
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో పర్యటించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నివాసానికి చేరుకొని, నూతన వధూవరులైన చెరుకులపాడు వంశీధర్ రెడ్డి, ప్రియదర్శినిని ఆశీర్వదించారు.
చదవండి: (YSR District: రెండు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్)
కర్నూలు జిల్లాకు విచ్చేసిన సీఎంకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు.