
పత్తికొండ రూరల్: ‘నా బిడ్డను ఆశీర్వదించు జగనన్నా’ అని కోవెలకుంట్లకు చెందిన మాధవరెడ్డి, అచ్యుత దంపతులు వైఎస్ జగన్‌ను కోరారు. ఆదివారం అమడాల – గులాంనబీపేట మధ్య సాగుతున్న పాదయాత్రలో వారు వైఎస్‌జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు తమ బిడ్డ యక్షితకుమార్ రెడ్డిని ఆశీర్వదించాలని నెలరోజుల బిడ్డను జగన్‌కు అందించారు. ఈసందర్భంగా జగన్ పసిపిల్లాడిని ఆప్యాయంగా ఎత్తుకుని అష్టైశ్వర్యాలు.. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు.
దివ్యాంగులకు రూ.4 వేలు పింఛన్ ఇవ్వాలి..
కోవెలకుంట్ల: దివ్యాంగులకు నెలకు రూ.4 వేలు పింఛన్ ఇవ్వాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అందనం దేవరాజు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కోరారు. ఆదివారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సౌదరదిన్నె వద్ద జగన్‌ను కలసి వారి సమస్యలను తెలియజేశారు. దివ్యాంగులకు ప్రతి మండలంలో ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలని, ఉచిత కరెంటు, గ్యాస్ కనెక్షన్, ఆర్టీసీలో వంద శాతం రాయితీ, 50 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల రుణం అందజేయాలన్నారు. వివాహ ప్రోత్సాహం కింద రూ.5 లక్షల నగదు, స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు.
వర్గీకరణకు సహకరించండి..
ఆత్మకూరు: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సహకరించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు వైఎస్ జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం వారు ఇల్లూరి కొత్తపేట వద్ద జననేతను కలిసి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇందుకు జగన్ స్పందిస్తూ ఈ విషయంలో చట్టబద్ధంగా వెళ్దామని, చంద్రబాబులాగా తాను మోసం చేయనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment