మన మహానగరం మనకు ఉండాలి: జగన్ | YS Jaganmohan Reddy says Hyderabad is to be all of us | Sakshi
Sakshi News home page

మన మహానగరం మనకు ఉండాలి: జగన్

Published Fri, Dec 27 2013 10:22 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మన మహానగరం మనకు ఉండాలి: జగన్ - Sakshi

మన మహానగరం మనకు ఉండాలి: జగన్

 దశాబ్దాల తరబడి నిర్మించుకున్న మన మహానగరం మనకు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ సమైక్య శంఖారావం యాత్రను శుక్రవారం చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు.

నీటి కోసం నిలదీయాల్సిందిపోయి టీడీపీ అధ్యక్షుడు విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. నీళ్ల కోసం ప్రజలు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల చొక్క పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారని జగన్ ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం మన పిల్లల భవిష్యత్తో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్రెడ్డిలకు దమ్ము, దైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా సమైక్య నినాదం వినిపించే దమ్ము, ధైర్యం తనకుందని జగన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement