రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ | ys jagan mohan reddy meets and consoles train accident victims | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ

Published Sat, Dec 28 2013 2:39 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ - Sakshi

రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ

అనంతపురం : నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను, మృతిచెందిన వారి కుటుంబీకులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మృతుల బంధువులు, కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తచెరువు వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ మంటలు చెలరేగడంతో 26మంది సజీవదహనయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement