'కాంగ్రెస్వి దిగజారుడు రాజకీయాలు'
శ్రీకాకుళం : రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. సమైక్యరాష్ట్రం కోసం వైఎస్ జగన్ తలపెట్టిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి అంతా మద్దతు ఇవ్వాలని ఆయన గురువారమిక్కడ కోరారు.
ఆనాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారని, ఇప్పుడు జగన్ మాత్రమే సమైక్య రాష్ట్రం కోసం స్పష్టమైన ఆశయంతో పోరాడుతున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పలు వార్డుల్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సమైక్య నినాదం కార్యక్రమాన్ని తమ్మినేని సీతారాం నిర్వహించారు.