nanded express
-
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ..
మధిర(ఖమ్మం జిల్లా): మధిర మండలం దెందుకూరు వద్ద సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. రైలు చైన్‌లాగి దివ్య అనే యువతి మెడలోని 2 తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క క్షణంలోనే...
సోమవారం వేకువజాము 2.30 గంటలకు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు మంచి నిద్రలో ఉన్నారు. అదే సమయంలో భయకరమైన శబ్ధంతో 25 టన్నుల బరువైన గ్రానైట్ రాయి ఏసీ ఫస్ట్‌క్లాస్ బోగీలోకి వచ్చిపడింది ఏం జరిగిందో గుర్తించే లోపు ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఘటనలో దేవదుర్గ ఎమ్మెల్యే, గిరిజన నేత అరికేర వెంకటేష్ నాయక్ దుర్మరణం చెందారు. ఆ దెబ్బకు రైల్వేట్రాక్లోని స్లీపర్లు పగిలిపోయాయి. కుదుపులకు మూడుబోగీలు పట్టాలు తప్పాయి. రైలుమొత్తం 500 మీటర్ల మేర అదుర్లతో ప్రయాణించింది. చిమ్మచీకట్లో బాంబు పేలిన శబ్దం... కుదుపుల ప్రయాణంతో అసలు రైలులో ఏం జరిగిందో? ప్రయాణీకులకు అర్థం కాలేదు. పట్టాలు తప్పిన బోగీలు కిందకు పడిపోకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. - బెంగళూరు -
హత విధీ...
అనంతపురం జిల్లాలో రైలు ప్రమాదం నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గ్రానైట్ లారీ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ సహా ఐదుగురి దుర్మరణం పలువురికి గాయాలు బెంగళూరు- నాందేడ్ ఎక్స్‌ప్రెస్... సోమవారం... తెల్లవారుజామున 2.27 గంటలు... ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు. రైలు 40 మైళ్ల వేగంతో ముందుకు వెళుతోంది. ఒక్కసారిగా భయకరమైన శబ్ధం.. వెనువెంటనే 25 టన్నుల బరువైన రాయి బోగిలోకి దూసుకువచ్చింది.ఐదుగురి ప్రాణాలను బలిగొంది. బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద రైల్వే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో రాయచూరు జిల్లా దేవదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెరె వెంకటేష్‌నాయక్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వివరాలు... నాందేడ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్(16594) రైలు ఆదివారం రాత్రి 10:30 గంటలకు బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. సోమవారం వేకువజామున 2:30 గంటలకు రైలు 132-200/300 కిలోమీటరు వద్ద(పెనుగొండ రైల్వేస్టేషన్ సమీపంలో) లెవెల్ క్రాసింగ్ దాటుతుండగా గ్రానైట్ రాళ్లతో కూడిన టారస్ లారీ వేగంగా వచ్చి రైల్వే గేట్‌ను ఢీకొని రైలును బలంగా తాకింది. దీంతో లారీలోని గ్రానైట్ రాళ్లు ఎగిరి మొదటి తరగతి ఏసీ కోచ్ (హెచ్-1)పై పడ్డాయి. ఫలితంగా కోచ్ నుజ్జునుజ్జైంది. ఈ బండరాళ్ల కింద పడి హెచ్-1 కోచ్‌లోని కూపే ఈ, డీలలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే అరికెర వెంకటేష్ నాయక్ (79), టీఎస్డీ రాజు (53), కాబిన్ ఎఫ్‌లో ఉన్న ఈదర పుల్లారావు(48)లతో పాటు ఏసీ కోచ్ మెకానిక్‌గా విధుల్లో ఉన్న సయ్యద్ అహ్మద్ (52), టారస్ లారీ క్లీనర్ నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీలోని బండరాళ్లు ఎగిరిపడటంతో హెచ్1తోపాటు బీ-1, ఎస్-1, ఎస్-2 కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయి. దీంతో ఈ కోచ్‌ల్లో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు 20 మంది గాయపడ్డారు. వీరికి రైల్వే శాఖలోని వైద్య విభాగం అధికారులు అక్కడికక్కడే చికిత్స అందించారు. మరోవైపు గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్న జగదీష్, శాంతి, సురేష్లను బెంగళూరులోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గేటు వేసే ఉంది... ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే గేటు (నం:77) వేసే ఉందని బెంగళూరు రైల్వే డివిజన్ ఓ మీడియా ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా రెడ్‌లైట్ వెలుగుతూ ఉండటమే కాకుండా సైరన్ కూడా మోగుతోందని అందులో తెలిపింది. లారీ వేగానికి రైల్వే గేటు కూడా విరిగిపోయిందని రైల్వేశాఖ పేర్కొంది. 20 ప్రత్యేక బస్సులు.... ప్రమాదం తెలిసిన వెంటనే బెంగళూరు డివిజినల్ రైల్వే మేనేజర్ సంజయ్ అగర్వాల్ నేతృత్వంలోని అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వీరితో పాటు బెంగళూరు, గుంతకల్ నుంచి మెడికల్ రిలీఫ్ వ్యాన్లు, యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లులో వైద్య, పారా మెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం అందించారు. మరోవైపు ప్రమాదానికి గురైన రైలులోని మిగిలిన ప్రయాణికులను వారి స్వస్థలాలకు చేర్చడానికి రైల్వే శాఖ 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ప్రయాణికుల బంధువులు, స్నేహితులకు సమాచారం అందించడానికి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో రైల్వేశాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. సంతాపం వ్యక్తం చేసిన సిద్ధు రైలు ప్రమాదంలో దేవదుర్గ శాసనసభ్యుడు అరికెర వెంకటేష్‌నాయక్ చనిపోవడం పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతి సౌమ్య మనస్కుడిగా గుర్తింపు పొందిన వెంకటేష్ నాయక్ మరణం పార్టీకు తీరనిలోటని పేర్కొన్నారు. మహదాయి నదీ నీటి పంపకం విషయమై జరిగిన అఖిల పక్షం సమావేశానికి హాజరైన వెంకటేష్ నాయక్ అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తనను కలిచివేస్తోందని సోమవారం సాయంత్రం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాజీ సీఎం ధరంసింగ్ కూడా వెంకటేష్ నాయక్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రెండు రైళ్ల సర్వీసులు రద్దు దుర్ఘటన వల్ల హిందూపూర్-గుంతకల్ ప్యాసింజర్ (57438), బెంగళూరు కంటోన్మెంట్-విజయవాడ ప్యాసింజర్ (56503) రైల్వే సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిం చారు. హెల్ప్‌లైన్‌నం:080-23339162, 22354108,22156554, 08023339163,09701374062,09493548005,9731666751,09448090399 -
రైలు ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
అనంతపురం: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అనంత కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. అదే విధంగా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మంత్రులు పల్లి రఘనాధరెడ్డి, పరిటాల సునీతలను ఆదేశించారు. వారితో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాగా పెనుకొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాల మీద ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది. లారీ క్లీనర్ సహా ఐదుగురు మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. -
రైలుప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం
-
పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురంలో రాజధాని ఎక్స్‌ప్రెస్, గార్లదిన్నెలో సోలాపూర్ ఎక్స్‌ప్రెస్ సహా బీదర్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్, యశ్వంతపూర్ రైళ్లు నిలిచిపోయాయి. కల్లూరు తాడిచర్ల వద్ద మరో రెండు రైళ్లు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌తో పాటు నిలిచిపోయిన ఇతర రైళ్లలోని ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కాగా రైలు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, 30మందికి పైగా గాయపడ్డారు. -
రైలుప్రమాదంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం
అనంతపురం: అనంతపురం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ఎస్1 బోగీని గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో వెంకటేష్ నాయక్ మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని పెనుగొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలుపట్టాలు తప్పాయి. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాలు మీదుకు దూసుకెళ్లి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది. లారీ క్లీనర్ సహా ఐదుగురు మృతిచెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 30మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రిస్కూం సిబ్బంది, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం పెనుకొండ, బెంగళూరు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గ్రానైట్ లారీ నంబరు AP 16 TT 9885, 2003 లో రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారులు వెల్లడించారు. -
ఏడ్చి... ఏడ్చి... కన్నీరు ఇంకి..
బెంగళూరు : అనంతపురము జిల్లా కొత్త చెరువు వద్ద బెంగళూరు-నాందేడ్ రైలు బోగీలో సజీవ దహనమైన వారిని బంధువులకు అప్పగించే ప్రక్రియ ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో కొనసాగుతోంది. సోమవారం మరో మూడు మృత దేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు. వారిలో ఎస్ఆర్. కృష్ణమూర్తి (70-మైసూరు), అనిరుధ్ కులకర్ణి (24-నాందేడ్), ప్రతాప్ వినయ్ (43-పాట్నా) ఉన్నారు. దీంతో మొత్తం 14 మృత దేహాలను బంధువులకు అప్పగించినట్లయింది. మరో 11 మృతదేహాలను గుర్తించినప్పటికీ, డీఎన్ఏ పరీక్షా ఫలితాల కోసం బంధువులు ఎదురు చూస్తున్నారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. అనుకున్నంతా అయింది... తాము భయపడిన విధంగానే జరిగిందని మైసూరుకు చెందిన కృష్ణమూర్తి బంధువులు బోరుమన్నారు. సంగీత విమర్శకుడైన ఆయన రాయచూరులోని ఓ సంగీత పాఠశాల వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి రైలులో వెళ్లారు. ఆయనకు భార్య అమృతమూర్తి (60), తల్లి అన్నపూర్ణమ్మ (90) ఉన్నారు. శుక్రవారం అల్లుడు చంద్రశేఖర్ ఆయన వెంట నగరంలోని జయనగరకు వచ్చారు. అక్కడి నుంచి కృష్ణమూర్తి ఒక్కరే ఆటోలో యశ్వంతపుర రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. పదిన్నర గంటలకు ఆయనే తనకు ఫోన్ చేసి రెలైక్కానని, ఇంకా బయల్దేరలేదని చెప్పారని చంద్రశేఖర్ తెలిపారు. మరుసటి రోజు టీవీలలో రైలులో అగ్ని ప్రమాదం జరిగిన వార్తలను చూసిన తర్వాత ఆయనకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చిందని వివరించారు. అందరూ కొత్తచెరువుకు వెళ్లామని, అక్కడి అధికారుల సలహాతో విక్టోరియా ఆస్పత్రికి తిరిగి వచ్చామని చెప్పారు. సిబ్బంది కొరత మృతుల గుర్తింపు కోసం ఇక్కడి మడివాళలోని ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగ శాలలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరత వల్ల కొంత జాప్యం జరుగుతోంది. శ్యాంపిల్స్ విశ్లేషణ ప్రక్రియ చాలా భారంతో కూడుకున్న పని. కేవలం ఇద్దరే ల్యాబ్ టెక్నీషియన్లు ఉండడంతో విక్టోరియా, బౌరింగ్, లేడీ కర్జన్ ఆస్పత్రుల నుంచి 15 మంది వైద్యులను ఇక్కడికి తరలించారు. రాత్రంతా వారు దీని కోసం శ్రమిస్తున్నారు. మృతులు, బంధువుల నుంచి రక్తం, కాలేయ కణజాలాన్ని సేకరించి పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. మంగళవారానికి డీఎన్ఏ పరీక్షలు పూర్తవుతాయని వైద్యులు తెలిపారు. వైద్యులపై ఒత్తిడి తమ వారి మృత దేహాలను త్వరగా అప్పగించాలని బంధువులు వివిధ మార్గాల ద్వారా వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ర్ట, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సిఫార్సుల్లో నిమగ్నమైనప్పటికీ వైద్యులు వారికి నచ్చజెపుతున్నారు. మృతులు ధరించిన లోదుస్తులు, పాదాల ఆధారంగా బంధువులు తమ వారి మృత దేహాలను గుర్తించినప్పటికీ, శాస్త్రీయంగా అంగీకరించలేమని వైద్యులు చెబుతున్నారు. జన్యు పోలికలను సరి చూడకుండా అప్పగిస్తే, భవిష్యత్తులో పొరబాటు జరిగిందని తేలితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వైద్యులు రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు. మృతుల బంధువులకు నష్ట పరిహారం కూడా అందించాల్సి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సలహా ఇస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు మౌనం దాల్చుతున్నారు. రైళ్ల సంఖ్యకు అనుగుణంగా పెరగని సిబ్బంది కేంద్ర ప్రభుత్వం ఏటా రైల్వే బడ్జెట్లో కొత్త రైళ్లను ప్రకటించడం ఆనవాయితీ. దీనికి అనుగుణంగా సిబ్బంది నియామకంపై శ్రద్ధ చూపడం లేదు. గత కొన్నేళ్లుగా కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. బోగీల నిర్వహణకు కూడా రైల్వే శాఖ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అనేక రైళ్లు వివిధ చోట్ల బయలుదేరి గమ్య స్థానాలను చేరడానికి బెంగళూరు స్టేషన్ మీదుగా సాగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో బోగీల బాగోగులను చూసే సమయం తక్కువగా ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఏడ్చి... ఏడ్చి... కన్నీరు ఇంకి..
-
బ్యాటరీ సమస్య వల్లే బోగీ బుగ్గి!
లోబ్యాటరీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చన్న నిపుణులు సాక్షి ప్రతినిధి, అనంతపురం/పుట్టపర్తి అర్బన్, తాండూరు, న్యూస్‌లైన్: విద్యుత్ వైరింగ్‌లో నాసిరకమైన వస్తువులు వినియోగించడం వల్ల నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం జరిగిఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లోబ్యాటరీ సమస్య తలెత్తడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిఉండవచ్చని ఏసీ కోచ్‌ల పర్యవేక్షక ఇంజనీర్ అనుమానం వ్యక్తం చేసినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. బోగీల నిర్వహణను రైల్వే శాఖ కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. బ్యాటరీలను సమకూర్చడం, ఏసీ బోగీల్లో వైరింగ్ వంటి పనులను కాంట్రాక్టర్లే చేస్తున్నారు. వారు నాసిరకం బ్యాటరీ లను సరఫరా చేస్తున్నారనడానికి తరచూ బ్యాటరీల్లో సమస్యలు తలెత్తుతుండటమే తార్కాణం. ప్రమాదం చోటుచేసుకున్న తర్వాత బీ1 బోగీని తప్పించి.. తక్కిన బోగీల్లోని ప్రయాణికులను అదే రోజున నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే అధికారులు తరలించారు. రైలు గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే.. ఏసీలు పనిచేయడం లేదని, పొగలు వస్తున్నాయని త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్ బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాటరీల్లో చార్జింగ్ అయిపోవడం వల్లే ఏసీలు పనిచేయడం లేదని, అందువల్లే విద్యుత్ షార్ట్ సర్క్యూటై ఏసీల్లో పొగలు వస్తున్నాయని గుర్తించిన ఇంజనీర్లు.. బ్యాటరీలను చార్జింగ్ చేసి రైలును పంపించారు. లోబ్యాటరీ సమస్య వల్లే ప్రమాదం జరిగిందనడానికి ఈ ఘటన బలం చేకూరుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంపై మంగళవారం నుంచి బహిరంగ విచారణ చేపడుతున్నారు. ఊపిరాడకే ఎక్కువ మంది మృతి: బోగీలో దట్టంగా కమ్ముకున్న పొగవల్ల ఊపిరాడక ఎక్కువమంది మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. బోగీని సోమవారం క్షుణ్ణంగా పరిశీ లించి, మృతుల వస్తువులు, శిథిలాలు, బూడిదను సేకరించి భద్రపరిచామని ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డెరైక్టర్ శారదా అవధానం తెలి పారు. బోగీలో పురుగుమందుల అవశేషాలు లభ్యమయ్యాయని, వాటికి మండే గుణం ఉందో లేదో పరీక్షలో తేలుతుందన్నారు. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతుల ప్రకటన లలిత - బెంగళూరు(61), పద్మిని -బెంగళూరు(61), ఈశ్వర్ నాగ్రే -ఔరంగాబాద్(70), కవితా నాగ్రే -ఔరంగాబాద్(61), శ్రీలత-అనంతపురం (26), డాక్టర్ అస్రా -రాయచూరు(32), మహమ్మద్ రఫీ -రాయచూరు(2), ఇబ్రహీం రహీ -రాయచూరు(31), బల్బీర్ కౌర్ -బెంగళూరు(52), అమన్ ప్రీత్ కౌర్ -బెంగళూరు(24), రాహుల్ -బెంగళూరు(25), శ్రీనివాస్ -అనంతపురం(28).. వీరంతా మృతి చెందారా, లేదా అనే విషయాన్ని డీఎన్ఏ పరీక్షల అనంతరం ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఏసీ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ విజయవాడ రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన ప్రమాదం విజయవాడ, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఘటన మరువకముందే సోమవారం విజయవాడ రైల్వేస్టేషన్లో నిలిచిఉన్న రైలు ఏసీ కోచ్‌లో పొగలు వచ్చాయి. విద్యార్థుల విహారయాత్రకు ఈనెల 24న ముంబైలో బయలుదేరిన రైలును సోమవారం విజయవాడలో మెయింటెనెన్స్ నిమిత్తం నిలిపివేశారు. ఆ రైలు ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా పొగ, నిప్పురవ్వలు విరజిమ్మాయి. విద్యార్థులు అదనంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయడంతో అవి షార్ట్‌సర్క్యూటై పొగలు వ్యాపించినట్లు రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది గుర్తించారు. ఆ రైలును రైల్వే యార్డులోకి తరలించి మరమ్మతులు చేపట్టారు. -
తప్పిన పెను ముప్పు నిండు నిర్లక్ష్యం
=ఏసీ బోగీలో నిబంధనలకు విరుద్ధంగా వైరింగ్ =ఎల్సీడీతో పాటు అన్ని సౌకర్యాలు =ఐఆర్టీసీ రైలులో భద్రతా లోపాలు =దక్షిణమధ్య రైల్వే జీఎం సమీక్ష సాక్షి, విజయవాడ : మరో పెను ముప్పు తప్పింది. రైల్వే అధికారులు, సిబ్బంది నిండు నిర్లక్ష్యంతో మరో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఘటన పునరావృతమయ్యే ప్రమాదం.. విజయవాడలో ముందే బయటపడింది. దీంతో పెద్ద ఉపద్రవం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తున్నా అధికారులు గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు కనపడటం లేదని ఈ ఘటనతో తేటతెల్లమైంది. నిబంధనలకు విరుద్ధంగా కొత్తచెరువు వద్ద శనివారం తెల్లవారుజామున బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించి 26 మంది సజీవదహనమైన ఘటన కళ్లల్లో మెదులుతుండగానే విజయవాడ రైల్వేస్టేషన్లో నిలిచి ఉన్న రైలులోని ఏసీ కోచ్‌ల నుంచి పొగలు రావడం కలకలం సృష్టించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు అదనంగా వైరింగ్ లాగి ఎల్సీడీ టీవీ నుంచి ల్యాప్‌ట్యాప్‌ల వరకు చార్జింగ్ పెట్టుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదాయంపై దృష్టి పెట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా లోడ్ కన్నా అధికంగా విద్యుత్ ఏర్పాట్లుచేసినా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదం విజయవాడ స్టేషన్లో మెయింటెనెన్స్ కోసం ఆగిన సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రాత్రి సమయంలో జరిగి ఉంటే మరో నాందేడ్ ఘటన పునరావృతం అయ్యేదన్న భావన అధికారులలో వ్యక్తం అవుతోంది. రంగంలోకి దక్షిణమధ్య రైల్వే జీఎం... ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ కూడా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాగృతి సంస్థ వారు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు విద్యార్థులతో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను వీక్షిస్తున్నారు. దానిలో భాగంగా ఈ నెల 24న ముంబయిలో బయలుదేరి బెంగళూరు, మధురై, చెన్నైల మీదుగా విశాఖపట్నానికి వెళ్తున్నారు. విజయవాడలో మెయింటెనెన్స్నిమిత్తం రైలును నిలిపివేశారు. విద్యార్థులందరూ దిగి నగరంలోకి వెళ్లిన తర్వాత ఆ రైలులోని ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా పొగ, నిప్పురవ్వలు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపుచేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బోగీల లోపల నిబంధనలకు వ్యతిరేకంగా వైరింగ్ చేసినా పట్టించుకోని సిబ్బందిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
దేవుడా.. ఎంతపని చేశావు..?
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర ్ఘటనలో అనంతపురానికి చెందిన కొత్త దంపతులు శ్రీలత, శ్రీనివాస్ మృత్యువాత పడినట్లు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. దేవుడా.. ఆరు నెలలకే ఆ దంపతుల జీవితాన్ని ముగించేశావా అంటూ రోదించారు. మృతదేహాల కోసం అనంతపురం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు. బెంగళూరు నుంచి బయలుదేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం 26 మంది పాలిట మృత్యు శకటంగా మారింది. ఈ ఘోర ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యథను మిగిల్చింది. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు నగరంలోని విక్టోరియా ఆస్పత్రి వద్దకు చేరుకొని ‘దేవుడా ఎందుకిలా చేశావ్, ఎందుకు మా కింత శిక్ష విధించావంటూ’ విలపిస్తుంటే వారిని చూస్తున్న వారి కళ్లు కూడా చెమర్చాయి. -
రైలు ప్రమాదం పై ఫోరెన్సిక్ పరిశీలన
తన టీంతో వివరాలు సేకరిస్తున్న ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డెరైక్టర్ శారద పదిరోజుల్లో నివేదిక; షార్ట్ సర్క్యూటే ప్రమాద కారణం కావచ్చని వ్యాఖ్య ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని స్పష్టీకరణ బెంగళూరులో మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు సాక్షి, హైదరాబాద్, బెంగళూరు/ పుట్టపర్తి అర్బన్, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా కొత్త చెరువు వద్ద శనివారం తెల్లవారు జామున నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డెరైక్టర్ శారద అవధానం ఆదివారం తన బృందంతో ఘటనా స్థలాన్ని, ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్లో ఉంచిన కాలిపోయిన బీ1 బోగీని పరిశీలించారు. అధికారులు తులసిరాం, శివప్రసాద్, డీఎన్ఏ నిపుణులు గోపీనాథ్, వెంకన్న, సైంటిఫిక్ అసిస్టెంట్ నాగరాజు, క్లూస్‌టీం టెక్నీషియన్ గాంధీ, రైల్వే సీఐ మురళీధర్‌రెడ్డి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. బోగీలోని బెర్తుల వారీగా లభించిన వస్తువులను రికార్డు చేస్తున్నామని చెప్పారు. ల్యాబ్‌కు పంపాల్సినవి ఒక వైపు.. రైల్వే పోలీసులు సేకరించినవి మరో వైపు భద్రపరిచి వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. ప్రమాదం జరిగినపుడు బోగీలో పేలుడు సంభవించలేదని ప్రాథమిక అంచనాకు వచ్చామని, షార్ట సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చునన్నారు. అయితే, కచ్చితమైన కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని, ఇంత పెద్ద ఘటన వెనుక గల కారణాలను ఘటనాస్థలాన్ని పరిశీలించిన వెంటనే చెప్పడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రమాదానికి విద్రోహచర్య సహా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా?, మంటలు పెరగడానికి దోహదం చేసేవి బోగీలో ఏమైనా ఉన్నాయా?.. అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నామన్నారు. పదిరోజుల్లో విచారణ నివేదిక సిద్ధం చేస్తామన్నారు. అగ్నిప్రమాదం ప్రారంభమైన చోట తెల్లని బూడిద.. అగ్ని ప్రమాదం జరిగిన బీ1 బోగీలోని ఎల్-2 డోర్ వద్ద ఉన్న బెర్తు కింది భాగంలో తెల్లని బూడిద వంటి పదార్థం దొరికింది. ఇది పేలుడు పదార్థమా లేక టపాసులకు సంబంధించినదా? అనే విషయాన్ని పరిశీలిస్తామని శారద తెలిపారు. బోగీలో అగ్ని ప్రమాదం ప్రారంభమైన చోటే తెల్లని బూడిద బయట పడిందని, దీన్ని ప్రత్యేకంగా సేకరించి సైన్స్ ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. డోర్‌కు ఉన్న రబ్బర్ అంటుకోవడం కారణంగా డోర్ తెరుచుకోకపోయి ఉండవచ్చన్నారు. పదకొండు మృతదేహాల అప్పగింత నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో చనిపోయిన 26 మందిలో 11 మృతదేహాలను సంబంధీకులకు రైల్వే శాఖ అధికారులు అప్పగించారు. మిగిలిన వాటిని డీఎన్ఏ పరీక్షల అనంతరం బంధువులు తీసుకువెళ్లవచ్చని తెలిపారు. ఘటనాస్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతదేహాలను గుర్తుపట్టిన బంధువులకు వాటిని అధికారులు అప్పగించారు. అయితే వీటిని దహనం చేయకూడదని, ఖననం మాత్రమే చేయాలని సూచించారు. భవిష్యత్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే డీఎన్ఏ పరీక్షలకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ భీమయ్య, సుభాష్‌రెడ్డి, రాతి ప్రేమ్‌లత, రాతి చంపాలాల్, బసవరాజ్, సర్వమంగళ, కులకర్ణి, జుహి నాగ్రే, లీల, సుధ, రామనాథన్ మృతదేహాలను సంబంధీకులకు అప్పగించారు. ఇదిలాఉండగా నిన్నటి వరకూ ప్రమాదం జరిగిన బోగీలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 65గా పేర్కొన్న రైల్వే శాఖ.. ఆదివారం మీడియాకు విడుదల చేసిన బులిటెన్‌లో ఆ సంఖ్యను 68కి పెంచింది. మరోవైపు, మృతుల్లో భీమయ్య, సురేష్‌రెడ్డి పాటిల్‌లకు రిజర్వేషన్ లేదు. అయితే మృతుల్లో వీరు ఉన్నట్టు బంధువులు గుర్తించి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎటువంటి రిజర్వేషన్ లేకుండా బోగీలో వారెలా ప్రయాణిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుడి ఆత్మహత్య మృత్యుబోగీని చూసి చలించిపోయిన ఉపాధ్యాయుడొకరు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. పుట్టపర్తికి చెందిన బసవరాజు ఉపాధ్యాయుడు. ప్రమాదం జరిగినప్పటి నుంచీ దిగాలుగా ఉన్న బసవరాజు.. ఆదివారం ఉదయం రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగిన బోగీని చూస్తూ.. స్టేషన్లోకి వస్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. -
అయ్యయ్యో.. శుభలేఖలు
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో షార్ట సర్క్యూట్ జరిగిన బీ1 బోగీలో అగ్నికీలలు ఎగిసిపడినా శుభలేఖలు చెక్కుచెదరలేదు. అయితే వీటిని పంచేందుకు తీసుకెళుతున్న వారు మరణించారా.. గాయాలతో బయటపడ్డారా అన్నది తెలియడం లేదు. బెంగళూరుకు చెందిన శాంతిలాల్, శకుంతలబాయి దంపతుల కుమార్తె స్మితకు, నాందేడ్‌కు చెందిన కన్హేలాల్‌జీ పురోహిత్, మనూదేవి దంపతుల కుమారుడు నిఖిల్‌కి వివాహం నిశ్చయమైంది. శుభలేఖలు పంచేందుకు బెంగళూరు నుంచి వధువు కుటుంబ సభ్యులు బయల్దేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం వల్ల 26 మంది వృతి చెందగా, పలువురు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బోగీ బయట శుభలేఖలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి పలువురు అయ్యయ్యో.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సేపు అవి అక్కడే ఉన్నప్పటికీ వాటిని ఎవరూ తీసుకెళ్లలేదు. దీంతో ఆ పెళ్లి పత్రికల సంబంధీకుల ఆచూకీ తెలియరాలేదు. వారు క్షేమంగా బయట పడాలని అక్కడ వాటిని చూసిన వారందరూ కోరుకున్నారు. -
తెల్లారిన బతుకులు
= నాందేడ్ ఎక్స్‌ప్రెస్ బీ1 ఏసీ బోగీలో షార్టసర్క్యూట్ = అగ్ని కీలల్లో చిక్కుకుని 26 మంది మృత్యువాత = ఆర్తనాదాలతో దద్దరిల్లిన కొత్తచెరువు ప్రాంతం = ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రులు ఖర్గే, కోట్ల = మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం = ఆప్తుల ఆచూకీ కోసం బంధువుల అగచాట్లు = రైలు బయలుదేరే ముందు సరిగా పరీక్షించలేదని అనుమానం = కాలిన బోగీని పరిశీలించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంపై నిప్పులు చెరిగిన వైస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ‘కేకలు.. ఆరుపులు.. కాపాడండంటూ ఆర్తనాదాలు.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. టాయ్‌లెట్ వాకిలి తెరిచి బయటకు తొంగిచూస్తే పొగ గుప్పుమంది.. ఏదో జరగరాదని జరిగిందని భయపడుతూ అడుగు బయటకు పెట్టాను.. ఆలోచించడానికే సమయం లేదు.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ఇక్కడే సజీవ సమాధి ఖాయం.. వాకిలి తెరుచుకోలేదు.. తిరిగి టాయ్లెట్లోకి వెళ్లి కిటికీని గట్టిగా కాలితో నాలుగు తన్నులు తన్నాను.. అద్దం పగిలిపోయింది.. బోగీ లోపల మంటలు ఎగిసిపడుతూ మీదకొస్తున్నాయి.. అందరూ ఇటు రండంటూ గట్టిగా కేకలు వేశా.. అప్పటికే ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది.. కిటికీలోంచి దూకేయండంటూ పురమాయించాను.. వేడిమి భరించడం వీలుకాక నేనూ బయటకు దూకేశాను’ అంటూ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శరణ్ బసవ బెంగళూరు - నాందేడ్ రైలు బోగీ దగ్ధమైన ఘటనను భయం భయంగా వివరించారు. ఈ ఘటనలో అతను తన భార్య, మామను మాత్రం కాపాడుకోలేకపోయారు. సంఘటన స్థలం మరుభూమిగా మారింది. మృతదేహాలు ఒక్కోటి బయటకు తీస్తుంటే స్థానికుల ఒళ్లు జలదరించింది. బెంగళూరు/కొత్తచెరువు, న్యూస్‌లైన్ : శనివారం తెల్లవారుజాము.. అప్పుడప్పుడే తొలి కోడి కూసింది.. రైతు కుటుంబాల వారు నిద్రలేస్తున్నారు. అంతలోనే రైలు బోగీ అంటుకుందన్న వార్తతో కొత్తచెరువు, పుట్టపర్తి వాసులు ఉలిక్కి పడ్డారు. పరుగు పరుగున సంఘటన స్థలానికి తరలివెళ్లారు. బోగీ మంటల్లో తగలబడుతూ కనిపించింది. ఎవరికి చేతనైంది వారు చేసి ప్రయాణికులను కాపాడటానికి ఉపక్రమించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు బెంగళూరులో బయలు దేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ1 ఏసీ బోగీ ఇక్కడ తగలబడిన సంఘటనలో 26 మంది మృతి చెందారని తెలియగానే జిల్లాలోని ప్రముఖులందరూ తరలివచ్చారు. కాసేపటికి రైల్వే అధికారులూ వచ్చారు. ఉదయం 11 గంటల సమయానికి ఆ రైలులో ప్రయాణించిన వారి బంధులు సైతం కొందరు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్, ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 26మంది మరణించినట్లు కలెక్టర్ తెలిపారు. క్షతగాత్రులను పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామసుబ్బారావు ఆధ్వర్యంలో సంఘటన స్థలిలోనే వైద్య శిబిరం ఏర్పాటు చే సి స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేయించారు. మధ్యాహ్నం రైల్వే శాఖ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, నిమ్మల కిష్టప్ప, మంత్రి రఘువీరా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నేత హరికృష్ణ తదితరులు సంఘటన స్థలిని పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సైతం తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని సంఘటన స్థలి వద్దకు వచ్చారు. కాలిపోయిన రైలు బోగీని పరిశీలించిన అనంతరం పుట్టపర్తి రైల్వేస్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరివల్లే తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని నిప్పులు చెరిగారు. కాగా, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బెంగళూరుకు తరలించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం వాటని వారి బంధువులకు అప్పగించనున్నారు. -
రైలు ప్రమాద దృశ్యాలు
-
రైల్వే బాధితులకు జగన్ పరామర్శ
-
రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
-
ప్రమాదాలపై కమిషన్లే తప్ప ఫలితంలేదు:జగన్
పుట్టపర్తి: రైలు ప్రమాదాలు, వోల్వో బస్సు ప్రమాదాలు జరిగిన తరువాత కమిషన్లు వేస్తున్నారు గానీ, ఫలితం ఉండటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోకి వచ్చిన తరువాత బి ఒన్ ఏసి కోచ్లోమంటలు వ్యాపించి 26 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాద వార్త తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి చెందిన జగన్ కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. క్షతగాత్రులను, మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 16 నెలల వ్యవధిలో మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. అనేక మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విచారణకు కమిషన్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. మళ్లీ మళ్లీ మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. విచారణ నివేదికలు లేవు. ప్రమాదాలు ఎలా జరిగాయో తెలియదు. వివరాలు వెల్లడించరు. మళ్లీ ఈరోజు కూడా కమిషన్ వేస్తామంటారు. పలాన సమస్య వల్ల ఇంతమంది చనిపోయారు అని తెలియజేయరు. మళ్లీ ఆ సమస్య తలెత్తకుండా పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంలేదు. పాత బోగీలు వాడుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఓల్వో బస్సు ప్రమాదాలు నాలుగు జరిగాయి. నడిరోడ్డుపై నాలుగు ఓల్వో బస్సు లు దగ్ధమయ్యాయి. అనేక మంది చనిపోయారు. ఎన్ని ప్రమాద సంఘటనలు జరిగినా కారణాలు తెలియజేయడంలేదు. ఈ రకంగా ఇంతమంది చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకుండా వారికి రక్షణ కల్పించాలని, భరోసా ఇవ్వాలని కోరారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్స్‌గ్రేషియా ఎంత ఇచ్చారనేది కాదన్నారు. 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. ఎక్స్‌గ్రేషియా 5 లక్షలలా, పది లక్షలా, 20 లక్షలా అనేది కాదని, ప్రజలకు భద్రత కల్పించమని కోరుతున్నామని చెప్పారు. -
రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన వైఎస్ జగన్ అనంతపురం జిల్లా కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను, మృతిచెందిన వారి కుటుంబీకులను వైఎస్ జగన్ పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మృతుల బంధువులు, కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మంటలు చెలరేగడంతో 26మంది సజీవదహనయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. -
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మృతుల వివరాలు
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ బసవరాజు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మంటల్లో కాలిబూడిదైపోయారు. ఆయనతో పాటు కూతురు సర్వమంగళమ్మ, కూడా రైల్లోని మంటల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సర్వమంగళం కౌతాళంలో టీచర్‌గా పని చేస్తున్నారు. ప్రమాదం నుంచి బసవరాజు భార్య అన్నపూర్ణమ్మ, పెద్దతుంబళం గ్రామంలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న అల్లుడు చరణ్, ప్రాణాలతో బయటపడ్డారు. బసవరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు తమ కొడుకుకు పెళ్లి సంబంధం చూడటానికి బెంగళూరు వెళ్లి తిరిగి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. ముంబైకి చెందిన అనిల్‌కుమార్, బెంగళూరుకు చెందిన మధు, రాంప్రసాద్, అనిల్ కులకర్ణి, లలిత, పద్మజ విగత జీవులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన గణేశ్ కూడా మంటల్లో చిక్కుకుని తుదిశ్వాస విడిచారు. అనంతపురం, ధర్మవరం ఆసుపత్రుల్లో చెన్నైకు చెందిన విజిత, తునుశ్రీ, నతేష్, మైసూర్ వాసి విజయ, బెంగళూరు నివాసి తనూజ చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 26మంది సజీవ దహనం కాగా, మరో 15మంది గాయపడ్డారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద మృతులు ఆదోనికి చెందిన బసవరాజు ఆదోనికి చెందిన సర్వమంగళమ్మ ముంబైకి చెందిన అనిల్‌కుమార్ బెంగళూరుకు చెందిన మధు, రాంప్రసాద్ బెంగళూరు వాసులు అనిల్కులకర్ణి, లలిత, పద్మజ హైదరాబాద్‌కు చెందిన గణేశ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ క్షతగాత్రులు చెన్నైకు చెందిన విజిత, తునుశ్రీ, నతేష్ మైసూర్ వాసి విజయ బెంగళూరు నివాసి తనూజ -
ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదు
-
26కు పెరిగిన మృతుల సంఖ్య
-
జగన్ నేటి సమైక్య శంఖారావం యాత్ర రద్దు
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర నేడు రద్దు అయ్యింది. ఆదివారం నుంచి యాత్ర యథాతథంగా జరుగుతుందని ఆపార్టీ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా కొత్తవలస వద్ద ఈరోజు తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలానికి ఆయన బయల్దేరి వెళ్లారు. బాధితులను జగన్ పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో సమైక్య శంఖారావం యాత్ర వాయిదా పడింది. -
26కు పెరిగిన మృతుల సంఖ్య
అనంతపురం : బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. మృతదేహాలకు సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం డీఎన్ఏ పరీక్షల నిమిత్తం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరస్తున్నారు. పరీక్షల అనంతరం బంధువులకు అప్పగించనున్నారు. కాగా ఇప్పటివరకూ రెండు మృతదేహాలను గుర్తించారు. ఆదోనికి చెందిన సర్వ మంగళం, బస్వరాజులను బంధువులు గుర్తించారు. ఇక మృతదేహాల్లో 12మంది మహిళులు, 12 పురుషులు, ఓ చిన్నారిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులు, ఫైర్ సిబ్బంది... సహాయకచర్యల్లో మునిగిపోయారు. మృతదేహాలను వెలికితీయడంతో పాటు క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్పించడంలో నిమగ్నమయ్యారు. దాదాపు నాలుగు గంటల ప్రయత్నం తర్వాత ఫైర్ సిబ్బంది ప్రయత్నం ఫలించింది. బీ-1 బోగీలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. -
మాంసపు ముద్దల్లా ప్రయాణికులు...
అనంతపురం : అయ్యో.. పాపం... ఇలాంటి దుస్థితి పగవాడిక్కూడా రాకూడదు. అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరి నోటి నుంచి వెలువడిన మాటలివే. ఆ దృశ్యాలు చూసినవారెవరైనా కంటతడి పెట్టకమానరు. బోగి అంతా బుగ్గి బుగ్గి కావడంతో ప్రయాణికులు మాడిమసయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలి పోయాయి. అంతా మాంసపుముద్దల దిబ్బగా మారింది. తెల్లవారుజాము.. గాఢ నిద్ర... ఏసీ కోచ్‌లో సుఖవంతమైన ప్రయాణం... కాసేపట్లో గమ్యం దిగేవాళ్లు కొందరు. కొన్ని గంటల్లో తమ గమ్యాలకు చేరుకునేవాళ్లు మరికొందరు. ఇలా సాగుతున్న ప్రయాణం... ఒక్కసారిగా పెను కుదుపులకు గురైంది. చల్లని ప్రయాణం అగ్నికీలలను రాజేసింది. గాఢనిద్రలో ఉన్నవాళ్లు... తేరుకునేలోపే అంతా జరిగిపోయింది. 23 మంది ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం పలువురిని కలిచివేసింది. మరోవైపు మృతదేహాలను బోగీ నుంచి వెలికి తీసి బెంగళూరు తరలిస్తున్నారు. మృతులను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయనున్నారు. -
ప్రాణాల కాపాడుకునేందుకు తెగించి దూకేశారు
-
ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదు
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. రైలు ప్రమాదం జరగటం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించినట్లు కోట్ల తెలిపారు. అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు అయిదు లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి లక్ష, స్వల్పంగా గాయపడినవారికి యాభైవేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని కోట్ల తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ఆయన అన్నారు. పదిరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు కోట్ల పేర్కొన్నారు. మరోవైపు... సాంకేతిక సమస్యలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది పరీక్షల తర్వాత గానీ అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశముంది. -
మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా
-
భార్య మరణించినా.. 20 మందిని రక్షించాడు
అనంతపురం : పెను ప్రమాదం జరిగినప్పుడు చాకచక్యంగా స్పందించేవారు కొందరుంటారు. మానవతా దృక్పథంతో ప్రాణాలకు తెగించి మరీ తోటివారిని కాపాడడానికి ముందుకు ఉరికివస్తారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కూడా ఓ వ్యక్తి అలాగే తెగించాడు. తన జీవన సహచరి కళ్ల ముందు సజీవ దహనమైనా కన్నీటిని దిగమింగుకుంటూ తోటి ప్రయాణికులను కాపాడడంలో మునిగిపోయాడు శ్రవణ్ అనే ప్రయాణికుడు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో శ్రవణ్ భార్య, అత్త, మావయ్య అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. ఆ బాధను భరిస్తూనే అతడు... 20 మంది ప్రయాణికులను రక్షించాడు. చాకచక్యంగా వ్యవహరిస్తూ వారందరినీ ప్రమాదం నుంచి తప్పించాడు. అయితే కట్టుకున్న భార్యను.. వికలాంగుడైన ఆమె తండ్రిని మాత్రం కాపాడలేకపోయాడు. భార్యను కాపాడుకోలేకపోయాను గానీ.. దాదాపు 20 మంది ప్రాణాలను మాత్రం కాపాడగలిగానంటూ కన్నీంటి పర్యంతమయ్యాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 23మంది సజీవ దహనం కాగా, 15మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు ధర్మవరం, పుట్టపర్తి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బీ1 ఏసీ బోగీలో 57మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. -
ప్రాణాల కాపాడుకునేందుకు తెగించి దూకేశారు
అనంతపురం : చలికాలం... తెల్లవారుజాము.. చుట్టూ చీకటి.. ఆ సమయంలో ఇవి ఎవరికీ పట్టవు. ప్రాణాలు కాపాడుకుంటే చాలనిపిస్తుంది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాద విషయం గ్రహించిన కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడానికి నానా పాట్లు పడ్డారు. ప్రాణభయంతో తెగించి ముందుకు దూకారు. కొందరు ప్రయాణికులు బోగీ నుంచి ఉన్నపళంగా దూకేస్తే మరికొందరు బాత్రూమ్లోని అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రయత్నాల్లో చాలా మంది తీవ్రగాయాల పాలయ్యారు. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. క్షతగాత్రులను ధర్మవరం, అనంతపురం, పెనుగొండ, పుట్టపర్తిల్లోని ఆస్పత్రులకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తనూశ్రీ అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల రోదనలు, బంధువుల కన్నీటితో ఆస్పత్రుల ప్రాంగణాలు శోక సంద్రాల్లా మారిపోయాయి. -
మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా
అనంతపురం : బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రైల్వేశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతి చెందినవారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడినవారికి యాభైవేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు రైల్వేబోర్డు వెల్లడించింది. క్షతగాత్రుల సమాచారం కోసం : సికింద్రాబాద్ హెల్లైన్ నెంబర్లు: 040-27700868, 9701371060 వికారాబాద్ హెల్లైన్ నెంబర్లు : 08416-252215, 9701371081 ధర్మవరం హెల్లైన్ నెంబర్ : 08559 224422 గుంతకల్లు హెల్లైన్ నెంబర్లు : 0855 2220305, 09701374965 అనంతపురం హెల్లైన్ నెంబర్: 09491221390 సేదమ్ హెల్లైన్ నెంబర్: 08441-276066 బీదర్ హెల్లైన్ నెంబర్లు : 08482-226404, 7760998400 బెంగళూరు హెల్లైన్ నెంబర్లు : 080-22354108, 22259271 బెంగళూరు హెల్లైన్ నెంబర్లు: 080-22156554, 22156553 సత్యసాయి ప్రశాంతి నిలయం హెల్లైన్ నెంబర్ : 08555 280125 -
సాంకేతిక లోపం వల్లే రైలు ప్రమాదం
-
సాంకేతిక లోపం కారణంగానే రైలు ప్రమాదం
అనంతపురం: సాంకేతిక లోపం కారణంగానే నాందేడ్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న ఈ రైలు అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోకి వచ్చిన తరువాత బి ఒన్ ఏసి కోచ్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 21 మంది పెద్దవారితోపాటు ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. ఈ ప్రయాణికులందరూ గాఢ నిద్రలోనే మృత్యు వడిలోకి వెళ్లిపోయారు. బోగి పూర్తిగా కాలిపోయింది. కొంతమంది కాలిబూడిదయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్నట్లు స్థానికలు చెబుతున్నారు. ప్రమాదం విషయం తెలియగానే అనంతపురం రేంజ్ డిఐజి బాలకృష్ణ, కలెక్టర్ లోకేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదం ఈ తెల్లవారుజామున 3.25 గంటల ప్రాంతంలో జరిగినట్లు డిఐజి బాలకృష్ణ చెప్పారు. ప్రమాదం విషయం తెలియగానే అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపు చేస్తోందని కలెక్టర్ లోకేష్ కుమార్ తెలిపారు. మంత్రి రఘువీరా రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు ప్రమాద హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లు: 080-22354108/ 22251271 పుట్టపర్తి ప్రశాంతి నిలయం : 08555-280125