charred bodys
-
హరియాణాలో దారుణం.. కారులోనే ఇద్దరు వ్యక్తుల సజీవ దహనం
-
రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన వైఎస్ జగన్ అనంతపురం జిల్లా కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను, మృతిచెందిన వారి కుటుంబీకులను వైఎస్ జగన్ పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మృతుల బంధువులు, కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మంటలు చెలరేగడంతో 26మంది సజీవదహనయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. -
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మృతుల వివరాలు
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ బసవరాజు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మంటల్లో కాలిబూడిదైపోయారు. ఆయనతో పాటు కూతురు సర్వమంగళమ్మ, కూడా రైల్లోని మంటల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సర్వమంగళం కౌతాళంలో టీచర్‌గా పని చేస్తున్నారు. ప్రమాదం నుంచి బసవరాజు భార్య అన్నపూర్ణమ్మ, పెద్దతుంబళం గ్రామంలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న అల్లుడు చరణ్, ప్రాణాలతో బయటపడ్డారు. బసవరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు తమ కొడుకుకు పెళ్లి సంబంధం చూడటానికి బెంగళూరు వెళ్లి తిరిగి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. ముంబైకి చెందిన అనిల్‌కుమార్, బెంగళూరుకు చెందిన మధు, రాంప్రసాద్, అనిల్ కులకర్ణి, లలిత, పద్మజ విగత జీవులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన గణేశ్ కూడా మంటల్లో చిక్కుకుని తుదిశ్వాస విడిచారు. అనంతపురం, ధర్మవరం ఆసుపత్రుల్లో చెన్నైకు చెందిన విజిత, తునుశ్రీ, నతేష్, మైసూర్ వాసి విజయ, బెంగళూరు నివాసి తనూజ చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 26మంది సజీవ దహనం కాగా, మరో 15మంది గాయపడ్డారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద మృతులు ఆదోనికి చెందిన బసవరాజు ఆదోనికి చెందిన సర్వమంగళమ్మ ముంబైకి చెందిన అనిల్‌కుమార్ బెంగళూరుకు చెందిన మధు, రాంప్రసాద్ బెంగళూరు వాసులు అనిల్కులకర్ణి, లలిత, పద్మజ హైదరాబాద్‌కు చెందిన గణేశ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ క్షతగాత్రులు చెన్నైకు చెందిన విజిత, తునుశ్రీ, నతేష్ మైసూర్ వాసి విజయ బెంగళూరు నివాసి తనూజ -
26కు పెరిగిన మృతుల సంఖ్య
-
26కు పెరిగిన మృతుల సంఖ్య
అనంతపురం : బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. మృతదేహాలకు సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం డీఎన్ఏ పరీక్షల నిమిత్తం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరస్తున్నారు. పరీక్షల అనంతరం బంధువులకు అప్పగించనున్నారు. కాగా ఇప్పటివరకూ రెండు మృతదేహాలను గుర్తించారు. ఆదోనికి చెందిన సర్వ మంగళం, బస్వరాజులను బంధువులు గుర్తించారు. ఇక మృతదేహాల్లో 12మంది మహిళులు, 12 పురుషులు, ఓ చిన్నారిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులు, ఫైర్ సిబ్బంది... సహాయకచర్యల్లో మునిగిపోయారు. మృతదేహాలను వెలికితీయడంతో పాటు క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్పించడంలో నిమగ్నమయ్యారు. దాదాపు నాలుగు గంటల ప్రయత్నం తర్వాత ఫైర్ సిబ్బంది ప్రయత్నం ఫలించింది. బీ-1 బోగీలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. -
మాంసపు ముద్దల్లా ప్రయాణికులు...
అనంతపురం : అయ్యో.. పాపం... ఇలాంటి దుస్థితి పగవాడిక్కూడా రాకూడదు. అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరి నోటి నుంచి వెలువడిన మాటలివే. ఆ దృశ్యాలు చూసినవారెవరైనా కంటతడి పెట్టకమానరు. బోగి అంతా బుగ్గి బుగ్గి కావడంతో ప్రయాణికులు మాడిమసయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలి పోయాయి. అంతా మాంసపుముద్దల దిబ్బగా మారింది. తెల్లవారుజాము.. గాఢ నిద్ర... ఏసీ కోచ్‌లో సుఖవంతమైన ప్రయాణం... కాసేపట్లో గమ్యం దిగేవాళ్లు కొందరు. కొన్ని గంటల్లో తమ గమ్యాలకు చేరుకునేవాళ్లు మరికొందరు. ఇలా సాగుతున్న ప్రయాణం... ఒక్కసారిగా పెను కుదుపులకు గురైంది. చల్లని ప్రయాణం అగ్నికీలలను రాజేసింది. గాఢనిద్రలో ఉన్నవాళ్లు... తేరుకునేలోపే అంతా జరిగిపోయింది. 23 మంది ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం పలువురిని కలిచివేసింది. మరోవైపు మృతదేహాలను బోగీ నుంచి వెలికి తీసి బెంగళూరు తరలిస్తున్నారు. మృతులను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయనున్నారు.