grand success
-
చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్
Chandrayaan-3 Youtube most viewed Record చంద్రయాన్ -3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన కోట్లాదిమంది భారతీయుల కలల్ని సాకారం చేసింది. ఇస్రో. దీంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లపై అభినందనల వెల్లువ కురిసింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని దక్కించుకుంది. జాబిల్లిపై భారతీయజెండాను రెపరెపలాడించేందుకు ఉద్దేశించిన ఈ చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్‌తో రూ. 615 కోట్లు. అతితక్కువ బడ్జెట్‌తో అంతరిక్ష యాత్రల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది. ప్రత్యేకించి 96.5 మిలియన్ల డాలర్ల బ చంద్రయాన్-2తో బడ్జెట్‌తో పోల్చినా ఇది తక్కువే కావడం విశేషం. మరో విశేషాన్ని కూడా చంద్రయాన్-3 మిషన్ సాధించింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రాంగా ఘనతను దక్కించుకుంది. భారత ఇస్రో చంద్రయాన్ -3 లైవ్‌ను ఏకంగా 8.06 మిలియన్లు మంది వీక్షించారని తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారాన్ని అత్యధికంగా చూసిన ఇతర కార్యక్రమాలు బ్రెజిల్ vs దక్షిణ కొరియా ఫుట్‌బాల్ మ్యాచ్: 6.15 మిలియన్లు బ్రెజిల్ vs క్రొయేషియా ఫుట్‌బాల్ మ్యాచ్: : 5.2 మిలియన్లు వాస్కో vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్ మ్యాచ్ : 4.8 మిలియన్లు అమెరికా స్పేస్ఎక్స్ క్రూ డెమో: 4.08 మిలియన్లు బీటీఎస్ బటర్ వెన్న: 3.75 M యాపిల్ లైవ్ ఈవెంట్ 3.69 M జానీ డెప్ v అంబర్ ట్రయిల్ : 3.55 మిలియన్లు ఫ్లుమినెన్స్ vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్ మ్యాచ్ : 3.53 మిలియన్లు కారియోకో చాంపియషన్ షిప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్: 3.25మిలియన్లు Most Viewed Live Streams on YouTube ▶️ 1. 🚀🇮🇳 ISRO Chandrayaan3: 8.06 Million 🔥 2. ⚽️🇧🇷 Brazil vs South Korea: 6.15 M 3. ⚽️🇧🇷 Brazil vs Croatia: 5.2 M 4. ⚽️🇧🇷 Vasco vs Flamengo: 4.8 M 5. 🚀🇺🇸 SpaceX Crew Demo: 4.08 M 6. 🎶🇰🇷 BTS Butter: 3.75 M 7. 🇺🇸 Apple: 3.69 M 8. 🧑⚖️🇺🇸… — The World Ranking (@worldranking_) August 23, 2023 -
ఖండాతరాలకు వ్యాపిస్తున్న విశాఖ ఖ్యాతి
-
ముగిసిన జీ 20 సదస్సు.. గ్రాండ్ సక్సెస్
-
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ సక్సెస్
-
పొలిటికల్ కారిడార్ : చిత్తూరు జిల్లా టీడీపీలో వణుకు
-
చరిత్ర సృష్టించిన సీఎం జగన్.. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు
-
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ గ్రాండ్ సక్సెస్
-
చరిత్ర సృష్టించాలన్నా.. దాన్ని తిరగరాయాలన్నా మనమే: ఆటా
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ డీసీ నగరం తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో 15వేల మందికి పైగా హాజరైనారు. జులై 1 వ తారీఖున నిర్వహించిన బాంక్వేట్ డిన్నర్ లో 3000 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ ఆటా అవార్డ్స్ ప్రదానం చేసారు. క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ తదితరులు ఈ బాంక్వేట్ డిన్నర్ లో పాల్గొన్నారు, వీరిని ఆటా ఘనంగా సత్కరించింది. 125 మందితో స్వాగతోత్సవ జానపద సంబరాలు "మన ఆటా జానపదాల కోట" నిర్వహించారు. 140 మందికి పైగా పాల్గొన్న “తెలుగు మన వెలుగు” కార్యక్రమంలో కూచిపూడి, గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మన బడి బాలలు చేసిన శ్రీ కృష్ణ రాయభారం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ పైన ఆటా ముద్రించిన పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వద్దిపర్తి పద్మాకర్ అవధానం విశేషంగా ఆకట్టుకున్నది. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రుతలు గించింది. ఉపాసన కామినేని సద్గురుకి వినూత్నమైన ప్రశ్నలు శ్రోతల తరపున అడిగారు. సద్గురు మాట్లాడుతూ పర్యావరణ ముప్పుని నివారించటానికి సారవంతమైన భూమిని ఎలా కాపాడుకోవాలో, ఆహార భద్రతకు దీని ఆవశ్యకత, ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో సోదాహరణంగా “సేవ్ ది సాయిల్” ప్రోగ్రాం గురించి వివరించారు. ఈ సభలకు మగ్దూం సయ్యద్, రవి రాక్లే, సింగర్ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళలు, పిన్నలు పెద్దలు సాంప్రదాయ దుస్తులతో సందడి చేసారు. ఆటా మొదటి రోజు సాహిత్య కార్యక్రమాల ప్రారంభ సమావేశంలో కే. శ్రీనివాస్, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి, స్వామి వెంకటయోగి సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత, జొన్నవిత్తుల తన పారడీ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మానకాలపు నవల, కథ’ పేరుతో నిర్వహించిన చర్చలో అమెరికాలో ఉన్న కథా, నవలా రచయితలు పాల్గొని సమకాలీన కథా సాహిత్యం గురించి లోతైన చర్చ చేశారు. రెండవ రోజు సాహిత్య కార్యక్రమాలలో సినిమాకి, సాహిత్యంలో ఉన్న సంబంధం గురించి వివరించడానికి ‘సినిమా కథ... సాహిత్య నేపధ్యం’ పేరుతో నిర్వహించిన చర్చలో దర్శకులు సందీప్ రెడ్డి వంగ, తనికెళ్ళ భరణి, ధర్మ దోనేపూడి, సుకుమార్, శివ సోమయాజుల పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకులు సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత, ‘ఆటా, పాటా, మనం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమమంలో చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి వారి పాటల నేపధ్యాన్నీ వివరించారు. ఈ కార్యక్రమానికి ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన లభించింది. జులై 3న ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలందుకున్నారు. ఆటా బ్యూటీ పేజంట్ విజేతలకు హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్, నటుడు అడివి శేష్ బహుమతులందచేశారు. అమెరికాలో 12 నగరాల నుంచి ఔత్సాహికులు పాల్గొనటం విశేషం. ఝుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం నాట్య పోటీల విజేతలకు బహుమతులు అందచేశారు. బిజినెస్ కమిటీ నిర్వహించిన ఎంట్రప్రెనేయూర్షిప్ అండ్ లైఫ్ సైకిల్ కార్యక్రమంలో GMR సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి పై నిర్వహించిన సదస్సులో తనికెళ్ళ భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహాసభలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్ , గాదారి కిశోర్, వైజాగ్ పార్లమెంట్ సభ్యులు MVV సత్యనారాయణ, రాజమండ్రి శషన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌధరి ఇతర నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ ధ్యాన గురువు కమలేష్ పటేల్( దాజి) ప్రత్యేక సందేశం అందించారు . ఈ మహాసభల నిర్వహణకు విరాలలాను అందచేసిన ధాతలను ఆటా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అధినేత డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు వారందరు అమెరికాలో ఎదగటానికి ఆకాశమే కొలమానమని మన జాడ్యాలను విడనాడి అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో అబివృద్దిలోకి రావాలి అని ఆయన ఆకాంక్షించారు. ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల తెలుగు శాస్త్రీయ పద్దతిలో ఘనంగా సత్కరించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అంధరిని మైమరిపించింది. గురువందనతో సంగీత విభావరి ప్రారంభమై ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయనీగాయకులసంగీత ఝురిలో ప్రేక్షకులను ఉర్రూతలూగారు. =అమెరికాలో తెలుగు వారి చరిత్రలో నభూతో నభవిష్యతిగా ఈ మహాసభలు నిర్వహించడానికి తోడ్పాటునందించిన కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం తదితరులకు ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కోర్ కమిటీ, ఆడ్ హాక్ కమిటీ, కాట్స్ టీం & వాలంటీర్స్ ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు. ఆటా ఫౌండింగ్ మెంబర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్ అండ్ టీం కార్యాదక్షత మూలంగానే ఇంత ఘనంగా ఈ మహాసభలు నిర్వహించగలిగామని కొనియాడారు. వెండర్ బూత్స్ ఒక మినీ షాపింగ్ మాల్ని పించాయి. ఆటా సంప్రదాయ దుస్తులలో రిజిస్ట్రేషన్ వాలంటీర్స్ ఎరుపు రంగు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మీడియా మిత్రులకు, ప్రకటనకర్తలు వాలంటీర్స్, సహకరించిన ప్రతి ఒక్కరికి అట కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ కోశాధికారి విజయ్ కుందూరు కాన్ఫరెన్స్ విజయానికి ఎంతో తోడ్పాటుని అందించిన కోహోస్టు కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ సబ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్ పనులను కో-కన్వీనర్ సాయి సూదిని, కో-కోఆర్డినేటర్ రవి చల్ల. లోకల్ కోఆర్డినేటర్ శ్రావణ్ పాదురు పర్యవేక్షించారు. -
పేదల ఇళ్లల్లో మళ్లీ ఆదా
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో)లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రజాధనాన్ని భారీగా ఆదా చేస్తోంది. మొదటి దశలో ఇప్పటికే దాదాపు రూ.106 కోట్ల మేర ప్రజాధనం ఆదా కాగా తాజాగా శుక్రవారం రెండో దశ రివర్స్ టెండరింగ్‌లో రూ.46.03 కోట్లు ఖజానాకు మిగలడం గమనార్హం. 6,496 ఇళ్లకు రివర్స్... అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,496 ఇళ్ల నిర్మాణానికి రూ.317.45 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టారు. అంచనా వ్యయం కంటే 14.50 శాతం తక్కువకు అంటే రూ.271.42 కోట్లతో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. తద్వారా ఖజానాకు రూ.46.03 కోట్లు ఆదా అయ్యాయి. ఆదా ఇలా.. ►అనంతపురం జిల్లాలో (ఫేజ్ – 2) రూ. 220.69 కోట్ల అంచనాతో 4,608 ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్స్ రూ.188.69 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. ఇదే ప్రాజెక్టుకు గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.1,596 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేసింది. అంతకంటే 14.50% తక్కువకు అంటే చదరపు అడుగు రూ. 1,365కే ప్రస్తుతం రివర్స్ టెండరింగ్‌లో బిడ్ దాఖలు చేయడంతో రూ.32 కోట్లు ఆదా అయ్యాయి. ►పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.96.76 కోట్ల అంచనా వ్యయంతో 1,888 ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. శ్రద్ధ శబూరి సంస్థ 14.50 శాతం తక్కువకు అంటే రూ.82.73 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1 గా నిలిచింది. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టులో చదరపు అడుగుకు రూ. 1,602 చొప్పున కాంట్రాక్టు ఇచ్చారు. ప్రస్తుతం రివర్స్ టెండరింగ్‌లో రూ.1,370 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేయడంతో రూ.14.03 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. ‘రివర్స్’ విజయవంతం ‘ ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానం విజయవంతమవుతోంది. ఏపీ టిడ్కోరెండో దశ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.46.03 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాం. మొదటి దశలో సుమారు రూ. 106 కోట్లు ఆదా అయ్యాయి. ఇదే స్ఫూర్తితో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కొనసాగిస్తాం’ – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి మలిదేవి డ్రెయిన్ పనుల్లో రూ.3.02 కోట్లు ఆదా మలిదేవి డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు జలవనరుల శాఖ శుక్రవారం నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో ఖజానాకు రూ.3.02 కోట్లు ఆదా అయ్యాయి. 4.19 శాతం తక్కువ ధర (రూ. 69.09 కోట్లు) కోట్ చేసిన ఆర్కేఎన్ ప్రాజెక్ట్స్ ఈ పనులు దక్కించుకుంది. సంస్థ అర్హతలను మరోసారి పరిశీలించాక పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్)కి నెల్లూరు నీటిపారుదల విభాగం ఎస్ఈ ప్రసాదరావు ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రైస్ బిడ్‌లోనే 2.67 కోట్లు ఆదా నెల్లూరు జిల్లాలో మలిదేవి డ్రెయిన్, మరో 3 అనుబంధ డ్రెయిన్ల ఆధునికీకరణకు రూ.72.11 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్–ఓపెన్ విధానంలో జలవనరుల శాఖ గత నెల 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్కేఎన్ ప్రాజెక్ట్స్, టీఎస్సార్ కన్స్ట్రక్షన్స్ షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ప్రైస్‌బిడ్ శుక్రవారం తెరవగా 3.69 శాతం తక్కువ ధర కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. దీంతో ప్రైస్ బిడ్ స్థాయిలోనే రూ.2.67 కోట్లు ఆదా అయ్యాయి. ప్రైస్ బిడ్‌లో ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన రూ.69.44 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. గడువు ముగిసే సమయానికి రూ.69.09 కోట్లకు పనులు చేయడానికి ముందుకొచ్చిన ఆర్కేఎన్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎల్–1గా నిలిచి పనులు దక్కించుకుంది. -
అలా ఫిక్స్ అయితే బోల్తాపడతాం
‘‘స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ప్రతిదీ ప్లాన్డ్గా చేసుకుంటే ప్రతి సినిమా ఆడుతుందనేదే నా నమ్మకం. ఒక్కోసారి స్క్రిప్ట్ వల్ల కావచ్చు.. మరోసారి కాస్టింగ్ కుదరక కూడా మిస్‌ఫైర్ అవ్వొచ్చు.. ఒక సినిమా ఆడలేదంటే దానికి చాలా కారణా లుంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఇటీవల ‘ఎఫ్ 2’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుని, మరిన్ని సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్న ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► 2017 ఎంత సక్సెస్‌ఫుల్‌గా గడిచిందో, 2019 కూడా అదే స్థాయి సక్సెస్ ఇస్తుందనిపించింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే ‘ఎఫ్ 2’తో ఇంత పెద్ద సక్సెస్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో 2021లో ‘ఎఫ్ 3’ సినిమా ప్లాన్ చేస్తున్నాం. దాదాపు సేమ్ టీమ్ ఉంటుంది. అయితే ఈసారి ముగ్గురు హీరోలు ఉంటారు. ► 2017లో 6 సినిమాలు చేయాలని నేనేమీ అనుకోలేదు, అలా జరిగిపోయింది. అలాగని 2019లో కూడా 6 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్సయితే బోల్తా పడే చాన్స్ ఉంది. కాబట్టి దాని గురించి అంత కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి 4, 5 స్టోరీస్ అయితే చాన్సెస్ ఉన్నాయి. ► తమిళ ‘96’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. నా కెరీర్లో తొలి రీమేక్ ఇది. ఈ సినిమా గురించి మీడియాలో చాలా ఫేక్ న్యూస్‌లు బయటికి వచ్చాయి. తమిళంలో ఈ సినిమాని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్‌కి కూడా దర్శకత్వం వహిస్తారు. హీరోగా శర్వానంద్ కరెక్ట్ అనీ, హీరోయిన్గా సమంత అయితే బాగుంటుందని, వాళ్లే కావాలని ప్రేమ్ అన్నారు. ► ‘96’ చక్కటి ఫీల్ ఉన్న సినిమా. రెండు పాత్రల మధ్య ఒక జెన్యూన్ ఫీల్‌ని దర్శకుడు ట్రావెల్ చేయించిన విధానం నాకు అద్భుతమనిపించింది. ఈ సినిమాను తెలుగులో కూడా నువ్వే చేయాలని డైరెక్టర్‌తో చెప్పాను. ‘96’ తమిళంలో క్లాసిక్ సినిమా అనిపించుకుంది. తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కచ్చితంగా హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ► మహేశ్‌బాబుతో చేస్తున్న ‘మహర్షి’ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తాం. అమెరికా షెడ్యూల్ అప్పుడు వీసా ఆలస్యం కావడంతో సినిమా విడుదలను 5 నుంచి 25కు మార్చడం జరిగింది. నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలనే చర్చలు జరుగుతున్నాయి. అలాగే ‘పలుకే బంగారమాయెనా’ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రం విడుదలను 2020 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాం. ఇవి కాకుండా గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సినిమా ఉంది. కానీ ముందు అనుకున్న కథతో ఈ సినిమా చేయడం లేదు. -
లాల్–నీల్ పోరు
సాక్షి, హైదరాబాద్ : ఎర్ర జెండా, సామాజిక జెండా కలవాల్సిన అవసరం ఉందని, జై భీమ్–లాల్ సలామ్ కలిసినప్పుడే దేశంలో మార్పు వస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లాల్–నీల్ జెండా నీడన ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని అందిస్తామని ప్రకటించారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఐదురోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏచూరి మాట్లాడారు. దేశంలో రోజురోజుకు ఆర్థిక దోపిడీ పెరిగిపోతోందని, ఏదో చేసేస్తానని డాబు కొట్టి ప్రధాని అయిన నరేంద్రమోదీ దేశ ప్రజల జీవితాలను భారం చేశారని విమర్శించారు. దేశంలో ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి ధరకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇప్పిస్తానన్న మోదీ.. ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. రైతు రుణమాఫీ కూడా అమలు చేయలేదన్నారు. ‘‘ఈ దేశంలో రుణమాఫీ జరిగింది. కానీ రైతులకు కాదు. బడా పెట్టుబడిదారులకు మాత్రమే. గత మూడేళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది. బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును రుణంగా తీసుకుని లూటీ చేస్తున్న దుస్థితి దేశంలో నెలకొంది. లలిత్‌మోదీ, నీరవ్‌మోదీ, నరేంద్రమోదీ.. ఇలా అందరు మోదీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు. బ్యాంకుల లూటీ జరిగేంతవరకు దేశంలో ఇంతమంది మోదీలున్నారన్న సంగతి ప్రజలకు తెలియదు’’ అని ఏచూరి వ్యాఖ్యానించారు. దేశంలో ఆకలి చావులు పెరిగిపోతున్నాయని, నవ భారత నిర్మాతలైన యువకులకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి తీరుతామని ప్రజలకు వాగ్దానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కౌరవ సేనను ఓడిస్తాం దేశంలో మతతత్వ రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మతంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ అన్నదమ్ముల్లా ఉన్న హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను సృష్టించే కుట్రకు పాల్పడుతున్నారు. మతం పేరుతో అత్యాచారాలు చేసి బాధితుల పక్షాన నిలవకుండా దౌర్జన్యకారులకు వత్తాసు పలుకుతున్న దుస్థితి ఎన్నడూ లేదు. రామాయణం కథ చెప్పి రాముడి పేరుతో ఓట్లు దండుకుంటున్న బీజేపీ మహాభారతాన్ని విస్మరించింది. మహాభారతంలో కౌరవుల్లాంటి వారు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు. ఆ 100 మంది కౌరవుల్లో మోదీ, అమిత్‌షాలు దుర్యోధన, దుశ్శాసన లాంటివారు. ఆ కౌరవులకు భీష్ముడిలా, ద్రోణాచార్యుడిలా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తోంది. ఈ కౌరవసేనను ఓడించే పాండవులుగా మేం పనిచేస్తాం. మతోన్మాద శక్తులను మట్టికరిపించి దేశంలో సామరస్యాన్ని కాపాడతాం’’ అని చెప్పారు. వారిది కౌరవ సైన్యమయితే తమది ప్రజాసైన్యమని అన్నారు. కేసీఆర్ ఫ్రంట్‌తో లాభమేంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్న ఫెడరల్ ఫ్రంట్‌పై ఏచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్‌లో చేరాలని కేసీఆర్ తనతో మాట్లాడారని, అయితే ఫ్రంట్‌లో చేరి ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘‘వ్యక్తులు, పార్టీలను చూసి ఫ్రంట్‌లో చేరేందుకు సీపీఎం సిద్ధంగా ఉండదు. ఫ్రంట్ విధానాల ఆధారంగానే మేం నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. ఎన్నికల సమయంలోనే ఎత్తుగడలపై ఆలోచిస్తామన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి మగ్ధూం మొయినుద్దీన్ చెప్పినట్టు భాగ్యాన్ని తీసుకుని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, అందరినీ కలుపుకుని విజయం సాధిస్తామన్నారు. తెలంగాణలో ప్రజా ఉద్యమాలను బలపర్చడం ద్వారా భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పూర్వ వైభవం తథ్యం సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణలో ఎర్రజెండాకు పూర్వ వైభవం రావడం తథ్యమని ఏచూరి« ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు హాజరైన లక్షలాది మంది ప్రజలను చూస్తుంటే తనకు ఆ నమ్మకం కలుగుతోందని, ఈ ఊపు కొనసాగించాలని, ఈ గడ్డపై ఎర్రజెండా ఎగురవేయాలని పేర్కొన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో ప్రకాశ్ కారత్, బృందా కారత్, రామచంద్రన్ పిళ్లై, బిమన్‌బోస్, కేరళ సీఎం పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, మల్లు స్వరాజ్యం, పి.మధు, ఎస్.వీరయ్య, జి.నాగయ్య, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి, నంధ్యాల నర్సింహారెడ్డి, జి.రాములు, పాటూరి రామయ్య, పోతినేని సుదర్శన్, జ్యోతి, డి.జి.నర్సింగరావు, బి.వెంకట్, నున్నా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం
తాళ్లూరు: దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలంలో శని, ఆదివారాల్లో జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి బాదం మాధవరెడ్డి పేర్కొన్నారు. తాళ్లూరులో ఆదివారం మాజీ ఎంపీపీ ఇడమకంటి గురువారెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాళ్లూరులో బహిరంగ సభతో సహా ప్రజా సంకల్ప యాత్ర విజయవంతానికి కృషి చేసిన దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు బాదం కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లూరు వెల్లంపల్లి బస్టాండ్‌లో జరిగిన బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు హాజరై అభిమానాన్ని చాటడం ఎప్పటికీ మరువలేనన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ఏర్పాట్లను వారం నుంచి పర్యవేక్షించిన కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తాళ్లూరు, కుంకుపాడు రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉన్న సమయంలో పాదయాత్ర కోసం చక్కగా రోడ్డు వేసిన వైస్ ఎంపీపీ రమావెంకటేశ్వరరెడ్డికి అభినందనలు తెలిపారు. సంకల్ప యాత్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఎండను సైతం లెక్కచేయకుండా బహిరంగ సభను విజయవంతం చేసిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు... 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనను వైఎస్సార్ సీపీ దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసి బహిరంగ సభలో ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణ పడి ఉంటానని బాదం మాధవరెడ్డి పేర్కొన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ప్రజల మద్దతుతో ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ తాళ్లూరు, దర్శి, దొనకొండ మండలాల అధ్యక్షులు ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల క్రిష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, ముండ్లమూరు మాజీ అధ్యక్షుడు సుంకర బ్రహ్మానందరెడ్డి, వైస్ ఎంపీపీ ఐ.రమావెంకటేశ్వరరెడ్డి, కోఆప్షన్ మెంబర్ వలి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్జీ వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, ఉప సర్పంచి బెల్లంకొండ శ్రీనివాసరావు, వల్లభనేని వీరయ్య చౌదరి, నారిపెద్ది రామ్మూర్తి, మాజీ సర్పంచి చింతా శ్రీనివాసరెడ్డి, మేడగం శ్రీనివాసరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు రామకోటిరెడ్డి, అంజిరెడ్డి, బీసీ ప్రధాన కార్యదర్శి బొల్లా వెంకటనర్సయ్య, తిరుపతయ్య, చెన్నారెడ్డి, బాదం రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాదంకు పలువురి అభినందనలు... 2019 సాధారణ ఎన్నికలలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బాదం మాధవరెడ్డిని ఆ పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సందర్భంగా అధిక సంఖ్యలో నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. మాధవరం ఉప సర్పంచి బెల్లంకొండ శ్రీనివాసరావు, కార్యకర్తలు ఎదురు చంద్రశేఖర్‌రెడ్డి, ఎదురు శ్రీనివాసరెడ్డి, యార్తల యలమందారెడ్డి, తూము వెంకటేశ్వరరెడ్డి, మున్నేల్లి రఘనాథరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ మహ్మద్ జానిలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. రజానగరం వైఎస్సార్ సీపీ సేవాదళం ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను బాదంకు వివరించారు. సేవా దళం సభ్యులు శాలువా కప్పి బాదంను సన్మానించారు. -
ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ ఖాయం
చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ గాదరాడ (కోరుకొండ) : మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ ఆవుతుందని ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. గ్రామంలోని ఆయన చెల్లి, బావ కుంచే శ్రీదేవి శ్రీనివాస్ ఇంటికి సోమవారం ఆయన వచ్చారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ చిత్రం అడ్వా¯Œ్స టికెట్లు బుక్కింగ్తోనే అన్ని రికార్డులు బద్ధలైనట్టు చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిరంజీవితో తీసిన ఠాగూర్ చిత్రం హిట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్, రష్యా దేశాల్లో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తీశామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని, చిరంజీవి అభిమానులు కోరుకున్నట్టుగా ఉంటుందన్నారు. చిరంజీవి తనకు పెద్ద అన్నగా ఉన్నారని, మెగా కుటుంబం మా కుటుంబానికి అభిమానమన్నారు. ఇప్పటికి 15 సినిమాలకు దర్శకత్వం వహించానని తెలిపారు. గాదరాడలో సందడి వినాయక్ రావడంతో గ్రామంలో సందడి నెలకుంది. ఆమె చెల్లెలు ఇంట వినాయక్ భోజనం చేశారు. ఇంతలో మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు, పలువురు నాయకులు గ్రామానికి వచ్చి ఆయనను కలిశారు. వీరిలో టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు, కాపు నేతలు, చిరంజీవి అభిమానులు, మహిళలు ఉన్నారు. వినాయక్‌తో ఫొటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. -
ఘనంగా నవతరంగ్ సెమినార్ ఆవిష్కరణ
-
హోరెత్తిన హోదా పోరు
* జిల్లాలో బంద్ విజయవంతం * వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో నిర్వహణ * మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు * అన్ని వర్గాల ప్రజల సంఘీభావం * నిర్మానుష్యంగా మారిన రోడ్లు, వాణిజ్య సముదాయాలు * బంద్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర * జిల్లాలో 867 మంది అరెస్ట్ సాక్షి, గుంటూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. జిల్లాలోని గుంటూరు నగరంతో పాటు అనేక నియోజకవర్గాల్లో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి చేరి బంద్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనలు నిర్వహించడంతో బస్సులు రోడ్లపైకి రాలేదు. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత... జిల్లా అంతటా విద్య, వాణిజ్య, వ్యాపార సముదాయాలన్నిటినీ బంద్‌కు మద్దతుగా స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లాలో జరిగిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి సంఘీభావం లభించింది. శనివారం మధ్యాహ్నం వరకు గుంటూరు నగరంతో పాటు, పలు పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వైఎస్సార్సీపీతో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జిల్లాలో పలుచోట్ల బంద్ నిర్వహించారు. శనివారం నిర్వహించిన బంద్ శాంతియుతంగా జరిగింది. నియోజకవర్గాల వారీగా బంద్ ఇలా... చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయం నుంచి చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి బంద్ చేపట్టారు. గుంటూరు నగరంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లే ళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున నాయకులు, కార్యకర్తలు భారీగా ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శులు నసీర్ అహ్మద్, లాలుపురం రాము, సహాయ కార్యదర్శి షేక్ గులాం రసూల్, కిలారి రోశయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డైమండ్‌బాబు, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపల్లె నియోజకవర్గంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రేపల్లె బస్టాండ్ వద్ద బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వేమూరు నియోజకవర్గంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో వేమూరు, కొల్లూరు, చుండూరు మండలాల్లో బంద్ నిర్వహించారు. చుండూరు మండలం వలివేరు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆర్టీసీ గ్యారేజీ వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీగా తిరుగుతూ బంద్ నిర్వహించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ, శావల్యాపురం, ఈపూరు మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో బంద్ జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో బంద్ నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గంలో సమన్వయకర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాల్లో బంద్ నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు, మేడికొండూరు మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టినా, సురేష్‌కుమార్‌ల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో బంద్‌ను విజయవంతం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు యేళ్ల జయలక్ష్మి, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో బంద్ నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మండల కన్వీనర్లు ఆధ్వర్యంలో బంద్‌ను విజయవంతం చేశారు. -
'సాక్షి' మాక్ ఎంసెట్ కు అనూహ్య స్పందన
-
'సాక్షి' మాక్ ఎంసెట్‌కు అనూహ్య స్పందన
హైదరాబాద్: 'సాక్షి' మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాక్ ఎంసెట్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు 'సాక్షి' యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి ఆధ్వర్యంలో నేడు(ఆదివారం) ఉదయం 9.30 గంటలకు మాక్ ఎంసెంట్ పరీక్ష ప్రారంభం అయింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ముగియనుంది. -
దౌత్యంలో నూతనాధ్యాయం
ప్రపంచమే కుగ్రామమై... ప్రతి దేశమూ తన ప్రత్యేకతలేమిటో చెప్పుకుని, తనతో చెలిమి చేస్తే వచ్చే ప్రయోజనాలేమిటో ఏకరువుపెట్టి అందరినీ ఆకర్షించి పైపైకి ఎదగాలని భావిస్తున్న తరుణమిది. ఇలాంటి సమయంలో ఏ దేశాధినేత అయినా పాలనలో సమర్థత చూపినంత మాత్రాన సరిపోదు. అంతకుమించి ఎదుటివారిని అవలీలగా ఒప్పించగల సేల్స్‌మాన్ లక్షణం కూడా అవసరం. ప్రధాని నరేంద్ర మోదీలో ఈ లక్షణం పుష్కలంగా ఉన్నదని ఇప్పటికే నిరూపణ అయింది. విదేశీ పర్యటనల్లో మోదీ ఆయా దేశాధినేతలనూ, అక్కడి పరిశ్రమల అధిపతులనూ కలవడంతోపాటు ‘మేకిన్ ఇండియా’ నినాదంతో ఎన్నారై మదుపుదారులను, ఇతరేతర రంగాల్లో స్థిరపడినవారిని ఉత్తేజపరుస్తున్నారు. సుస్థిర ప్రభుత్వానికి సారథ్యంవహిస్తున్న నేతగా, దేశాన్ని కొత్త పుంతలు తొక్కించగల సమర్థుడిగా పరిగణించినందువల్ల కావొచ్చు...ప్రపంచ దేశాలు మోదీని ఆకర్షించడం కంటే, ఆయనే వారిని ఆకర్షించగలుగుతున్నారు. భూటాన్ మొదలుకొని జపాన్, బ్రెజిల్, అమెరికాల్లో గతంలో రుజువైనదే ఇప్పుడు మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ పర్యటనల్లోనూ ప్రస్ఫుటమైంది. ఈసారి మయన్మార్‌లో తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలోనూ, ఆస్ట్రేలియాలో జీ-20 దేశాల సమావేశంలోనూ ఆయన పాల్గొని వివిధ దేశాల అధినేతలను కలిశారు. ఆస్ట్రేలియా, ఫిజీ పార్లమెంటులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్, ఆస్ట్రేలియాల సాన్నిహిత్యానికి గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఆ విషయంలో అనుకున్నంత పురోగతి లేదు. ప్రధానిగా రాజీవ్‌గాంధీ ఆ దేశం పర్యటించి 28 ఏళ్లయ్యాక మోదీ అక్కడికెళ్లారంటే మనవైపు నిర్లక్ష్యం ఎంత ఉన్నదో అర్థమవుతుంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి పరస్పర అనుమానాలు... అక్కడ ఉద్యోగావకాశాలకూ, ఉన్నత చదువులకూ వెళ్లిన మన యువకులపై అయిదేళ్లక్రితం జరిగిన జాతి వివక్ష దాడులూ సంబంధాల విస్తృతికి అవరోధమ య్యాయి. అంతేకాదు... ఆస్ట్రేలియాలో గతంలో ఉన్న జూలియా గిలార్డ్స్ ప్రభుత్వమైనా, మన దేశంలో అప్పట్లో ఉన్న యూపీఏ సర్కారైనా బలహీన ప్రభుత్వాలు కావడం... భారత్‌తో సాన్నిహిత్యానికి ప్రయత్నిస్తే చైనాకు అనవసర అనుమానాలు కలుగుతాయని గిలార్డ్స్ ప్రభుత్వం భావించడం కూడా సంబంధాల మెరుగుదలకు ఆటంకమయ్యాయి. వాస్తవానికి హిందూ మహా సముద్రం, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో చైనా క్రమేపీ తన ప్రభావాన్ని విస్తరించుకుంటున్న దశలో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యం మన వ్యూహాత్మక ప్రయోజనాలకు చాలా ముఖ్యం. కొత్త నాయకత్వం అధికారంలోకొచ్చాక అటు ఆస్ట్రేలియా సైతం ఈ అవసరాన్ని గుర్తించింది. కనుకే మొన్న సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ భారత పర్యటనకు రావడమే కాక, గతంలోని భయాలను దూరం పెట్టి మన దేశంతో పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక మైలురాయి. వ్యవసాయం, బొగ్గు, మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీరంగం వంటి అంశాల్లో ఆస్ట్రేలియాకు మన దేశంలో ఎన్నో అవకాశాలున్నాయి. అలాగే, సేవారంగం, భద్రతా సహకారం, వాణిజ్యం వంటి విషయాల్లో ఆస్ట్రేలియా మనకు ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం మనకున్న ద్వైపాక్షిక వాణిజ్యం విలువ మొత్తంగా 1,500 కోట్ల డాలర్లు మించి లేదు. 2015 నాటికి ఈ వాణిజ్యాన్ని 4,000 కోట్ల డాలర్లకు పెంపొందించుకోవాలని రెండేళ్లక్రితం ఉభయ దేశాలూ భావించినా ఆ దిశగా ఇంతవరకూ ముందడుగు పడలేదు. ఒకపక్క ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న ఆస్ట్రేలియా-చైనాల వాణిజ్యం ఇప్పటికే 15,000 కోట్ల డాలర్లకు చేరుకోగా ఇటీవలే ఆ రెండు దేశాలూ స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడికను సైతం కుదుర్చుకున్నాయి. ఇలాంటి దశలో మనలో ఎంత చురుకుదనం ఉండాలో అర్థమవుతుంది. మన సంబంధాలు గత కొన్నేళ్లుగా అంతంతమాత్రంగానే ఉన్న ఫిజీ గడ్డపై కూడా మోదీ అడుగుపెట్టారు. 1981లో ఇందిరాగాంధీ పర్యటించిన తర్వాత మన ప్రధాని ఒకరు అక్కడికి వెళ్లడం ఇదే మొదటిసారి. దేశ జనాభాలో భారత సంతతి ప్రజలు దాదాపు 38 శాతంగా ఉండేవారు. తరచుగా జరిగే సైనిక తిరుగుబాట్లు, అస్థిరత కారణంగా వేరే ప్రాంతాలకు వలసపోవడంతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. 338 చిన్న చిన్న దీవుల సముదాయమే కావొచ్చుగానీ పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఫిజీ పాత్ర కీలకమైనది. ఆ దేశంతో రక్షణ, భద్రతా రంగాల్లో సహకార ఒడంబడికతోపాటు వివిధ ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులను, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే మూడు ఒప్పందాలు ఖరారయ్యాయి. మోదీ ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటన సందర్భంగా మయ న్మార్‌లో జరిగిన తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశం, ఆస్ట్రేలియాలో జరిగిన జీ-20 దేశాల సమావేశాల్లో మన స్వరం గట్టిగానే వినబడింది. ముఖ్యంగా జీ-20 దేశాల సదస్సులో ఆర్థిక వ్యవస్థలకూ, భద్రతకూ ముప్పుగా పరిణమించిన నల్ల ధనాన్ని అరికట్టడానికి పరస్పర సహకారం అవసరమన్న మోదీ సూచనకు వివిధ దేశాలనుంచి మద్దతు లభించింది. మొత్తానికి తన పదిరోజుల పర్యటనలో మోదీ దౌత్యంలో కొత్త అధ్యాయాన్ని రచించారు. భారత్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్నేహసంబంధాలను నెలకొల్పుకోవడంలోనూ, విస్తరించుకోవడం లోనూ చాలా ఆసక్తితో ఉన్నదని చాటి చెప్పారు. అలాగే తనది చురుగ్గా... సృజనాత్మకంగా పనిచేసే ప్రభుత్వమన్న భరోసాను ప్రవాస భారతీయుల్లో కల్పించారు. ఇందుకు కొనసాగింపుగా క్షేత్రస్థాయిలో కూడా గుణాత్మకమైన మార్పులు కనిపిస్తే మోదీ కలగంటున్నట్టు భారత్‌కు పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయి. -
ఎలైట్ పుట్‌బాల్ గ్రాండ్ సక్సెస్
-
జనప్రభంజనం 'సమైక్య శంఖారావం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించిన 'సమైక్య శంఖారావం' భారీ బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూల నుంచి లక్షల మంది జనం తరలి వచ్చినప్పటికీ సభ ప్రశాంతంగా ముగిసింది. ఒక్క ఎల్బి స్టేడియమే కాదు హైదరాబాద్ అంతా సమైక్యవాదులతో నిండిపోయింది. ట్రాఫిక్ జామ్ వల్ల వందల వాహనాలు నగర శివార్లలోనే ఆగిపోయాయి. భారీ వర్షాలను కూడా లెక్కచేయకుండా 23 జిల్లాల నుంచి జనం రైలు, రోడ్డు మార్గాలలో సభకు వచ్చారు. యువకులు, వృద్ధులు, మహిళలు అన్ని వయసుల వారు, రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు..... అన్నివర్గాల ప్రజలు ఎవరికి అందిన వాహనంలో వారు హైదరాబాద్ చేరుకున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనం కదలి వచ్చారు. వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలతోపాటు పార్టీలకు అతీతంగా సమైక్యవాదులు కదలి వచ్చారు. తెలంగాణ జిల్లాల నుంచి కూడా జనం రావడం విశేషం. మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలుగా తరలివస్తున్నారు. నేల ఈనిందా అన్నట్లు నగరం సమైక్యవాదులతో కిక్కిరిసిపోయింది. అందరిది ఒకటే లక్ష్యం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే వారి కోరిక. అందు కోసం పోరాడే ఒకే ఒక్క నాయకుడుగా వైఎస్ జగన్ వారికి కనిపించారు. దిక్కలు పిక్కటిల్లేల్లాగా, ఢిల్లీ వరకు వినిపించేలా జనం సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రాష్ట్ర రాజధాని సమైక్యవాదుల నినాదాలతో హోరెత్తింది. తుపాను ప్రభావం వల్ల నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది. పంటలు నీట మునిగాయి. మార్కెట్లకు చేరిన పంటలు కూడా తడిసి మద్దయిపోయాయి. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు నీటి ప్రవాహంలో చిక్కకున్నాయి. జనం వరదల తాకిడికి విలవిలలాడుతూ, ప్రకృతి బీభత్సాన్ని కూడా లెక్కచేయకుండా 'సమైక్య శంఖారావం' సభకు వచ్చారు. అంటే వారిలో సమైక్యవాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాజధానిలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ర్యాలీలుగా తరలివచ్చారు. నగరం ట్రాఫిక్ పద్యవ్యూహంలో చిక్కుకుపోయింది. ట్రాఫిక్‌లో చిక్కుకొని లక్షల మంది ప్రజలు సభా వేదికవరకు రాలేకపోయారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో సమైక్య శంఖారావం సభ జరగదని చాలా మంది అనుకున్నారు. అయితే వారి ఊహలు ఏమీ ఫలించలేదు. రెండు రోజుల నుంచి నగరాన్ని తడిపి ముద్ద చేస్తున్న వరుణుడు కూడా కరుణించాడు. సమైక్యాంధ్రకు మద్దతు పలికాడు. సభ జరిగినంతసేపు వాన వెలిసింది. శుక్రవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి వర్షం ఆగిపోయి, వాతావరణంలో ఒక్కసారిగా మార్పురావడంతో సమైక్యవాదులు అత్యంత ఉత్సాహంతో తరలివచ్చారు. సభ దిగ్విజయంగా జరిగింది. జగన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర విభన వల్ల తలెత్తే సమస్యలను జగన్ వివరించారు. ఎన్నో కొత్త అంశాలను కూడా ప్రస్తావించారు. ఇది తమ సమస్య కాదులే అని దేశంలోని ఇతర రాష్ట్రాల నేతలు ఏమీ మాట్లాడకపోతే రేపు తమ దాకా వచ్చినప్పుడు మద్దతు పలికేవారు ఉండరని హెచ్చరించారు. సభ విజయవంతం కావడంతో సమైక్యవాదులు కొత్త ఉత్సాహంతో వెనుదిరిగి వెళ్లారు.