చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర నేడు రద్దు అయ్యింది. ఆదివారం నుంచి యాత్ర యథాతథంగా జరుగుతుందని ఆపార్టీ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
అనంతపురం జిల్లా కొత్తవలస వద్ద ఈరోజు తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్ప్రెస్లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలానికి ఆయన బయల్దేరి వెళ్లారు. బాధితులను జగన్ పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో సమైక్య శంఖారావం యాత్ర వాయిదా పడింది.