
'కర్మ, కర్త, క్రియ అన్నీ ఆయనే'
ఆళ్లగడ్డ: తమపై కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు డిపార్ట్ మెంటును ప్రభుత్వం ఉపయోగించడం విడ్డూరమని నంద్యాల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. తమపై అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరించాలని టీడీపీ సర్కారు చూస్తోందని ఆరోపించారు.
ఆళ్లగడ్డ సబ్ జైలు నుంచి బుధవారం సాయంత్రం ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనపై కేసులకు కర్మ, కర్త, క్రియ అన్నీ జిల్లా ఎస్పీనే అన్నారు. ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూమా నాగిరెడ్డిని అంతకుముందు ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించారు.