సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన నాలుగోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మెడ నొప్పితో బాధపడుతున్నందున యాత్ర ఒక రోజు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
వైద్యుల సూచన మేరకు మరో రెండు రోజులు వాయిదా వేసినట్లు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. సోమవారం నుంచి నగరి, జీడీ నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో సమైక్య శంఖారావం యాత్ర సాగనుంది.
20 నుంచి సమైక్య శంఖారావం
Published Sat, Jan 18 2014 5:35 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement