అనంతపురం: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అనంత కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. అదే విధంగా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మంత్రులు పల్లి రఘనాధరెడ్డి, పరిటాల సునీతలను ఆదేశించారు. వారితో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
కాగా పెనుకొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాల మీద ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది. లారీ క్లీనర్ సహా ఐదుగురు మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.
రైలు ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
Published Mon, Aug 24 2015 9:03 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement