డ్యూటీలు వేస్తే నరికేస్తా
Published Sat, Apr 29 2017 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM
– క్లస్టరు ప్రధాన వైద్యుడిని బెదిరించిన డాక్టరు బంధువు
పత్తికొండ : డ్యూటీలు వేస్తే నరికేస్తానని ఓ డాక్టర్ బంధువు... పట్టణంలోని కమ్యూటీ హెల్త్ అండ్ న్యూటిషన్ క్లస్టర్ ప్రధాన వైద్యుడిని ఫోన్‌లో బెదిరించారు. టీడీపీ నేతల అండదండలతో ఈ క్లస్టర్ పరిధిలో కొందరు డ్టాక్టర్లు విధులకు డుమ్మా కొట్టండం సర్వసాధారణమైంది. నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులు, సిబ్బందికి మెమోలు జారీ చేసిన ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో ఓ డాక్టర్ బంధువు ఏకంగా..ప్రధాన వైద్యుడికి ఫోన్ చేసి బెదిరించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంమై క్లస్టర్ డిప్యూటీ సివిల్ సర్జన్ ప్రకాశం మాట్లాడుతూ.. బెదిరింపులు వాస్తమేనన్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు.
Advertisement
Advertisement