Nanded-Bangalore Express
-
పట్టాలు తప్పిన భద్రత
సందర్భం డా॥బలిజేపల్లి శరత్‌బాబు, ప్రధాన శాస్త్రవేత్త, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, హైదరాబాద్ అనంతపురం జిల్లా కొత్త చెరు వు- పుట్టపర్తి స్టేషన్ల మధ్య నాం దేడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు ఇటీవల సంభవించిన అగ్ని ప్ర మాదం కొత్త భయాలను సృష్టి స్తోంది. 64 మంది ప్రయాణి కులు ఉన్న ఏసీ బి1 బోగీకి నిప్పంటుకుని 26 మంది మర ణించారు. తరవాత పరిహారాల ప్రకటన, పరామర్శలు మొక్కు బడిగా జరిగిపోయాయి. గడ చిన రెండేళ్లలో రైళ్లలో అగ్ని ప్రమాదాలు రెండింతలైనా యంత్రాంగం స్పందన ఇంత చప్పగా ఎందుకుందో అర్థం కాదు. రైల్వే అధికార సమాచారం ప్రకారం ఏటా సంభవిం చే మొత్తం రైలు ప్రమాదాలలో నమోదవుతున్న మరణా లలో, అగ్నిప్రమాదాల మృతులు 2 శాతం. దేశంలో చోటు చేసుకుంటున్న అసహజ మరణాలలో రైల్వే ప్రమాదాల మృతుల వాటా 7.8 శాతం. మామూలు ప్రమాదాలకు తోడు 2010-2013 మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు ఏటా రెట్టింపు వంతున పెరిగాయి. రైలు ప్రమాదాల నివారణలో ఆ యంత్రాంగానికి గురుతర బాధ్యత ఉన్న మాట నిజమే. కానీ అందులో ప్రయాణికులకూ పాత్ర ఉంది. నాందేడ్-బెంగళూరు ఎక్స్ ప్రెస్‌కు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవ చ్చునని అధికారులు చెబుతున్నారు. దీనితో పాటు రసా యనాలతో కూడిని కొన్ని సీసాలు బోగీలో ఉన్నట్టు అను మానాలు ఉన్నాయి. ఇవన్నీ విచారణలో తేలవచ్చు. మన రైలు ప్రమాదాల చరిత్రచూస్తే మానవ తప్పిదాలు, ప్రయా ణికుల ఉదాశీనత, నిర్లక్ష్యం కూడా వాటికి కారణమైన సంగతి బోధపడుతుంది. కకోడ్కర్ సిఫారసులు ఏమైనట్టు? రైళ్లలో మంటలు లేచిన వెనువెంటనే ఆ ప్రమాదాన్ని గుర్తించే వ్యవస్థను బోగీలలోనే ఏర్పాటు చేయాలని అనిల్ కకోడ్కర్ అధ్యక్షతన ఏర్పాటయిన రైల్వే భద్రత సమీక్షా సంఘం ఫిబ్రవరి 2012లో సిఫార్సు చేసింది. భద్రతా ప్రమాణాల పెంపు అవసరాన్ని ఇవి చెప్పక చెబుతున్నా యి. ప్రస్తుతం మనం నమ్ముకుంటున్న పొడి రసాయన పౌడర్ల ఆధారంగా మంటలార్పే వ్యవస్థ శుద్ధ నిరుప యోగమని తేల్చి చెప్పింది. అత్యవసర ల్యాండింగ్ జరిగిన సందర్భాలలో భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రయాణికు లను విమానం నుంచి కేవలం 90 సెకన్లలోనే వెలికి తీసు కురావాలి. కకోడ్కర్ కమిటి చెప్పిన ట్టు, రైళ్లలో ఇటువంటి ప్రమాణాలు లేవు. పైగా రైళ్లలో ప్రయాణికులు ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఏర్పాటు చేసే అత్యవసర ద్వారాలు, కిటికీలపై ఇప్పటి వరకు దృష్టి సారించిన జాడ లేదు. స్వతంత్రంగా ఒక నియంత్రణా వ్యవస్థ లేకపోవ డాన్ని కూడా ఆ కమిటి తప్పు పట్టింది. రైల్వ్థేలో అంతర్గత సంఘర్షణ నెలకొని ఉన్నది. నిబంధనల తయారీ, ప్రాథ మిక కార్యకలాపాలు, నియంత్రణాధికారాలు అన్నీ కూడా రైల్వే బోర్డు చేతికే ఇచ్చారు. ప్రత్యేక గుర్తింపు ఉన్నప్ప టికీ,ఏ ఒక్క కమిటి ప్రతిపాదనలు కూడా రైల్వే బోర్డు అమలుచేయలేని దయనీయ స్థితిలో ఉంది. రైల్వే కమిష నర్లు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నియంత్రణలో పేరుకు మాత్రమే ఉన్నారు గాని, కార్యకలాపాల స్థాయిలో మాత్రం వాళ్ల పాత్ర దాదాపు శూన్యమే. ‘రైల్వే భద్రతా ప్రాధికార సంస్థ’ ఏర్పాటు పని సత్వరం జరగాలని, ప్రస్తుత లైన్ల పునరుద్ధరణ, నూతన లైన్ల నిర్మాణం జరగ కుండా కొత్త రైళ్లను ప్రవేశపెట్టవద్దని కూడా కకోడ్కర్ కమిటి హెచ్చరించింది. ఈ రెండు ముఖ్య సిఫార్సులను కూడా రైల్వే మంత్రిత్వశాఖ గాలికి వదిలివేసిందనే ఎక్కువ మంది అభిప్రాయం. కకోడ్కర్ కమిటి పరిశీలనలో తేలి నట్టు, రైళ్లలో భద్రత ఆందోళనకరమైన స్థితిలోనే ఉంది. రిజర్వుడు బోగీలలో కూడా టిక్కెట్లు లేని ప్రయాణికులు చేరుతున్నారు. వీళ్లని అధికారులు చూసీచూడకుండా వది లేయడంతో మొత్తం ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమ వుతోంది. రైలు స్టేషన్ విడిచి పెట్టాక, ముఖ్యంగా రాత్రి వేళల్లో టిక్కెట్ ఎగ్జామినర్లు, రక్షణ సిబ్బంది సాధారణంగా కనబడరు. ప్రయాణికులకూ బాధ్యత ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రయా ణికులు తమ వంతు కర్తవ్యం నిర్వహించాలి. పెట్రో ఉత్ప త్తులు, ఫిల్మ్‌లు, టపాసులు, గ్యాస్ సిలిండర్లు వంటి సుల భంగా మండే వస్తువులతో ప్రయాణం చేయకూడదన్న కనీస స్పృహ ఉంచుకోవాలి. రైళ్లలో సిగరెట్లు కాల్చరాదనే ఆంక్షలు ఉన్నాయి. బోగీల కారిడార్లలో అడ్డంగా సామాన్లు పేర్చుకుంటూ పోయే అలవాటు ఇప్పటికీ ఉంది. వీటితో అత్యవసర సమయాల్లో, సామాన్లు పెట్టిన వారితో సహా, ఎవరూ బయట పడలేకపోవచ్చు. ఇలాంటి మామూలు జాగ్రత్తలు, అధికారికంగా ఇచ్చే ఆంక్షలు, మార్గదర్శకా లను ప్రయాణికులు గాలికి వదిలేయడమూ వాస్తవమే. కమిటీలు, నివేదికలు, దిద్దుబాటు చర్యలు కాగితాలకు పరిమితమవుతాయేగాని, ఆచరణలో కానరావు. ఈ పరిస్థి తికి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేక పోవడమే కారణం. రైలు ప్రయాణికులలో సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వారే ఎక్కువ. ప్రభుత్వ, రాజకీయ, అధికార వర్గాలను ప్రభావితం చేయగలిగిన వారు కాదు. వ్యవస్థ నిర్లక్ష్యాన్నీ, బాధ్యతారాహిత్యాన్నీ ప్రశ్నించలేని అసమర్థులని అన్ని అధికార వ్యవస్థలలోను పాతుకు పోయిన సర్వసాధారణ భావన. వీళ్లు కూడా మనుషులే ననీ, దీపపు పురుగులు కాదనీ గుర్తిస్తే, కొద్దిగా స్పందిస్తే అన్ని రకాల రైలు ప్రమాదాలు, ముఖ్యంగా అగ్ని ప్రమాదా లను కొంతవరకైనా ఆపగలిగే వాళ్లు. దారుణ మరణ బాధకు వారిని గురి చేసేవారు కాదు. రైలు ప్రయాణికుల భద్రత కోసం కేటాయిస్తున్న నిధులు ప్రతి ఏటా అలాగే మిగిలిపోతున్నాయంటేనే, మన వ్యవస్థలో పేద, మధ్య తరగతి ప్రజల ప్రాణాలకు ఉన్న విలువ ఏ పాటిదో అర్థమ వుతుంది. కాగ్ ఇటీవలి తన నివేదికలో రైల్వే భద్రతా వ్యవస్థల ఏర్పాటు కోసం కేటాయించిన రూ. 670 కోట్లకు పైగా నిధులు ఖజానాలోనే మూలుగుతున్నాయనీ, వాటి ని నిరుపయోగంగా ఉంచారనీ విమర్శించింది. మొబైల్స్‌తోనూ ముప్పే ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లు కూడా ప్రమాదకరంగా పరిణ మించాయి. వాటి చార్జింగ్ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థతో కేబుల్ వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. వాటి తో స్పార్కులు, షార్ట్ సర్క్యూట్లు సహజం. ఇంత చిన్న అంశాన్ని కూడా రైల్వే అధికారులు ఎందుకు పరిగణ నలోనికి తీసుకోరు? స్టేషన్లలో ప్రవేశించడానికి, ముఖ్యం గా రాత్రి వేళల్లో ఎటువంటి నియంత్రణ ఉండడం లేదు. ఇది దారుణమైన భద్రతా లోపం. అమాయక ప్రయాణికు లతోపాటు, దొంగలు, విచ్చిన్నకరశక్తులు యథేచ్ఛగా లోప లికి ప్రవేశించవచ్చు. ఏమైనా చేయవచ్చు. రెండవ తరగతి స్లీపర్ కార్లలో 72 మందికి నాలుగే నాలుగు మరుగుదొడ్లు ఉంటాయి. అత్యవసర ద్వారాల తీరు కూడా హాస్యాస్ప దం. అత్యవసర సమయాల్లో ప్రాణాలు దక్కించుకోవా లంటే ఇవే ద్వారాల నుంచి, అంటే 8 అడుగుల ఎత్తు నుం చి కిందకు దూకవలసి ఉంటుంది! ఇది కూడా ప్రాణాం తకమే. సామర్థ్యం కంటె అనేక రెట్లు ఎక్కువగా ప్రయా ణాలను అనుమతించే సాధారణ బోగీల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏం జరుగుతుందో ఊహించలేం. ఇప్పటికైనా కోచ్‌ల తయారీలో ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. బోగీలలో నిరంతర సమాచార వ్యవస్థను ఎందుకు ఏర్పరచుకోలేకపోతున్నామో అర్థం కాదు. బోగీల లోపలి ద్వారాలు లోహంతో కాకుండా గాజుతో నిర్మించాలి. అప్పుడే జామ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. బోగీల్లో పొగను గుర్తించి ఆటోమేటిక్‌గా రైలు బండి ఆగిపోగల వ్యవస్థను, అగ్ని ప్రమాదం సంభవించినపడు కూడా ప్రయాణికులు సులభంగా ఊపిరి పీల్చుకునే విధంగా, వ్యాపించిన పొగను వెంటనే తొలగించే వ్యవస్థ అవస రాన్ని కూడా రైల్వే గుర్తించాలి. ప్రపంచ గర్వించేలా మనం అంతరిక్ష పరిశోధన ఫలితాలు సాధించుకున్నాం. దేశ భద్ర తలో రాజీలేకుండా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకు న్నాం. కానీ రైలు ప్రయాణికుల భద్రతలో ఇంత వెనుకబడి ఉండడం దారుణం. -
ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ చేపడతాం: మల్లికార్జునఖర్గే
అనంతపురం: నాందేడ్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ చేపడతామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జునఖర్గే పేర్కొన్నారు. ప్రమాద ఘటనాస్థలాన్ని శనివారం కేంద్ర రైల్వేశాఖా మల్లికార్జునఖర్గే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన బాధితులను అన్నివిధాలా అదుకుంటామని మల్లికార్జునా ఖర్గే హమీ ఇచ్చారు. కాగా, అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు, పుట్టపర్తి రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున నాందేడ్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీ బి వన్‌లో మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారుల సహా 26మంది సజీవదహనమైయ్యారు. అకస్మాత్తుగా మంటలు ఒక బోగీ నుంచి రెండో బోగీకి వ్యాపించడంతో ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. ఈ రెండు బోగీల్లో 72 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. -
రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన వైఎస్ జగన్ అనంతపురం జిల్లా కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను, మృతిచెందిన వారి కుటుంబీకులను వైఎస్ జగన్ పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మృతుల బంధువులు, కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మంటలు చెలరేగడంతో 26మంది సజీవదహనయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. -
ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదు
-
26కు పెరిగిన మృతుల సంఖ్య
-
26కు పెరిగిన మృతుల సంఖ్య
అనంతపురం : బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. మృతదేహాలకు సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం డీఎన్ఏ పరీక్షల నిమిత్తం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరస్తున్నారు. పరీక్షల అనంతరం బంధువులకు అప్పగించనున్నారు. కాగా ఇప్పటివరకూ రెండు మృతదేహాలను గుర్తించారు. ఆదోనికి చెందిన సర్వ మంగళం, బస్వరాజులను బంధువులు గుర్తించారు. ఇక మృతదేహాల్లో 12మంది మహిళులు, 12 పురుషులు, ఓ చిన్నారిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులు, ఫైర్ సిబ్బంది... సహాయకచర్యల్లో మునిగిపోయారు. మృతదేహాలను వెలికితీయడంతో పాటు క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్పించడంలో నిమగ్నమయ్యారు. దాదాపు నాలుగు గంటల ప్రయత్నం తర్వాత ఫైర్ సిబ్బంది ప్రయత్నం ఫలించింది. బీ-1 బోగీలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. -
మాంసపు ముద్దల్లా ప్రయాణికులు...
అనంతపురం : అయ్యో.. పాపం... ఇలాంటి దుస్థితి పగవాడిక్కూడా రాకూడదు. అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరి నోటి నుంచి వెలువడిన మాటలివే. ఆ దృశ్యాలు చూసినవారెవరైనా కంటతడి పెట్టకమానరు. బోగి అంతా బుగ్గి బుగ్గి కావడంతో ప్రయాణికులు మాడిమసయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలి పోయాయి. అంతా మాంసపుముద్దల దిబ్బగా మారింది. తెల్లవారుజాము.. గాఢ నిద్ర... ఏసీ కోచ్‌లో సుఖవంతమైన ప్రయాణం... కాసేపట్లో గమ్యం దిగేవాళ్లు కొందరు. కొన్ని గంటల్లో తమ గమ్యాలకు చేరుకునేవాళ్లు మరికొందరు. ఇలా సాగుతున్న ప్రయాణం... ఒక్కసారిగా పెను కుదుపులకు గురైంది. చల్లని ప్రయాణం అగ్నికీలలను రాజేసింది. గాఢనిద్రలో ఉన్నవాళ్లు... తేరుకునేలోపే అంతా జరిగిపోయింది. 23 మంది ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం పలువురిని కలిచివేసింది. మరోవైపు మృతదేహాలను బోగీ నుంచి వెలికి తీసి బెంగళూరు తరలిస్తున్నారు. మృతులను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయనున్నారు. -
ప్రాణాల కాపాడుకునేందుకు తెగించి దూకేశారు
-
ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదు
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. రైలు ప్రమాదం జరగటం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించినట్లు కోట్ల తెలిపారు. అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు అయిదు లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి లక్ష, స్వల్పంగా గాయపడినవారికి యాభైవేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని కోట్ల తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ఆయన అన్నారు. పదిరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు కోట్ల పేర్కొన్నారు. మరోవైపు... సాంకేతిక సమస్యలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది పరీక్షల తర్వాత గానీ అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశముంది. -
మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా
-
భార్య మరణించినా.. 20 మందిని రక్షించాడు
అనంతపురం : పెను ప్రమాదం జరిగినప్పుడు చాకచక్యంగా స్పందించేవారు కొందరుంటారు. మానవతా దృక్పథంతో ప్రాణాలకు తెగించి మరీ తోటివారిని కాపాడడానికి ముందుకు ఉరికివస్తారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కూడా ఓ వ్యక్తి అలాగే తెగించాడు. తన జీవన సహచరి కళ్ల ముందు సజీవ దహనమైనా కన్నీటిని దిగమింగుకుంటూ తోటి ప్రయాణికులను కాపాడడంలో మునిగిపోయాడు శ్రవణ్ అనే ప్రయాణికుడు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో శ్రవణ్ భార్య, అత్త, మావయ్య అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. ఆ బాధను భరిస్తూనే అతడు... 20 మంది ప్రయాణికులను రక్షించాడు. చాకచక్యంగా వ్యవహరిస్తూ వారందరినీ ప్రమాదం నుంచి తప్పించాడు. అయితే కట్టుకున్న భార్యను.. వికలాంగుడైన ఆమె తండ్రిని మాత్రం కాపాడలేకపోయాడు. భార్యను కాపాడుకోలేకపోయాను గానీ.. దాదాపు 20 మంది ప్రాణాలను మాత్రం కాపాడగలిగానంటూ కన్నీంటి పర్యంతమయ్యాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 23మంది సజీవ దహనం కాగా, 15మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు ధర్మవరం, పుట్టపర్తి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బీ1 ఏసీ బోగీలో 57మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. -
ప్రాణాల కాపాడుకునేందుకు తెగించి దూకేశారు
అనంతపురం : చలికాలం... తెల్లవారుజాము.. చుట్టూ చీకటి.. ఆ సమయంలో ఇవి ఎవరికీ పట్టవు. ప్రాణాలు కాపాడుకుంటే చాలనిపిస్తుంది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాద విషయం గ్రహించిన కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడానికి నానా పాట్లు పడ్డారు. ప్రాణభయంతో తెగించి ముందుకు దూకారు. కొందరు ప్రయాణికులు బోగీ నుంచి ఉన్నపళంగా దూకేస్తే మరికొందరు బాత్రూమ్లోని అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రయత్నాల్లో చాలా మంది తీవ్రగాయాల పాలయ్యారు. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. క్షతగాత్రులను ధర్మవరం, అనంతపురం, పెనుగొండ, పుట్టపర్తిల్లోని ఆస్పత్రులకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తనూశ్రీ అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల రోదనలు, బంధువుల కన్నీటితో ఆస్పత్రుల ప్రాంగణాలు శోక సంద్రాల్లా మారిపోయాయి. -
మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా
అనంతపురం : బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రైల్వేశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతి చెందినవారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడినవారికి యాభైవేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు రైల్వేబోర్డు వెల్లడించింది. క్షతగాత్రుల సమాచారం కోసం : సికింద్రాబాద్ హెల్లైన్ నెంబర్లు: 040-27700868, 9701371060 వికారాబాద్ హెల్లైన్ నెంబర్లు : 08416-252215, 9701371081 ధర్మవరం హెల్లైన్ నెంబర్ : 08559 224422 గుంతకల్లు హెల్లైన్ నెంబర్లు : 0855 2220305, 09701374965 అనంతపురం హెల్లైన్ నెంబర్: 09491221390 సేదమ్ హెల్లైన్ నెంబర్: 08441-276066 బీదర్ హెల్లైన్ నెంబర్లు : 08482-226404, 7760998400 బెంగళూరు హెల్లైన్ నెంబర్లు : 080-22354108, 22259271 బెంగళూరు హెల్లైన్ నెంబర్లు: 080-22156554, 22156553 సత్యసాయి ప్రశాంతి నిలయం హెల్లైన్ నెంబర్ : 08555 280125 -
'బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటాం'
-
'బోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి'
హైదరాబాద్ : ఘోర ప్రమాదం జరిగిన బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని నార్త్ వెస్టన్ రైల్వే సీపీఆర్వో శ్రీ గుప్తా తెలిపారు. ప్రయాణికులు....ప్రమాదంపై అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారని ...అయితే మంటలు అదుపులోకి రాలేదన్నారు. కాగా మంటలు ఎందుకు చెలరేగాయనేది ఇంకా నిర్థారించలేదని శ్రీగుప్తా తెలిపారు. ఇప్పటివరకూ 23మంది ప్రయాణికులు మృతి చెందారని ఆయన వెల్లడించారు. క్షతగాత్రుల సమాచారం కోసం : సికింద్రాబాద్ హెల్లైన్ నెంబర్లు: 040-27700868, 9701371060 వికారాబాద్ హెల్లైన్ నెంబర్లు : 08416-252215, 9701371081 ధర్మవరం హెల్లైన్ నెంబర్ : 08559 224422 గుంతకల్లు హెల్లైన్ నెంబర్లు : 0855 2220305, 09701374965 అనంతపురం హెల్లైన్ నెంబర్: 09491221390 సేదమ్ హెల్లైన్ నెంబర్: 08441-276066 బీదర్ హెల్లైన్ నెంబర్లు : 08482-226404, 7760998400 బెంగళూరు హెల్లైన్ నెంబర్లు : 080-22354108, 22259271 బెంగళూరు హెల్లైన్ నెంబర్లు: 080-22156554, 22156553 సత్యసాయి ప్రశాంతి నిలయం హెల్లైన్ నెంబర్ : 08555 280125 -
మృతుల సంఖ్య పెరిగే అవకాశం:జిల్లా కలెక్టర్
-
ప్రమాద తీవ్రతకి మాంసపుముద్దలైన మృతులు
-
'బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటాం'
అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. దుర్ఘటనపై కేంద్ర రైల్వే మంత్రికి సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. సంఘటనపై రైల్వే అధికారులు సమగ్ర విచారణ చేపట్టారని అనంత వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రుల సమాచారం కోసం : సికింద్రాబాద్ హెల్లైన్ నెంబర్లు: 040-27700868, 9701371060 వికారాబాద్ హెల్లైన్ నెంబర్లు : 08416-252215, 9701371081 ధర్మవరం హెల్లైన్ నెంబర్ : 08559 224422 గుంతకల్లు హెల్లైన్ నెంబర్లు : 0855 2220305, 09701374965 అనంతపురం హెల్లైన్ నెంబర్: 09491221390 సేదమ్ హెల్లైన్ నెంబర్: 08441-276066 బీదర్ హెల్లైన్ నెంబర్లు : 08482-226404, 7760998400 బెంగళూరు హెల్లైన్ నెంబర్లు : 080-22354108, 22259271 బెంగళూరు హెల్లైన్ నెంబర్లు: 080-22156554, 22156553 సత్యసాయి ప్రశాంతి నిలయం హెల్లైన్ నెంబర్ : 08555 280125 -
రైలెక్కితే ఏకంగా అనంత లోకాలకే!
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్ఘటనకు రైల్వే శాఖే పూర్తి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులకు భద్రత ఏదంటూ వారు ఆక్రోశం చెందుతున్నారు. ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా రైల్వే శాఖ మాత్రం నామమాత్రంగా చర్యలు చేపడుతుందన్నారు. రైలు ఎక్కితే ఏకంగా అనంత లోకాలకే తీసుకు వెళుతున్నారని ప్రయాణికులు మండిపడ్డుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే రైల్వే శాఖ ఆ తర్వాత....భద్రతపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు విమర్శిస్తున్నారు. కాగా బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు చెబుతున్నారు. రైళ్ల నిర్వహణకు సంబంధించి అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వటంతో పాటు, వారికి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగించాలో కూడా తెలియదని ఉద్యోగులు అంటున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు చేసి... ప్రయాణికుల భద్రతను పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. -
మృతులలో ఇద్దరు ఆదోని వాసులు
-
మృతులలో ఇద్దరు ఆదోని వాసులు
బెంగళూరు- నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇద్దరిని కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. తెల్లవారుజామున 3.10 గంటలకు పుట్టపర్తికి 10 కిలోమీటర్ల దూరంలో పెనుకొండ- పుట్టపర్తి మధ్య ప్రాంతంలోని కొత్త చెరువు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రాత్రి 10.30 గంటలకు బెంగళూరు నుంచి నాందేడ్‌కు ఈ రైలు బయల్దేరింది. ఉన్నట్టుండి తెల్లవారుజామున బి-1 ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఆ బోగీలో మొత్తం 57 మంది ప్రయాణిస్తున్నారు. కాగా రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రైళ్లలో భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో 26 మంది దుర్మరణం
అనంతపురం: నాందేడ్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఐదుగురు చిన్నారుల సహా 26మంది సజీ వదహనమైయ్యారు. మరో 10మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో బి-1 ఏసీ బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా కొత్తచెరువు, పుట్టపర్తి రైల్వే స్టేషన్ల మధ్య రైల్లో మంటలు వ్యాపించాయి. రైల్లోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏసీ బోగీ బి వన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ బోగీలోని వారందరూ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు రైలును పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ఆపివేసి ఏసీ బోగీల లింక్‌ను తొలగించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మంటలు రెండో బోగీకి వ్యాపించాయి. ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. రెండు బోగీల్లో 72 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన 15 మంది మృత దేహాలను వెలుపలికి తీశారు. మరికొంతమంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. కొందరు ప్రయాణికులు బోగీలో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురు ప్రయాణికుల్ని చికిత్స నిమిత్తం ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిలో 12మంది మహిళలు, 12మంది పురుషులు ఉండగా, చిన్నారులు ఇద్దరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒకరు గణేష్ హైదరాబాద్ నగరానికి చెందినవాడు కాగా, సర్వమంగళి, బసవరాజు ఇరువురు ఆదోని ప్రాంతానికి చెందినవారు. అనిల్‌కుమార్ అనే వ్యక్తి ముంబాయికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. పురుషులలో మధు, రాంప్రసాద్, అనిల్ కులకర్ణి, మహిళలలో లలిత, పద్మజలు బెంగళూరు ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వార్త తెలియగానే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లను తీసుకెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇక ధర్మవరం స్టేషన్ నుంచి సహాయ సిబ్బందిని తీసుకుని ప్రత్యేక రైలు ప్రమాద స్థలానికి బయల్దేరి వెళ్లింది. సమీపంలోని పుట్టపర్తి, ధర్మవరం ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. క్షతగాత్రులను ధర్మవరం, పుట్టపర్తి ఆస్పత్రులకు తరలించారు. బోగీల నుంచి ప్రయాణికులు దిగేయడంతో ప్రాణ నష్టం కొంతవరకు తగ్గింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా, రైలు ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే మూడు ఫొరెన్సిక్ బృందాలు ఘటనా స్థలికి బయలుదేరాయి. మృతుల డీఎన్ఏ, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఫొరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించనున్నట్టు సమాచారం. రైలు ప్రమాద హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లు సికింద్రాబాద్ హెల్ప్‌లైన్: 040-27700868, 9701371060, వికారాబాద్ హెల్ప్‌లైన్: 08416-252215, 9701371081, ధర్మవరం హెల్ప్‌లైన్: 08559 224422, గుంతకల్లు హెల్ప్‌లైన్: 0855 2220305, 09701374965, అనంతపురం హెల్ప్‌లైన్: 09491221390, సేదమ్ హెల్ప్‌లైన్: 08441-276066, బీదర్ హెల్ప్‌లైన్ 08482-226404, 7760998400 -
B-1 బోగిలో మంటలు, 23 మంది మృతి
-
ఘోర రైలు ప్రమాదం..23 మంది దుర్మరణం