mlc vennapusa gopal reddy
-
‘అందుకే ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారు’
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారిలో ఇంకా మార్పు రాలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. దుష్ట ఆలోచనలతోనే ఛీప్ మార్షల్, మార్షల్స్ పై దాడికి దిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడారని మండిపడ్డారు. ఉద్యోగులపై దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, లోకేష్‌లు వ్యవహరించారని దుయ్యబట్టారు. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో గందరగోళం సృష్టించి.. ప్రజల్లో సానుభూతి పొందాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చూస్తున్నారన్నారు. అసూయ, ద్వేషం, అహంకారంతో రగిలిపోతున్న చంద్రబాబును ప్రజలు అరకొర మెజార్టీతో ప్రతిపక్షంలో కుర్చోపెట్టారన్నారు. యుద్ధ ప్రాతిపదికన సంక్షేమ పథకాలు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడం ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ..కాలం వెళ్లదీస్తున్న చంద్రబాబుకు వచ్చే స్థానిక ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం
కృష్ణగిరి (కర్నూలు): రాష్ట్రంలో టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం అసన్నమైందని రాయలసీయ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి చేపట్టిన సంఘీభావ పాదయాత్ర శుక్రవారం ముగిసింది. మూడో రోజు పాదయాత్ర కృష్ణగిరి మండలంలోని ఆగవేళి గ్రామం నుంచి ప్రారంభమై ఎరుకలచెర్వు మీదుగా కృష్ణగిరి వరకు 12 కిలోమీటర్లు కొనసాగింది. కృష్ణగిరిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఆర్బీ వెంకటరాముడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు బీవై రామయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డితోపాటు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారన్నారు. అక్షరం ముక్కరాని వారితో గ్రామాల్లో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి పథకంలో కమీషన్లు దండుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్రంలోనే వైఎస్సార్సీపీ తొలి అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని.. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ కింద రుణాలు అందిస్తామని, వాల్మీకులను ఎస్టీల్లో, వడ్లెరలను, బెస్తలను, నాయీబ్రహ్మలను ఎస్సీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారన్నారు. గ్రామాల్లో మినరల్ వాటర్ అందిస్తామని చెప్పి..అధికారంలోకి వచ్చాక క్వాటర్ బాటిళ్లను మాత్రం వీధి వీధినా అమ్ముతున్నారన్నారు. హపీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఉన్నంత వరకు పత్తికొండ కరువు ప్రాంతంగానే ఉంటుందన్నారు. జగనన్న గెలిపిస్తే అందరి జీవితాలు బాగుపడతాయన్నారు. హామీలు అమలు చేయండని అడిగిన వారిపై కేసు నమోదు చేయడం టీడీపీకి నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు, నియోజకవర్గంలో కేఈ కుటుంబం ఇద్దరూ ఇద్దరేనన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ హత్యలు చేయించడం తప్ప కేఈ కుటుంబం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్, రైతు సంఘం అధ్యక్షుడు భాస్కర్ నాయక్, నాయకులు వెంకటేశ్వర్లు, ఉప్పర్లపల్లి, కృష్ణగిరి సింగల్‌విండో అధ్యక్షులు ప్రహ్లాదరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, డోన్ జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, మండల కన్వీనర్లు రవిరెడ్డి, బజారప్ప, మురళీధర్‌రెడ్డి, జిట్టా నాగేష్, కృష్ణగిరి సర్పంచ్ జింకల చిన్నరాముడు, మండల యూత్ కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి నక్క నాగరాజు, చిన్నన్న, నారాయణ, తిరుపాల్ యా దవ్, జయరామిరెడ్డి, బాలమద్ది, వెంకటరాముడు, ప్రహ్లాద, రామాంజనేయులు, కృష్ణమూర్తి, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేఈ సోదరులు సిగ్గుపడాలి కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ..తన భర్త నారాయణరెడ్డి మరణం తరువాత పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనకు అండగా ఉన్నారన్నారు. వారు చూపిస్తున్న ఆధారాభిమానాలు, అప్యాయత వెలకట్టలేనివన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో రాక్షస పాలనను అంతమొందించేందుకు ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కసితో పనిచేయాలన్నారు. కృష్ణగిరి తమ సొంత మండలమని చేప్పే కేఈ సోదరులు.. కనీసం మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, హాస్టల్ సౌకర్యం కల్పించలేకపోవడం సిగ్గుచేటన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే పత్తికొండ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. -
బీజేపీ, టీడీపీలు ఆంధ్రప్రదేశ్‌ని ఘోరంగా మోసం చేశారు
-
‘అన్న క్యాంటీన్లలో అన్నం దొరకడం లేదు’
సాక్షి, కర్నూలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామన్న టీడీపీలు ఆంధ్రప్రదేశ్‌ని ఘోరంగా మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోంది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేనని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి చేసిన మోసాలకు ప్రజలే బుద్ధి చెబుతారని గోపాల్ రెడ్డి అన్నారు. మోదీ పాలనలో ఏటీఎంలు మూతపడితే.. చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో సుమారు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లలో పేదలకు అన్నం దొరకడం లేదు.. ఒకటి ఉంటే మరొకటి ఉండని పరిస్థితి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని అన్నారు. -
‘అధికారం కోసం అడ్డదారులు తొక్కుతారు’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పేదొకటి చేసేదొకటి అని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కుతారని అన్నారు. గత ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకోవాలనే ఉద్దేశంతో అలివిగాని హామీలు ఇచ్చారన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసగించారని మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గమంతా కూడా లేని సింగపూర్‌కు రైతులను తీసుకెళ్లారని దానివల్ల ఏమి ప్రయోజమన్నారు. ఇప్పటికైనా అపద్ధాలు చెప్పడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని అన్నారు. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజా ఉద్యమాలు చేపడుతున్నారని ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి అన్నారు. దేశంలో ఏపార్టీకి లేనంత యువత మద్దతు తమ పార్టీకి ఉందన్నారు. వైఎస్ జగన్ చేపట్టబోయే పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ నాయకుడు వైవీ శివారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 3న పూజలు, అన్నదానం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరపురం నియోజవర్గ సమన్వయ కర్త నదీం అహమ్మద్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో మార్పు తెస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన మూడున్నరేళ్లో ఏమి చేశారు, ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను వంచించారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ ఏపీ ప్రజలను మసిపూసి మారెడుకాయ చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం ప్రపంచ దేశాలు తిరగడం వల్ల లాభం లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే ఆయా దేశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. చంద్రబాబు పాలనపై విసిగిపోయిన ప్రజలు కసిగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చతంగా జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. నాయకుడు వైవీ శివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. ఆయన చేపట్టే పాదయాత్ర విజయవంత కావాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 3న తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది
-
ప్రభుత్వ తొత్తుగా అశోక్‌బాబు!
కడప: ఉద్యోగుల హక్కుల కోసం శ్రమించకుండా, ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తున్నారని పశ్చిమ రాయలసీమ శాసనమండలి సభ్యుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్ జిల్లా కడపలో నిర్వహించిన వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు గుప్పించి అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఉద్యోగులను సైతం ‘నేను మారిన మనిషిని...నమ్మండి, మరో అవకాశం కల్పించండని’ వేడుకుంటూ మేక వన్నె పులిలా వ్యవహరించారు. అధికారంలోకి వచ్చాక తనదారి తనదే అన్నట్లు హామీలన్నీ అబద్ధాలేనని తేటతెల్లం చేశారని ఆరోపించారు. ప్రజలకు తాగు, సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. పాలన మొత్తం అవినీతి మయం చేశారని అన్నారు. రైతు రుణమాఫీ నీరుగార్చారు. డ్వాక్రా రుణాలు రద్దు ఉత్తుత్తిదేనని తేల్చారు. నిరుద్యోగ భృతి భ్రమగా మిగిల్చారని ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల అభిమానాలకు దూరమైన వ్యక్తి అని విమర్శించారు. మరోమారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోగల్గితే అప్పుడే పర్మినెంటు రాజధాని సాధ్యమౌతోందని ఎన్జీఓ నేత ఆశోక్‌బాబు పేర్కొనడంలో ఔచిత్యమేమిటని నిలదీశారు. ఉద్యోగ వర్గాలకు సైతం న్యాయం చేయకుండా ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ అరియర్స్, డీఏల పట్ల శ్రద్ద చూపి ఉద్యోగుల హక్కుల కోసం పనిచేయాలని అశోక్‌బాబుకు ఆయన హితవు పలికారు. రాజధాని కోసమే మరోమారు సీఎంగా చంద్రబాబు ఉండాలని పేర్కొనడం ఏమేరకు సబబో విజ్ఞనులైన ఉద్యోగులు, ఎన్జీఓలు ఆలోచించాలని కోరారు. ఎన్జీఓ అధ్యక్షునిగా అశోక్‌బాబు... చంద్రబాబు భుజకీర్తుల కోసం తానా అంటే తందానా అంటూ తబలా కొడుతున్నారని విరుచుకుపడ్డారు. అశోక్‌బాబు ధోరణిని మేధావి వర్గాలు గ్రహించాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజులల్లో చంద్రబాబు పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సంసిద్ధంగా ఉన్నారని వివరించారు.