విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు: ప్రత్యేక హోదాకు మించి ఇస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందనే హోదా అడుగుతున్నామన్నారు. ఈ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ప్రధానితో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు.
ఏపీ అంటే మోదీకి చులకన అని, ఆంధ్రులను అవమానపరిచిన వారు మట్టికొట్టుకుపోతారని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment