'కుప్పంలో జగన్కు బ్రహ్మరధం పట్టేందుకు జనం సిద్ధం' | Kuppam people prepare to grand welcome for YS Jagan, says bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

'కుప్పంలో జగన్కు బ్రహ్మరధం పట్టేందుకు జనం సిద్ధం'

Published Wed, Nov 27 2013 11:55 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

'కుప్పంలో జగన్కు బ్రహ్మరధం పట్టేందుకు జనం సిద్ధం' - Sakshi

'కుప్పంలో జగన్కు బ్రహ్మరధం పట్టేందుకు జనం సిద్ధం'

తిరుపతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు సమైక్యాంధ్ర ద్రోహి అయినందునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి సమైక్య శంఖారావాన్ని పూరిస్తున్నారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్కు బ్రహ్మరథం పట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు.

జగన్ పర్యటనను అడ్డుకోండి అని చంద్రబాబు పిలుపునివ్వడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని భూమన వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రం కోసం  జగన్ ఒకవైపు దేశంలోని వివిధ పార్టీల మద్దాతు కూడగడుతూనే మరోవైపు ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నారన్నారు. సమైక్య శంఖారావం దిగ్విజయం అవుతుందని భూమన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement