వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించింది జగన్ ఒక్కరేనని గుర్తుచేశారు. సోనియాతో చంద్రబాబు చేతులు కలిపి విభజన అనుకూలంగా లేఖ ఇచ్చారని ఆరోపించారు. ఎల్బీ స్టేడియంతో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో ఆమె మాట్లాడుతూ ప్రజలంతా జగన్తో ఉన్నారని తెలిపారు. జగన్ ఆలోచనల నిండా ప్రజలే ఉన్నారన్నారు. తెలుగువాళ్ల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని ఆమె అన్నారు. విభజనను అడ్డుకునేందుకు తమ పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. జగన్ నాయకత్వంలో సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని శోభా నాగిరెడ్డి ప్రకటించారు.
Published Sat, Oct 26 2013 2:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement