రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజు సోమవారం చిత్తూరు జిల్లా పలమనేరులో కొనసాగనుంది. వి. కోట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ప్రధానంగా వి.కోట బస్టాండు సెంటర్, దొడ్డిపల్లి, కొమ్మరామడుగు, దియోదొడ్డి మీదుగా కొనసాగుతుంది. ప్రధానంగా ఈ అన్ని ప్రాంతాల్లో రోడ్డు షోగా కొనసాగి, బైరెడ్డిపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడంతో పాటు విభజనకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్ కుట్రలను, ఆ పార్టీకి వంతపాడుతున్న తెలుగుదేశం పార్టీ మోసాలను ప్రజలకు వివరించి, దాంతో పాటు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబీకులను కూడా జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారు.
నేడు చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ సమైక్య శంఖారావం
Published Mon, Dec 2 2013 8:10 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement