తెనాలిఅర్బన్/రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడుతున్న ఒకే ఒక్కడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయలేని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తెనాలిలో నిర్వహించిన సమైక్యశంఖారావం బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సభకు ఉమ్మారెడ్డి అధ్యక్షత వహించారు. అంబటి మాట్లాడుతూ సీమాంధ్రలో టీడీపీ నేతలు సమైక్యం కోరుతుంటే, తెలంగాణాలో ఆ పార్టీ నేతలు విభజన కోరుతున్నారని, చంద్రబాబు మాత్రం తన వైఖరిని స్పష్టం చేయటం లేదన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆ పార్టీ నేతలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, దేవినేని ఉమ తదితరులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పదే పదే ప్రకటనలు చేస్తుంటే, అదే పార్టీకి చెందిన యర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు వంటి నాయకులు ప్రత్యేక తెలంగాణకు జై అనడం టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞతకే తెలియాలన్నారు.
పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో దేశంలో అన్ని పార్టీల మద్దతును జగన్‌మోహన్‌రెడ్డి కూడగడుతున్నారన్నారు. సభాధ్యక్షుడు ఉమ్మారెడ్డి మాట్లాడుతూ అప్రజాస్వామికంగా జరుగుతున్న విభజనను అడ్డుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం పూరించారన్నారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనతోనే అమరజీవి ఆత్మకు శాంతి కలుగుతుందని, ఇందు కోసం పాటు పడుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు.
కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలేసిన చంద్రబాబునాయుడు, వైఎస్సార్ కుటుంబంపై విషం కక్కుతున్నారన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసే నాయకులు లేరన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త జలీల్‌ఖాన్ మాట్లాడుతూ ముస్లింలంతా జగన్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
పట్టణ కన్వీనర్ ఈఎస్‌ఆర్‌కే ప్రసాద్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, వైఎస్సార్ టీయూజీ కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ జానీబాషా, బీసీసెల్ కన్వీనర్ దేవళ్ళ రేవతి, జిల్లా మహిళ కన్వీనర్ దాది వెంకటలక్ష్మీరాజ్యం, జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్లు బండారు సాయిబాబు, హనుమంత్‌నాయక్, మైనారిటీ కన్వీనర్ మహబూబ్, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు ఉత్తమకుమార్‌రెడ్డి, రాష్ట్ర బీసీసెల్ సభ్యుడు అంగిరేకుల ఆదిశేషు, జిల్లా రైతు విభాగం కన్వీనర్ మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్, సమన్వయకర్తలు గుదిబండి చినవెంకటరెడ్డి, డాక్టర్ మేరుగ నాగార్జున, రావి వెంకటరమణ, సురేష్‌కుమార్, షేక్ షౌకత్, నసీర్ అహ్మద్, నన్నపనేని సుధ, కొల్లిపర, తెనాలి మండల కన్వీనర్లు సుంకర శ్రీనివాసరావు, జంగా శివనాగిరెడ్డి, ఎస్సీసెల్ కన్వీనర్లు కె.రాజమోహనరావు, ఎన్.ప్రభాకర్, మహిళా విభాగం కన్వీనర్లు కె.వరదానమ్మ, సీహెచ్ ఝాన్సీ, పట్టణ యువజన విభాగం కన్వీనర్ మేడిశెట్టి కృష్ణ, బీసీె సల్ కన్వీనర్ డి.వెంకట నరసయ్య, అమృతలూరు మండల కన్వీనర్ రాపర్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
విభజనపై ‘దేశం’ ద్వంద్వ వైఖరి
Published Tue, Dec 31 2013 1:03 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement