ke Krishnamurty
-
కర్నూల్లో కాల‘కేఈ’సోదరులు..
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : పత్తికొండ నియోజకవర్గంలో ఐదేళ్లు అరాచకం రాజ్యమేలింది. అక్రమాలు గద్దెనెక్కి తాండవం చేశాయి. అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రోడ్డు నిర్మాణాలు.. నీరు–చెట్టు పనులు.. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు..పని ఏదైనా కేఈ సోదరులకు పర్సంటేజీ ఇవ్వాల్సిందే. లేదని ఎదురు తిరిగితే విధ్వంసం మెరుస్తుంది..బెదిరింపు ఉరుముతుంది. కబ్జాలు..సెటిల్మెంట్లు..ఒకటేమిటి అన్నీ వారి ఆధీనంలోనే..చివరకు కూలీల రెక్కల కష్టాన్నీ వదల్లేదు..గాలిమరల ఏర్పాటులో చేతివాటం..ప్రైవేట్ సబ్స్టేషన్ల నిర్మాణాల్లో బలవంతపు వసూళ్లు .. మొక్కల పెంపకంలో అక్రమాలు..ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో..ఎన్నెన్నో.. కాల‘కేఈ’ల అరాచకాలు.. వాటిల్లో కొన్ని... అవినీతికి చిహ్నం.. కృష్ణగిరి మండలం ఎస్‌హెచ్ ఎర్రగుడి నుంచి మన్నెకుంట వరకు గత ఏడాది సబ్‌ప్లాన్ కింద 3.2 కి.మీ రహదారిని రూ.1.45కోట్లతో వేశారు. ఇది ఆరు నెలలకే దెబ్బతినడంతో మళ్లీ ప్యాచ్‌లు వేశారు. కృష్ణగిరి మండలంలో కేఈ కృష్ణమూర్తి సోదరుడు, మాజీ జెడ్పీటీసీ కేఈ జయన్నదే పెత్తనం. ఏ పనిలోనైనా కమీషన్లు తీసుకోవడం రివాజుగా మారింది. ఐదేళ్ల నుంచి ఒక్క కృష్ణగిరి మండలంలోనే రూ.7కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. దత్తత గ్రామంలో అక్రమాలు ఇది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దత్తత గ్రామమైన ఎరుకలచెర్వులోని సీసీ రోడ్డు దుస్థితి. అక్రమాలకు పాల్పడి నాసిరకంగా నిర్మించారనేదానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. నడవడానికి వీలులేకుండా తయారైన రోడ్లను చూసి.. గ్రామాన్ని దత్తత తీసుకుంది అభివృద్ధికా? అవినీతికా? అని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. భారీగా కమీషన్లు! పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద రూ.2కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ఇది. దీని నిర్మాణంలో కేఈ శ్యాంబాబుకు భారీగా కమీషన్లు అందాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా నలకదొడ్డి గ్రామం వద్ద ప్రధాన మంత్రి గ్రామ సడక్ నిధులు రూ.7కోట్లతో కాజ్వే నిర్మించారు. దీనిలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నాలుగేళ్లలో పత్తికొండ ఆర్అండ్బీ పరిధిలో రూ.49 కోట్లతో 89 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్ల పనులు జరిగాయి. ఈ పనుల్లో టీడీపీ నేతలకు కమీషన్లు అందాయి. పత్తికొండ మండలంలో రూ.6 కోట్లతో 515 పనులు జరిగాయి. వీటిలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా చేసిన పనుల్లో 10 శాతానికి పైగా కమీషన్ కేఈ శ్యాంబాబు ఆదేశాలతో నేరుగా టీడీపీ కార్యాలయానికి అందింది. పక్కా ఇళ్ల నిర్మాణం, చంద్రన్న బీమా మంజూరులోనూ కమీషన్ల పర్వం కొనసాగింది. ‘పక్కా’మోసం వెల్దుర్తిలో నక్కలతిప్పపై మూడేళ్ల నుంచి మొండిగోడలకే పరిమితమైన ఎన్టీఆర్ గృహాలు ఇవీ. వెల్దుర్తికి 106 గృహాలు మంజూరు కాగా.. లబ్ధిదారులకు తానే నిర్మించి ఇస్తానని వెల్దుర్తి టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ ఒక్కొక్కరినుంచి రూ.50 వేలు వసూలు చేశాడు. ఊరికి దూరంగా నక్కల తిప్పపై రెండెకరాల స్థలంలో ఇళ్లు కడతామని ఊరించాడు. మొండిగోడలు తప్ప అక్కడ ఇంకేమీ లేవు. కూలీల కష్టాన్నీ దోచుకున్నారు.. సోలార్‌ప్లాంట్ అనుమతుల విషయంలో అధికార పార్టీ నేత రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నదాన్ని తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటయ్యేలా అనుమతులు తీసుకున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటులో పట్టా భూములతో పాటు ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా వినియోగించారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో కంకర, ఇసుకతో పాటు పనిచేసే రోజు వారీ కూలీల డబ్బుల్లో కూడా కమీషన్లు కత్తిరించారు. అనుచరులు సైతం... పత్తికొండ మండలంలో రూ.60 లక్షలతో నీరు–చెట్టు పనులు చేశారు. అలాగే పత్తికొండ–ఆదోని రోడ్డులోని హంద్రీ–నీవా కాలువ నుంచి ఊరి చెరువుకు నీరు నింపేందుకు రూ.50లక్షలతో పైప్‌లైన్ నిర్మించారు. అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు ఈడిగ సుకన్యకు మామ అయిన ఇ.నాగయ్యగౌడు, అతని కుమారుడు రామ్మూర్తి గౌడు ఈ పనులు దక్కించుకొని భారీ అక్రమాలకు పాల్పడ్డారు. చక్రాళ్ల గ్రామ శివారులోని ఫారెస్టులో మొక్కల పెంపకం పేరుతో అధికార పార్టీ కార్యాలయ ఇన్చార్జ్ సుమారు రూ.30 లక్షల వరకు బొక్కేశారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేఈ శ్యాంబాబు అండతో పత్తికొండ–ఆదోని రోడ్డులో సుమారు 72 సెంట్ల కడగమ్ము వంక పోరంబోకు స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించారు. దర్జాగా బేరం పెట్టి అమ్ముకున్నారు. గాలిమరల ఏర్పాటులోనూ.. పత్తికొండ మండలంలోని దేవనబండ, హోసూరు, పెద్దహుల్తి, పుచ్చకాయలమాడ, పందికోన గ్రామాల్లో గాలిమరలు, ప్రైవేట్ సబ్స్టేషన్ల ఏర్పాటు చేశారు. ఈ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి కేఈ శ్యాంబాబు, సాంబ, శ్రీధర్‌రెడ్డి కోట్లాది రూపాయల కమీషన్లు రాబట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మన్ను తిన్న పాములు.. వెల్దుర్తి ఎర్ర చెరువు వద్ద టిప్పర్లులో పూడికమన్ను నింపుతున్న దృశ్యమిది. ఎర్రచెరువు మట్టిని ఇటుకల బట్టీలకు తరలించి టీడీపీ నాయకులు భారీగా సొమ్ము చేసుకున్నారు. మాట వినని అధికారులపై అధికార పార్టీ నాయకులు చేయిచేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. వెల్దుర్తి మేజర్ పంచాయతీ ఈఓగా ఉన్న ఫకృద్ధీన్ (ప్రస్తుతం ఈఓఆర్డీ)ను ఆఫీసుకు వెళ్లి చెంప చెళ్లు మనిపించారు. అభివృద్ధిని అడ్డుకొని.. ఇది మద్దికెర మండలం ఎం.ఆగ్రహారంలోని వనకుంట. 227 సర్వే నంబర్లో 1.92 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కుంటను వెడల్పు చేయడానికి వాటర్‌షెడ్ పథకం కింద రూ.5.80 లక్షలు మంజూరు చేశారు. పనులు పూర్తి అయితే వర్షపునీరు నిలిచి గ్రామంలో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. అయితే పనులు టీడీపీ నేతలకు దక్కలేదనే అసూయతో అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి నిలిపివేశారు. గ్రామాభివృద్ధికి సహకరించాల్సిన నాయకులు పర్సంటేజీల కోసం పనులకు బ్రేకులు వేయించాయరని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. విధ్వంసకాండ తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామ సమీపంలో ధ్వంసమైన వాహనాలివి. రైల్వే కాంట్రాక్ట్ విషయంలో ఎవరూ టెండర్ వేయవద్దని కేఈ వర్గం నుంచి హెచ్చరికలు వెళ్లినా.. వీటిని ఖాతరు చేయకుండా తుగ్గలి నాగేంద్ర టెండర్ దక్కించుకున్నారు. పనులు చేస్తున్న ప్రాంతంలో లారీలు, జేసీబీల అద్దాలను కేఈ శ్యాంబాబుకు చెందిన మనుషులు పగలగొట్టి బెదిరింపులకు దిగారని నాగేంద్ర ఆనాడు తీవ్రంగా ఆరోపించారు. -
కేఈ కుటుంబానికి దిమ్మతిరగాలి
సాక్షి, వెల్దుర్తి : ప్రజా సమస్యలు గాలికొదిలి ఇంట్లో కూర్చొని గెలుద్దామనుకున్న కేఈ కుటుంబానికి ఎన్నికల ఫలితాలను చూసి దిమ్మతిరగాలని వైఎస్సార్సీపీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పాతబస్టాండులో శ్రీదేవి మాట్లాడుతూ నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు నింపలేదు, తాగు నీటి సమస్య తీర్చలేదు. ఇవి చేయనిదే ఓటడగనన్న డిప్యూటీ సీఎం ఏ మొహం పెట్టుకుని నేడు తన కుమారుడికి ఓటెయ్యాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. తన భర్తను హత్య చేసి గెలిచేశామనుకున్న వాళ్ల గుండెల్లో నేడు తనకు, పార్టీకి వస్తున్న ఆదరణ చూసి దడ మొదలైందన్నారు. ఆసుపత్రుల వెంట పరుగులెడుతున్నారన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇదే అభిమానాన్ని మరో ఆరు రోజులు కొనసాగించి ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలో తనకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి సంజీవ్‌కుమార్‌కు మరో ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ పదవులు లేకున్నా తన సోదరుడు దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి నియోజకవర్గంలో చేసిన సేవలు ప్రజల గుండెల్లో ఉన్నాయన్నారు. కంగాటి శ్రీదేవి రోడ్‌షో సందర్భంగా వెల్దుర్తి పట్టణం జనసంద్రమైంది. ప్రభుత్వాసుపత్రి నుంచి పోలీస్‌స్టేషన్ వరకు రోడ్డు నిండిపోయింది. రోడ్‌షోలో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల కన్వీనర్లు బొమ్మన రవిరెడ్డి, ఆర్బీ వెంకట్రాముడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఉదయ్ కిరణ్, చెరుకులపాడు వెంకట్రామిరెడ్డి, స్నేహారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, శివారెడి, జెడ్పీటీసీ సభ్యుడు సమీర్‌కుమార్ రెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్ నాయుడు, నాయకులు సుబ్బారెడ్డి, శరభారెడ్డి, ఆవుల భారతీ వెంకటేశ్వర్లు, అగస్టీన్, పెద్దిరెడ్డి, సుధీర్, ప్రశాంత్,, చిట్యాల నక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ మండలంలో.. పత్తికొండ టౌన్: వైఎస్సార్సీపీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి శుక్రవారం కేడీసీసీ మాజీ వైస్‌చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్.నాగరత్నమ్మ దంపతులతో కలసి పత్తికొండ మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక రామక్రిష్ణారెడ్డినగర్ కాలనీతో పాటు, మండలంలోని కొత్తపల్లి, పందికోన, కోతిరాళ్ల, కనకదిన్నె అటికెలగుండు గ్రామాల్లో పర్యటించారు. వైఎస్సార్సీపీని గెలిపించాలని ఆయా గ్రామాల్లోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బజారప్ప, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, అడ్వకేట్లు ప్రసాద్‌బాబు, నాగరాజు, వాసు, నాయకులు బలరాముడు, బాబుల్‌రెడ్డి, కృష్ణ, మస్తాన్, రవికుమార్, వెంకటేశ్, నారాయణస్వామి, అంజినయ్య, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వీరన్న, హనుమంతు పాల్గొన్నారు. ఓటుతో బుద్ధి చెప్పండి కృష్ణగిరి: మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం కంగాటి శ్రీదేవి ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే నవతర్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌రెడ్డి, రాజారెడ్డి, తిమ్మరాజు, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోట్ల కుటుంబం రహస్య మంతనాలు
సాక్షి, కర్నూలు : ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీలో చిచ్చు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరులు మండిపడుతున్నారు. బీసీ నేతను కాదని కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఆమెకు టికెట్ కేటాయిస్తే తాము ఓటు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్‌ను కాదని కోట్ల సుజాతమ్మకు నియోజకవర్గ టికెట్ ఎలా కేటాయిస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీసీ నేతలంతా కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసన ర్యాలీ కూడా చేపట్టారు. మరోవైపు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా టీడీపీ అసమ్మతి నేతలతో కోట్ల కుటుంబం రహస్యంగా మంతనాలు జరుపుతోంది. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా... టీడీపీ శ్రేణులు మాత్రం ససేమిరా అంటున్నాయి. కాగా జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. -
‘కేఈకి ఆహ్వానం లేకపోవటం దారుణం!!’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తికి రాజధానిలో జరిగే శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవటం దారుణమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కే పార్థసారధి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన కేఈ క్రిష్ణమూర్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగానే అవమానించారని పేర్కొన్నారు. దేవాదాయశాఖ మంత్రికి అధికారులు ఆహ్వానం ఇవ్వలేకపోవటం వెనుక సీఎం ఆదేశాలే కారణమని తెలిపారు. గతంలో కూడా అమరావతి శంకుస్థాపన వేదికపై ఒక్క బీసీకి కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారు. అమరావతి నిర్ణయాత్మక కమిటీలో కూడా రెవెన్యూ మంత్రిగా వున్న కేఈ క్రిష్ణమూర్తిని నియమించకుండా అవమానించారని చెప్పారు. బలహీన వర్గాలను చిన్నచూపు చూడటం మొదటి నుంచి సీఎం చంద్రబాబుకు అలవాటన్నారు. రానున్న ఎన్నికలలో బీసీలు చంద్రబాబుకు సరైన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానించారు. -
ఒకేరోజు రెండు అలంకారాల్లో అమ్మవారు
సాక్షి, అమరావతి: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా ఒక ప్రత్యేకత సంతరించుకోనుంది. ఆ రోజు ఉదయం మహిషాసుర మర్ధినిగా, మధ్యాహ్నం రాజరాజేశ్వరీ దేవిగా రెండు అలంకాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలంకరణ మార్చే సమయంలో ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు దర్శనం నిలిపివేసే అంశంపై దేవదాయ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని కలసి ఈ విషయంపై చర్చించారు. దసరాతోపాటు ఒకే రోజు అమ్మవారికి రెండు అలంకారాలు, దర్శనం నిలిపివేత వంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భక్తులు రెండు సార్లు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని కేఈ కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే భక్తులు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ప్రసాదాలకు అదనంగా అప్పం ప్రసాదంగా భక్తులకు అందజేయాలని నిర్ణయించినట్టు ఈవో కేఈకి వివరించారు. దసరా ఉత్సవాల్లో ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా కదంబం పంపిణీ చేయనున్నట్టు ఆమె తెలిపారు. అనంతరం కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారి అలంకరణ మార్చే సమయంలో దర్శనం నిలిపివేస్తున్న విషయాన్ని సామాన్య భక్తులకు తెలిసేలా విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. -
కాంగ్రెస్‌తో చేతులు కలపడం మాకు సమ్మతం కాదు
-
బాలుడిని ఢీకొట్టిన డిప్యూటీ సీఎం కాన్వాయ్
కర్నూలు : కర్నూలులోని సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామంలో ఓ బాలుడిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయ్‌లోని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలుడు పొలకల్ గ్రామానికి చెందిన దిలీప్ (7)గా గుర్తించారు. -
ప్యాకేజీకి మేమే ఒప్పుకున్నాం: కేఈ కృష్ణమూర్తి
కర్నూలు: ప్రత్యేక హోదాకు మించి ఇస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందనే హోదా అడుగుతున్నామన్నారు. ఈ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ప్రధానితో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఏపీ అంటే మోదీకి చులకన అని, ఆంధ్రులను అవమానపరిచిన వారు మట్టికొట్టుకుపోతారని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తిరుపతి : రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక్క సీటు గెలిచినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవాస్తవాలు ప్రస్తావించారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారు అని ప్రధాని అనడం అన్యాయమన్నారు. అవాస్తవ హామీలతో ఏపీ ప్రజల్ని మోసగించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూ టర్న్ తీసుకున్నది మోదీయేనని విమర్శించారు. రాష్ట్రానికి హోదా తీసుకురావడానికి ఎంత దూరమైనా వెళతామని, ధర్మ పోరాటం విరమించే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటా
-
పేపర్లు బల్లకేసి కొట్టిన డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అసైన్డ్ కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని టార్గెట్ చేశారు. అసైన్డ్ కమిటీల ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అసలు అసైన్మెంట్ కమిటీలు ఉన్నాయా లేదా అని ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిలదీశారు. ఎమ్మెల్యే చైర్మన్‌గా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే అసైన్డ్ కమిటీల గురించి సమాచారం కోరారు. ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసైన్డ్ కమిటీలపై సమాచారం తెప్పించుకుంటామని తెలిపారు. అసైన్మెంట్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయో లేదా రిపోర్ట్ తెప్పించుకుంటామని ఆయన అన్నారు. అసైన్డ్ కమిటీలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై మంత్రి కేఈ అసహనం వ్యక్తం చేస్తూ.. తన చేతిలో ఉన్న పేపర్లను బల్లకేసి కొట్టారు. సీఎందే బాధ్యత! అనంతరం డిప్యూటీ సీఎం కేఈ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అసైన్డ్ కమిటీల బాధ్యత సీఎందేనని అన్నారు. ‘ నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్తాను. ఎమ్మెల్యేలు నన్ను కాదు.. సీఎంను అడగాలి’ అని కేఈ అన్నారు. రేషన్ షాప్‌ల్లో వేలిముద్రలు..! రేషన్‌షాపుల్లో లబ్ధిదారుల వేలిముద్రల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సభ దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ మెషిన్లలో వేలిముద్రలు రాకపోవడంతో వృద్ధులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో మంత్రులు అసత్యాలు చెపుతున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు అంటూ అందరికీ ఆపాదించడం సరికాదని, విష్ణుకుమార్ రాజు తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని యనమల కోరారు. తన ఉద్దేశం అది కాదన్న విష్ణుకుమార్ రాజు.. స్పీకర్ సూచన మేరకు మంత్రులు అబద్ధాలు చెప్తున్నారన్న వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్నారు. బయో మెట్రిక్ మెషిన్లలో వేలిముద్రలు గుర్తించకపోవడంతో రేషన్ ఆగిపోయే పరిస్థితి లబ్ధిదారులకు రానివ్వబోమని పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వెలిముద్రల సమస్యలు ఉన్న చోట వెంటనే స్పందిస్తున్నామని చెప్పారు. మూడు3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోయిన కార్డ్ రద్దు కాదని చెప్పారు. అవస్తవాలు చెప్పాల్సిన అవసరం మంత్రులకు లేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాబోమని ఆయన అన్నారు. -
దమ్ముంటే వేటు వేయండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ‘అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ పలాయనం చేసిందని విమర్శించే అర్హత మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కాలవ శ్రీనివాసులుకు లేదు. దమ్ముంటే మా పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలి’ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్ ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఖూనీ చేస్తుండడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారన్నారు. ఈ నిజాన్ని కప్పి పెట్టేందుకు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడమే కాక.. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి కష్టాలు తెలుసుకొని.. భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ యాత్రతో ఎక్కడ తమ పునాదులు కదులుతాయోనని అధికారపార్టీ నేతలకు భయం పట్టుకుందన్నారు. ఆయన పేరుకే డిప్యూటీ సీఎం.. కేఈ కృష్ణమూర్తి పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం అని ఆయనకు ఎలాంటి అధికారాలు లేవని..రెవెన్యూశాఖలో ఆయన మాట చెల్లుబాటు కాదని బీవై రామయ్య ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గమైన పత్తికొండలో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చెరువులు నింపుకోలేకపోయారన్నారు. రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా సీఎంను ప్రశ్నించలేని కేఈకి తమ పార్టీపై విమర్శలు చేసే హక్కు లేదన్నారు. సొంత సామాజికవర్గమైన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించలేని మంత్రి కాలవ శ్రీనివాసులుకు ఇతరుల గురించి మాట్లాడే అధికారం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ మద్దయ్య, కర్నాటి పుల్లారెడ్డి, శౌరీ విజయకుమారి, రమణ, భాస్కరరెడ్డి, రెహమాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ బ్యాంక్ నిధులతో రోడ్ల నిర్మాణం
కర్నూలు (అర్బన్): దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రోడ్లను ప్రపంచ బ్యాంక్ నిధులతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి అన్నారు. కర్నూలు నుంచి దేవనకొండ వరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు కేఈతోపాటు రోడ్లు, రవాణా శాఖమంత్రి సిద్ధా రాఘవరావు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక బళ్లారి రోడ్డులోని రేడియో స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేఈ మాట్లాడారు. నాణ్యతలో రాజీ పడకుండా రోడ్లను మలేషియా తరహాలో నిర్మించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రపంచ బ్యాంక్ నిధులు రూ. 133.54 కోట్లతో రోడ్లను రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ భవిష్యత్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోడ్లను బాగు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి నివేదికలను తెప్పించుకున్నామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు ఇబ్బందికరంగా మారాయని, నిధులు మంజూరు చేసి కొత్త రోడ్లు నిర్మించాలని కోరారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ మాట్లాడుతూ ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందన్నారు. ఎమ్మెల్సీలు ఎం.సుధాకర్‌బాబు, డాక్టర్ గేయానంద్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఎం.మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎస్పీ ఆకే రవిక్రిష్ణ, ఏపీఆర్డీసీ ఎండీ జగన్నాథరావు, ఆర్అండ్బీ ఎస్ఈ రాజీవ్‌రెడ్డి, ఆర్డీసీ, ఆర్అండ్బీ ఈఈలు నాగరాజు, ఉమామహేశ్వర్, డీగఈఈ శ్రీధర్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ మూర్తి, వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.