అనంతపురం : అయ్యో.. పాపం... ఇలాంటి దుస్థితి పగవాడిక్కూడా రాకూడదు. అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరి నోటి నుంచి వెలువడిన మాటలివే. ఆ దృశ్యాలు చూసినవారెవరైనా కంటతడి పెట్టకమానరు. బోగి అంతా బుగ్గి బుగ్గి కావడంతో ప్రయాణికులు మాడిమసయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలి పోయాయి. అంతా మాంసపుముద్దల దిబ్బగా మారింది.
తెల్లవారుజాము.. గాఢ నిద్ర... ఏసీ కోచ్‌లో సుఖవంతమైన ప్రయాణం... కాసేపట్లో గమ్యం దిగేవాళ్లు కొందరు. కొన్ని గంటల్లో తమ గమ్యాలకు చేరుకునేవాళ్లు మరికొందరు. ఇలా సాగుతున్న ప్రయాణం... ఒక్కసారిగా పెను కుదుపులకు గురైంది. చల్లని ప్రయాణం అగ్నికీలలను రాజేసింది. గాఢనిద్రలో ఉన్నవాళ్లు... తేరుకునేలోపే అంతా జరిగిపోయింది. 23 మంది ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం పలువురిని కలిచివేసింది.
మరోవైపు మృతదేహాలను బోగీ నుంచి వెలికి తీసి బెంగళూరు తరలిస్తున్నారు. మృతులను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయనున్నారు.
మాంసపు ముద్దల్లా ప్రయాణికులు...
Published Sat, Dec 28 2013 10:50 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement
Advertisement