్యక్షులను ప్రతిపాదించేది, బలపరిచేది టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులే కావడం గమనార్హం. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యులకు ఎక్కడా అవకాశం కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్థాయీ సంఘాల ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి తామెన్నడూ చూడలేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు చర్చించుకోవడం కనిపించింది. -
అక్రమాలు మీకే చెల్లు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): అక్రమాలకు పాల్పడటం కేఈ సోదరులకే చెల్లు అని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక కళావెంకట్రావ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్నాడని ఇటీవల టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఈనెల 26న కేడీసీసీ బ్యాంకు సమావేశంలో మాజీ మంత్రి కె.ఈ.ప్రభాకర్ చైర్పర్సన్ కుర్చీలో కూర్చోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేఈ సోదరులు డోన్, బేతంచెర్ల, వెల్దుర్తి ప్రాంతాల్లో మైన్స్ పరిశ్రమల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తుంగభద్ర నదిలో ఇసుక అక్రమ రవాణాదారులతో కుమ్మక్కయ్యారన్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనూ పట్టా భూములను దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారన్నారు. రౌడీల్లా వ్యవహరిస్తున్న కేఈ సోదరులపై వ్యాఖ్యానిస్తే ఖండించేందుకు సోమిశెట్టి ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి నుంచి శ్రీదేవిని తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారని, ఇద్దరు ఎస్పీలు క్లీన్చిట్ ఇచ్చినా చెరుకులపాడు నారాయణరెడ్డిపై పాత కేసులను తిరగదోడే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఏడాదికాలం పనిచేసినా జిల్లాకు ఎంతో మేలు చేకూర్చారన్నారు. కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా గౌరవం నిలుపుకోకుండా రౌడీయిజం ప్రదర్శించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు మాట్లాడుతూ రైతులను అవమానపరిచేలా మాట్లాడిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి కోట్ల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, నాయకులు సర్దార్ బుచ్చిబాబు, ఎం.పి.తిప్పన్న, వై.వి.రమణ, ఎస్.ఖలీల్‌బాష, చెరుకులపాడు నారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అహ్మద్‌అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.