వెల్దుర్తిలో కంగాటి శ్రీదేవి రోడ్‌షోకు హాజరైన జనం
సాక్షి, వెల్దుర్తి : ప్రజా సమస్యలు గాలికొదిలి ఇంట్లో కూర్చొని గెలుద్దామనుకున్న కేఈ కుటుంబానికి ఎన్నికల ఫలితాలను చూసి దిమ్మతిరగాలని వైఎస్సార్‌సీపీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పాతబస్టాండులో శ్రీదేవి మాట్లాడుతూ నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు నింపలేదు, తాగు నీటి సమస్య తీర్చలేదు. ఇవి చేయనిదే ఓటడగనన్న డిప్యూటీ సీఎం ఏ మొహం పెట్టుకుని నేడు తన కుమారుడికి ఓటెయ్యాలని అడుగుతున్నారని ప్రశ్నించారు.
తన భర్తను హత్య చేసి గెలిచేశామనుకున్న వాళ్ల గుండెల్లో నేడు తనకు, పార్టీకి వస్తున్న ఆదరణ చూసి దడ మొదలైందన్నారు. ఆసుపత్రుల వెంట పరుగులెడుతున్నారన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇదే అభిమానాన్ని మరో ఆరు రోజులు కొనసాగించి ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలో తనకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి సంజీవ్‌కుమార్‌కు మరో ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ పదవులు లేకున్నా తన సోదరుడు దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి నియోజకవర్గంలో చేసిన సేవలు ప్రజల గుండెల్లో ఉన్నాయన్నారు.
కంగాటి శ్రీదేవి రోడ్‌షో సందర్భంగా వెల్దుర్తి పట్టణం జనసంద్రమైంది. ప్రభుత్వాసుపత్రి నుంచి పోలీస్‌స్టేషన్ వరకు రోడ్డు నిండిపోయింది. రోడ్‌షోలో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల కన్వీనర్లు బొమ్మన రవిరెడ్డి, ఆర్‌బీ వెంకట్రాముడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఉదయ్ కిరణ్, చెరుకులపాడు వెంకట్రామిరెడ్డి, స్నేహారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, శివారెడి, జెడ్పీటీసీ సభ్యుడు సమీర్‌కుమార్ రెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్ నాయుడు, నాయకులు సుబ్బారెడ్డి, శరభారెడ్డి, ఆవుల భారతీ వెంకటేశ్వర్లు, అగస్టీన్, పెద్దిరెడ్డి, సుధీర్, ప్రశాంత్,, చిట్యాల నక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పత్తికొండ మండలంలో..
పత్తికొండ టౌన్: వైఎస్సార్‌సీపీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి శుక్రవారం కేడీసీసీ మాజీ వైస్‌చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్.నాగరత్నమ్మ దంపతులతో కలసి పత్తికొండ మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక రామక్రిష్ణారెడ్డినగర్ కాలనీతో పాటు, మండలంలోని కొత్తపల్లి, పందికోన, కోతిరాళ్ల, కనకదిన్నె అటికెలగుండు గ్రామాల్లో పర్యటించారు. వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ఆయా గ్రామాల్లోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బజారప్ప, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, అడ్వకేట్లు ప్రసాద్‌బాబు, నాగరాజు, వాసు, నాయకులు బలరాముడు, బాబుల్‌రెడ్డి, కృష్ణ, మస్తాన్, రవికుమార్, వెంకటేశ్, నారాయణస్వామి, అంజినయ్య, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వీరన్న, హనుమంతు పాల్గొన్నారు.
ఓటుతో బుద్ధి చెప్పండి
కృష్ణగిరి: మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం కంగాటి శ్రీదేవి ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే నవతర్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌రెడ్డి, రాజారెడ్డి, తిమ్మరాజు, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment