జనప్రభంజనం 'సమైక్య శంఖారావం' | 'Samaikya Sankharavam' a Grand Success | Sakshi
Sakshi News home page

జనప్రభంజనం 'సమైక్య శంఖారావం'

Published Sat, Oct 26 2013 8:16 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జనప్రభంజనం 'సమైక్య శంఖారావం' - Sakshi

జనప్రభంజనం 'సమైక్య శంఖారావం'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించిన 'సమైక్య శంఖారావం' భారీ బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూల నుంచి లక్షల మంది జనం తరలి వచ్చినప్పటికీ సభ ప్రశాంతంగా ముగిసింది. ఒక్క ఎల్బి స్టేడియమే కాదు హైదరాబాద్ అంతా సమైక్యవాదులతో నిండిపోయింది. ట్రాఫిక్ జామ్ వల్ల వందల వాహనాలు నగర శివార్లలోనే ఆగిపోయాయి.   భారీ వర్షాలను కూడా లెక్కచేయకుండా 23 జిల్లాల నుంచి జనం రైలు, రోడ్డు మార్గాలలో సభకు వచ్చారు.  యువకులు, వృద్ధులు, మహిళలు అన్ని వయసుల వారు, రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు..... అన్నివర్గాల ప్రజలు ఎవరికి అందిన వాహనంలో వారు హైదరాబాద్ చేరుకున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనం కదలి వచ్చారు.  వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలతోపాటు పార్టీలకు అతీతంగా సమైక్యవాదులు కదలి వచ్చారు. తెలంగాణ జిల్లాల నుంచి కూడా జనం రావడం విశేషం.  మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలుగా తరలివస్తున్నారు. నేల ఈనిందా అన్నట్లు నగరం సమైక్యవాదులతో కిక్కిరిసిపోయింది. అందరిది ఒకటే లక్ష్యం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే వారి కోరిక. అందు కోసం పోరాడే ఒకే ఒక్క నాయకుడుగా వైఎస్ జగన్  వారికి కనిపించారు.  దిక్కలు పిక్కటిల్లేల్లాగా, ఢిల్లీ వరకు వినిపించేలా జనం సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రాష్ట్ర రాజధాని సమైక్యవాదుల నినాదాలతో హోరెత్తింది.

తుపాను ప్రభావం వల్ల నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది. పంటలు నీట మునిగాయి. మార్కెట్లకు చేరిన పంటలు కూడా తడిసి మద్దయిపోయాయి. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు నీటి ప్రవాహంలో చిక్కకున్నాయి. జనం వరదల తాకిడికి విలవిలలాడుతూ, ప్రకృతి బీభత్సాన్ని  కూడా లెక్కచేయకుండా 'సమైక్య శంఖారావం' సభకు వచ్చారు. అంటే వారిలో సమైక్యవాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాజధానిలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు  ర్యాలీలుగా తరలివచ్చారు. నగరం ట్రాఫిక్ పద్యవ్యూహంలో చిక్కుకుపోయింది. ట్రాఫిక్లో చిక్కుకొని లక్షల మంది ప్రజలు సభా వేదికవరకు రాలేకపోయారు.

భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో సమైక్య శంఖారావం సభ జరగదని చాలా మంది అనుకున్నారు. అయితే వారి ఊహలు ఏమీ ఫలించలేదు. రెండు రోజుల నుంచి నగరాన్ని తడిపి ముద్ద చేస్తున్న వరుణుడు కూడా కరుణించాడు. సమైక్యాంధ్రకు మద్దతు పలికాడు. సభ జరిగినంతసేపు వాన వెలిసింది. శుక్రవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది.  శనివారం ఉదయం నుంచి వర్షం ఆగిపోయి, వాతావరణంలో ఒక్కసారిగా మార్పురావడంతో సమైక్యవాదులు అత్యంత ఉత్సాహంతో తరలివచ్చారు. సభ దిగ్విజయంగా జరిగింది. జగన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర విభన వల్ల తలెత్తే సమస్యలను జగన్ వివరించారు. ఎన్నో కొత్త అంశాలను కూడా ప్రస్తావించారు.  ఇది తమ సమస్య కాదులే అని దేశంలోని ఇతర రాష్ట్రాల నేతలు ఏమీ మాట్లాడకపోతే రేపు తమ దాకా వచ్చినప్పుడు మద్దతు పలికేవారు ఉండరని హెచ్చరించారు. సభ విజయవంతం కావడంతో సమైక్యవాదులు కొత్త ఉత్సాహంతో వెనుదిరిగి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement