అనంతపురం జిల్లా పత్తికొండ రోడ్డులో నిర్వహించిన వాహన తనిఖీల్లో 19 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా పత్తికొండ రోడ్డులో నిర్వహించిన వాహన తనిఖీల్లో 19 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నసీర్ అనే వ్యక్తి కారులోని ఓ బ్యాగ్‌లో 19లక్షల నగదును పోలీసులు గుర్తించారు. అయితే ఆ సొమ్ముకు సంబంధించి ఎలాంటి పత్రాలు అతడివద్ద లేకపోవడంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
నాసీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో 50 వేల రూపాయలకు మించి ఎక్కువ డబ్బును వెంట తీసుకువెళ్లొద్దని, తప్పనిసరై తీసుకెళ్లాల్సి వస్తే అందుకు సంబంధించిన రసీదులు, ఇతర పత్రాలు తప్పకుండా వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.