కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయం ముందు ఆంజనేయనగర్‌కు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం ధర్నాకు దిగారు.
కర్నూలు (పత్తికొండ) : కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయం ముందు ఆంజనేయనగర్‌కు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం ధర్నాకు దిగారు. తాగునీటి సమస్యను తీర్చాలని కోరుతూ టీడీపీ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్‌లు ఎన్నికల సమయంలో నమ్మకమైన మాటలు చెప్పడం వల్ల వాళ్లకు ఓట్లేశామని, ఎన్నికలైపోయిన తర్వాత తమ సమస్యను పట్టించుకోవడం మానేశారని మహిళలు వాపోయారు. ధర్నా సమయంలో టీడీపీ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. సుమారు 150 మంది మహిళలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.