నంద్యాల పట్టణంలో టీ నోట్కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పత్తికొండలోని రాజీవ్ యువకిరణాలు శిక్షణ కేంద్రంపై సమైక్యవాదులు దాడి చేశారు. దాంతో కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసమైంది. సమైక్య ఉద్యమంలో భాగంగా కోడుమూరులోని ఉపాధ్యాయ జేఏసీ నాయకుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఆగ్రహించిన ఉద్యోగులు, సమైక్యవాదులు పోలీసు స్టేషన్ను ముట్టడించారు.రాష్ట్ర విభజనను నిరసిస్తూ శ్రీశైలం దేవస్థానం ఉద్యోగస్థులు శనివారం శ్రీశైలంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కర్నూలు నగరంలోని జిల్లా వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగస్థులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు.