సాక్షి, కర్నూలు : ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం ఉపాధి హామీ, వాటర్ షెడ్ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై వైఎస్ జగన్‌నకు వినతిపత్రం ఇచ్చారు. 20 ఏళ్లుగా పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తామని చెప్పి, చంద్రబాబు నాయుడు మోసం చేశారని వారు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్న వైఎస్ జగన్... వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బీఈడీ, డైట్ కాలేజీ విద్యార్థుల ఆవేదన
తమ సమస్యలపై బీఈడీ, డైట్ కాలేజీ విద్యార్థులు శుక్రవారం వైఎస్ జగన్‌ను కలిశారు. టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదని, బీఈడీ అభ్యర్థులను కూడా ఎస్‌జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే డైట్ కాలేజీ విద్యార్థినులు కూడా జగన్‌కు కలిసి... డైట్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, తమ భవిష్యత్ అర్థం కావడం లేదంటూ వారు తమ గోడు వెలిబుచ్చారు. పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకు అంటూ డైట్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment